Wednesday, January 22, 2025

దయచేసి అవి రివీల్ చేయకండి: ‘టైగర్ 3’ టీమ్

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ జంటగా నటించిన లేటెస్ట్ భారీ బడ్జెట్ మూవీ ‘టైగర్ 3’. ఇమ్రాన్ హష్మి ఇందులో కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రంలో ప్రేక్షకులు ఊహించని సర్‌ప్రైజ్‌లు ఎన్నో ఉన్నాయి. అయితే వాటిని ముందురోజు థియేటర్స్‌లో చూసిన ప్రేక్షకులు బయటకు చెప్పవద్దని సల్మాన్, కత్రినా, ఇమ్రాన్ రిక్వెస్ట్ చేస్తున్నారు.
ఈ సందర్భంగా సల్మాన్ ‘‘చాలా ప్యాషన్‌తో టైగర్ 3 చిత్రాన్ని రూపొందించాం. అయితే ఇక్కడ స్పాయిలర్స్ నుంచి సినిమాకు రక్షణ అవసరం అనిపిస్తుంది. ఎందుకంటే సినిమాను ముందుగా చూసేవాళ్లు సినిమాకు సంబంధించిన సర్‌ప్రైజ్‌లను బయట పెడితే ఆడియెన్స్ థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్ మిస్ అవుతుంది. కాబట్టి అలాంటి పని చేయకండి. ఈ దీపావళికి టైగర్ 3 మీ అందరికీ మంచి బహుమతి అని మేం భావిస్తున్నాం’’ అన్నారు.
Link:: https://twitter.com/BeingSalmanKhan/status/1723212653433344169?t=66jGpl9XKVatl1NG0oCfZg&s=19

కత్రినా కైఫ్ మాట్లాడుతూ ‘‘టైగర్ 3 చిత్రంలో ప్రేక్షకులు ఊహించని సర్‌ప్రైజ్‌లుంటాయి. ఇది ప్రేక్షకుడికి ఓ అందమైన అనుభూతినిస్తాయి. కాబట్టి టైగర్ 3కి సంబంధించిన స్పాయిలర్స్‌ను బయటకు రివీల్ చేయకండని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ భారీ చిత్రాన్ని రూపొందించటానికి చాలా మంది అహర్నిశలు కష్టపడ్డారు. వారి కష్టాన్ని వృథా కానీయకండి. కచ్చితంగా సినిమా అందరినీ ఎంటర్‌టైన్ చేస్తుంది. హ్యాపీ దీపావళి’’ అన్నారు.
Link:
https://instagram.com/stories/katrinakaif/3233487216516076056?utm_source=ig_story_item_share&igshid=anNqZmVhMmNhNThi

ఇమ్రాన్ హష్మి మాట్లాడుతూ ‘‘టైగర్ 3 వంటి సినిమాలో చాలా ట్విస్టులు, టర్నులుంటాయి. వాటిని చాలా జాగ్రత్తగా బయటకు పొక్కనీయకుండా చూడండి. స్పాయిలర్స్ రూపంలో వాటిని బయట పెడితే తదుపరి సినిమాను చూసే ప్రేక్షకుడికి బ్యూటీఫుల్ ఎక్స్‌పీరియెన్స్ మిస్ చేసినవాళ్లం అవుతారు. ఈ విషయంలో ప్రేక్షకులు తమ సహకారాన్ని అందిస్తారని భావిస్తున్నాం. హ్యాపీ దీపావళి’’ అన్నారు.
Link:
https://x.com/emraanhashmi/status/1723213396173300199?s=46&t=NUtOzfQa2_PTnT7Cp754NQ

ప్రముఖ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్‌లో ఇప్పటి వరకు ఏక్ థా టైగర్, టైగర్ జిందా హై, వార్, పఠాన్ వంటి బ్లాక్ బస్టర్స్ ఆడియెన్స్‌ని అలరించారు. ఇప్పుడు ఈ స్పై యూనివర్స్‌లో భాగంగా టైగర్ 3 మెప్పించనుంది. మనీష్ శర్మ దర్శకత్వంలో ఆదిత్య చోప్రా నిర్మాణంలో రూపొందిన ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని హిందీ, తమిళ, తెలుగు భాషల్లో నవంబర్ 12న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేయనున్నారు.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x