Tuesday, March 24, 2026

ఇండో నేపాల్ అండర్ 17 కబడ్డీ పోటీల్లో ధనుంజయ రెడ్డి విజయకేతనం

ఇండో నేపాల్ అండర్ 17 “కబడ్డీ” పోటీల్లో విజయ కేతనం ఎగురవేశారు అంబవరం ధనుంజయ రెడ్డి. చిన్నప్పటి నుంచి కబడ్డీ అతని శ్వాస, అతని ధ్యాస. హైదరాబాద్ కూకట్ పల్లి వాస్తవ్యుడైన ధనుంజయ రెడ్డి కబడ్డీలో జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి, రాష్ట్ర స్థాయి నుంచి దేశ స్థాయికి ఎదిగాడు. రీసెంట్‌గా ‘‘యూత్ రూలర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా’’ ఆధ్వర్యంలో నేపాల్ లోని ఖట్మాండ్‌లో జరిగిన అండర్ 17 పోటీల్లో మెయిన్ ప్లేయర్‌గా విజయకేతనం ఎగరవేశాడు.

ఈ క్రమంలో తన కోచ్ బి. సింహాచలం అందించిన సహకారం వల్లే తనకీ అవకాశం లభించిందని, ఆయనకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు. అలాగే చిన్నప్పటి నుంచి తన తల్లిదండ్రులు మాధవ రెడ్డి, లక్ష్మీదేవి ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి తనను ఈ స్థాయికి రావడానికి కృషి చేశారని, వారికి రుణపడి ఉంటానని తెలిపారు. ఎప్పటికైనా ‘ప్రో కబడ్డీ’లో ఛాంపియన్‌గా నిలవాలన్నదే తన జీవితాశయమని ధనుంజయ రెడ్డి తెలిపారు.

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -