Wednesday, January 22, 2025

రివ్యూ: ‘చేతిలో చెయ్యేసి చెప్పు బావ’

నటీనటులు: ఆదిత్య ఓం, అరుణ్ రాహుల్, అంజన శ్రీనివాస్, రోహిణి, ఆర్ చలపతి రాజు, సుమన్, కవిత, పోసాని కృష్ణ మురళి, జయప్రకాష్ రెడ్డి తదితరులు
ఎడిటర్: వెంకటేశ్వరరావు
డిఓపి: వేణు మురళీధర్
సంగీతం: బండారు దానయ్య కవి
స్టోరీ అండ్ ప్రొడ్యూసర్: కె.జోసఫ్
స్క్రీన్‌ప్లే, కొరియోగ్రఫీ, డైరెక్షన్: కట్ల రాజేంద్రప్రసాద్

పెద్ద సినిమాలు సంక్రాంతికి వచ్చేందుకు సిద్దమవుతున్నాయి. ఈ లోపు చిన్న సినిమాలకు మంచి టైమ్. రాజేంద్రప్రసాద్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న సినిమా ‘చేతిలో చెయ్యేసి చెప్పు బావ’. నూతన సంవత్సర సందర్భంగా ఒకటవ తేదీన ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో సుమారు 65 థియేటర్లలో ఈ చిత్రం విడుదలైంది. ఈ చిత్రంలో ఆదిత్య ఓం రీ ఎంట్రీ ఫిల్మ్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందంటే..

కథ:
ప్రేమించుకున్న ఒక ప్రేమ జంట.. వారి తల్లిదండ్రులు ఇంకా ఊరి జనాలు ఒప్పుకోకపోవడంతో లేచిపోతారు. ఆ సమయంలో వారికి ఎటువంటి ఇబ్బందులు వచ్చాయి? ఆ ప్రేమ జంట అనుకున్నట్లు ఊరి జనం నుండి తప్పించుకో గలిగారా? లేదా? ఆదిత్య ఓంకు, వీరికి సంబంధమేంటి? వీరి కథలోకి ఆదిత్య ఓం ఎలా వస్తాడు? ఈ సినిమాలో గ్రామ పెద్ద వల్ల ఆ ప్రేమ జంటకు జరిగిన అన్యాయం ఏంటి? ఆ అన్యాయాన్ని ప్రజలకు తెలిసేలా చేసిందెవరు? ఎలా చేశారు? అనే ప్రశ్నలకు సమాధానం కావాలంటే ఈ చిత్రం చూడాల్సిందే.

నటీనటుల నటన:
ఆదిత్య ఓం హీరోగా మంచి మార్కులు వేయించుకుంటారు. ఆ పాత్ర తీరు హైలెట్ అనేలా ఉంది. రీ ఎంట్రీలో మంచి పాత్రని సెలక్ట్ చేసుకున్నాడని చెప్పుకోవచ్చు. ఈ చిత్రం నటిస్తూనే పూర్తిగా ఆ క్యారెక్టర్‌లో లీనమయ్యేలా చేశాడు. అదేవిధంగా నెగిటివ్ పాత్ర పోషించిన చలపతి రాజు ఆ పాత్రకు పూర్తి న్యాయం చేయడం జరిగింది. మిగతా కొత్త, పాత నటీనటులంతా కూడా తమ పాత్రకు తగ్గట్లు నటనను పండించారు. ముఖ్యంగా ప్రతి పాత్రని సహజత్వానికి దగ్గరగా దర్శకుడు మలచడంతో అందరూ తమ పాత్రకు న్యాయం చేశారు.

విశ్లేషణ:
ఇందులో సీన్‌కి తగ్గినట్లుగా ఎమోషన్స్‌ని క్యారీ చేసిన విధానం హైలెట్. సినిమాలో భయం దగ్గరి నుండి బాధపడటం వరకు, సంతోషం దగ్గర నుండి ఆ సంతోషాన్ని వ్యక్తం చేయడం వరకు ఎటువంటి ఎక్స్ప్రెషన్ అయినా క్యారీ చేయడంలో చిత్రంలో నటించిన ప్రతి ఒక్కరు కూడా చాలా పర్ఫెక్ట్ గా చేశారు. ఈ చిత్రంలో ముఖ్యంగా కథ గురించి, కథనం గురించి కచ్చితంగా మాట్లాడుకుంటారు. దర్శకుడు ఈ విషయం తన ప్రతిభను కనబరిచాడు. ఈ రెండింటిలోనూ ఎంతో జాగ్రత్త వహిస్తూ రైటర్ జోసెఫ్, దర్శకుడు రాజేంద్రప్రసాద్ ఎంతో జాగ్రత్తలు తీసుకున్నారు. అదేవిధంగా కెమెరా యాంగిల్స్, టెక్నిక్స్ తెలిసిన వ్యక్తిగా కెమెరామెన్ వేణు పనితీరు కనిపించింది. బ్యాగ్రౌండ్ మ్యూజిక్‌తో దానయ్య కవి తన పని తీరును ప్రూవ్ చేసుకున్నారు. సినిమాలో సన్నివేశానికి తగ్గట్లు పాటలు, ఇంకా అదర సాంకేతిక విలువలు కూడా చాలా అద్భుతంగా వచ్చాయి. కలరింగ్, విఎఫ్ఎక్స్.. అన్ని సినిమాకు తగినట్లుగా ఉన్నాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. ప్రస్తుతం పల్లెటూళ్లలో జరిగే ప్రేమకథలు ఎలా మలుపు తిరుగుతున్నాయో ఇందులో కళ్లకు కట్టినట్లుగా చూపించారు. ప్రేమకథలు ఇష్టపడే వారికి ఈ సినిమా బాగా నచ్చుతుంది.

ట్యాగ్‌లైన్: మీ పక్కన మీకు తెలిసి, తెలియకుండా జరిగే ప్రేమకథే..
రేటింగ్: 3/5

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x