Friday, November 1, 2024

మాజీ ఉపరాష్ట్రపతికి నచ్చిన ‘శాంతల’.. నేషనల్ అవార్డ్ పక్కా

భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ “శాంతల చలనచిత్ర ప్రివ్యూ ని శుక్రవారం వీక్షించాను. అద్భుతమైన కళాత్మక చిత్రం ఇది. నాట్య కళ, మహిళా సాధికారికత ఇతివృత్తంగా చారిత్రక నేపథ్యం లో నిర్మించిన చిత్రం ఇది. సినిమా చూస్తున్నప్పుడు నాకు కన్నీళ్లు ఆగలేదు. భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోయాను. కొత్త నటీనటులైనప్పటికీ అద్భుతంగా నటించారు. కుటుంబ సమేతంగా చూడదగిన చిత్రం. ఈ చిత్రం జాతీయ అవార్డులు సాధించగలదని ఆశిస్తున్నాను. ఇంత మంచి సినిమాని అందించినందుకు దర్శకుడు శేషు ను అభినందిస్తున్నాను. శేషు ఇంతకు మునుపు అక్కినేని ఫామిలీ తో పని చేసారు, దర్శకుడిగా ఇది తన మొదటి చిత్రం.

ఇండో అమెరికన్ ఆర్ట్స్ పతాకంపై కె ఎస్ రామారావు గారి సమర్పణలో అమెజాన్ ప్రైమ్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఫ్యామిలీ మాన్ ఫేమ్ అశ్లేష ఠాకూర్ ప్రధాన పాత్రలో నీహల్ హీరోగా త్రివిక్రమ్ శేషు దర్శకత్వం లో డాక్టర్ ఇర్రింకి సురేష్ నిర్మించిన పీరియడ్ చిత్రం శాంతల. ఈ చిత్రం నవంబర్ 24న విడుదల కు సిద్ధంగా ఉంది. అయితే ఈరోజు భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఈ శాంతల చిత్రాన్ని వీక్షించి సినిమా అద్భుతంగా ఉంది, నేషనల్ అవార్డు రావాలి అని కొనియాడారు.

శాంతల చిత్రం నిర్మాణపరంగా, సాంకేతికంగా ఎంతో ఉన్నతంగా ఉంది. కెమెరా పనితనం,నేపథ్య సంగీతం, నృత్యాలు, కూర్పు అద్భుతంగా ఉన్నాయి. ఇంతటి మంచి అభిరుచితో సినిమా నిర్మించిన ప్రముఖ నిర్మాత కె ఎస్ రామారావు గారు, శ్రీ సత్య, దర్శకుడు శేషు బాబు, సంగీత దర్శకుడు విశాల్ చంద్రశేఖర్, డైరెక్టర్ ఆఫ్ సినిమాటోగ్రఫీ రమేష్, నటీనటులు అశ్లేష ఠాకూర్ నిహాల్ తదితరులకు, ఇతర సాంకేతిక సిబ్బంది అందరికీ నా అభినందనలు. నవంబర్ 24 న తెలుగు, హిందీ, కన్నడ, తమిళం, మరాఠీ మరియు మలయాళం భాషల్లో విడుదల అవుతుంది” అని తెలిపారు

చిత్రం పేరు : శాంతాల
బ్యానర్ : ఇండో అమెరికన్ ఆర్ట్స్
సమర్పణ : ఇర్రింకి సుబ్బలక్ష్మి
సంగీత దర్శకుడు : విశాల్ చంద్రశేఖర్
కెమెరా మాన్ : రమేష్ ఆర్
దర్శకుడు : శేషు పెద్ది రెడ్డి
నిర్మాత : డాక్టర్ ఇర్రింకి సురేష్
పి ఆర్ ఓ : పాల్ పవన్
డిజిటల్ పి ఆర్ ఓ : వంశి సినీ డిజిటల్

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x