Sunday, March 22, 2026

‘భూత్‌ సర్కార్‌’గా ‘ఆర్జీవీ దెయ్యం’.. సెన్సార్‌ పూర్తి

రాజశేఖర్‌, స్వాతి దీక్షిత్‌ ప్రధాన పాత్ర‌ల్లో ప్రముఖ ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ‌ రూపొందించిన చిత్రం ‘ఆర్జీవీ దెయ్యం’. సాహసాలకు మారు పేరుగా పేరున్న సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌వర్మ ‘రాత్’, ‘కౌన్’, ‘భూత్’, ‘ఫూంక్’ వంటి హారర్ చిత్రాలను ప్రేక్షకులకు పరిచయం చేసిన విషయం తెలిసిందే. చాలా కాలం తర్వాత మళ్లీ ఆయన చేసిన హారర్‌ చిత్రం ‘ఆర్జీవీ దెయ్యం’. ఆల్రెడీ విడుదలై మంచి టాక్‌ సంపాదించుకున్న ఈ చిత్రాన్ని నిర్మాత అశోక్‌ కుమార్‌ వల్లభనేని ‘భూత్‌ సర్కార్‌’ పేరుతో హిందీలోకి అనువదిస్తున్నారు. ఈ డబ్‌ వెర్షన్‌కి సంబంధించి సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్‌ నుంచి ఈ చిత్రానికి యుఏ సర్టిఫికెట్‌ లభించింది. త్వరలోనే విడుదల వివరాలను తెలియజేస్తామని నిర్మాత అశోక్‌ కుమార్‌ వల్లభనేని మీడియాకి తెలియజేశారు.

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -