Thursday, April 3, 2025

అభయ గణపతి ఆలయాలకు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్‌చే అఖండ పూజార్చనలు.. ఎప్పుడంటే?

Puranapanda Srinivas: జంటనగరాలలో ఇరవైఒక్క అభయ గణపతి ఆలయాల నిర్మాణానికి రంగం సిద్ధమైంది. అతి అరుదైన కృష్ణశిలతో వివిధ ప్రాంతాల్లో నిర్మితమయ్యే ఈ ఆలయాలకు ప్రముఖ రచయిత, జ్ఞానమహాయజ్ఞ కేంద్రం సంస్థాపకులు పురాణపండ శ్రీనివాస్ ఆలయనిర్మాణ పూజలు నిర్వహిస్తారు.

ఇరవై ఒక్క ఆలయాల్లో మొదటిగా హైదరాబాద్ త్యాగరాయగానసభలో నిర్మితమైన అభయగణపతి ఆలయానికి శృంగేరి పండితుల వైదిక మంత్రశబ్దాలమధ్య ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ ఏప్రిల్ 4న పూజార్చనలు నిర్వహిస్తారని త్యాగరాయగానసభ అధ్యక్షులు కళా జనార్ధనమూర్తి తెలిపారు.
రెండున్నర అడుగుల ఎత్తు, వెడల్పుతో, అరుదైన పవిత్ర కృష్ణ శిలతో ఈ అభయగణపతి శిల్పాన్ని తమిళనాడులో తయారు చేయించినట్లు జనార్ధనమూర్తి చెప్పారు.

Sri Abhayaganapthi Devalayam
Sri Abhayaganapthi Devalayam

వందల, వేల కళాకారులకు, రచయితలకు, నాట్యకారిణులకు, గాయనీ, గాయకులకు ముఖద్వారంగా సుమారు ఆరు దశాబ్దాల కీర్తిని జాతీయ స్థాయిలో మూట కట్టుకున్న త్యాగరాయగాన సభలో ఇలాంటి దైవీయ కార్యక్రమానికి తెరతీయడంపట్ల పలువురు హర్షం వెలిబుచ్చుతున్నారు.
ఈర్ష్యాసూయలు, కపటం, కల్మషాలు మన దగ్గరకి చేరనివ్వద్దని ప్రతీ సభలో అద్భుతమైన కథలతో హెచ్చరించే పురాణపండ శ్రీనివాస్ మానవ విలువలకు పెద్దపీట వేస్తారని తెలుగు రాష్ట్రాల్లో వేలకొలది భక్త రసజ్ఞులకు తెలుసున్న అంశమే! భారతీయ వైదిక, ధార్మిక అంశాలకు చెందిన పరమసత్యాల గ్రంధాలతో దూసుకుపోతున్న పుస్తక మాంత్రికునిగా పురాణపండ శ్రీనివాస్ ఈ అభయ గణపతి మంగళ కార్యానికి హాజరవ్వడం గణపతి భగవానుని విశేష అనుగ్రహంగా మేధో సమాజం పేర్కొనడం గమనార్హం.

Puranapanda Srinivas
Puranapanda Srinivas

ఈ అభయగణపతి ప్రతిష్టాపనలో తమను ప్రోత్సహించిన సీనియర్ ఐఏఎస్ అధికారి కేవి రమణాచారి, కిమ్స్ హాస్పిటల్స్ ఫౌండర్ చైర్మన్ బొల్లినేని కృష్ణయ్య తదితరులకు జనార్ధనమూర్తి కృతజ్ఞతలు ప్రకటించారు.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x