2001లో చిరు సంస్థగా ప్రారంభించబడి , రెండు దశాబ్దల కాలంలో 1000 కి పైగా టాలెంట్స్ ను ఇటు టాలీవుడ్ నుండి బాలీవుడ్ కు, బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి పరిచయం చేసిన సంస్థ గ్లిట్టర్ ఫిలిం అకాడమీ . ఈ సంస్థను స్థాపించిన దీపక్ బల్దేవ్ ఈ సంస్థను దిగ్విజయంగా నడిపించడంతోపాటు ప్రొడ్యూసర్ గా డైరెక్టర్ గా అంచలంచెలుగా తన ప్రస్థానాన్ని ఇటు టాలీవుడ్ లోనూ, అటు బాలీవుడ్ లోను తన సక్సెస్ బావుట ఎగరవేస్తున్నారు. ఈ నేపథ్యంలో దీపక్ బల్దేవ్ తన మనసులోని మాటలను మీడియాతో పంచుకున్నారు.

2001లో నేను ఈ యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ స్థాపించినప్పుడు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను. ఇన్ని సంవత్సరాల తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే నేను సాధించింది చాలా ఎక్కువ అని చెప్పాలి. నేను అటు బాలీవుడ్ లోనూ ఇటు టాలీవుడ్ లోనూ నాకంటూ ప్రత్యేకత సంపాదించుకున్నందుకు గర్వంగా ఉంది. 2001లో కేవలం పది మందితో స్థాపించబడిన ఈ సంస్థ నేడు వెనక్కి చూసుకుంటే 1000 మంది యంగ్ టాలెంట్స్ ను నేషనల్ వైడ్ గా అన్ని లాంగ్వేజెస్ లోనూ గ్లిట్టర్స్ ఫిలిం అకాడమీ స్టూడెంట్స్ ఉన్నారని చెప్పుకోవడం సంతోషంగా ఉంది. నా పరంగా చూసుకుంటే చిరుత ఫేమ్ నేహా శర్మ, పెళ్లయినకొత్తలో ఆస్తాసింగ్, హైదరాబాద్ నవా బ్ వందనా గుప్తా, ప్రస్థానం హీరోయిన్ రూబీ వంటి హీరోయిన్లను బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి పరిచయం చేశాను. అలాగే 2012లో హింది జానీగద్దర్ రీమేక్ కమీనా సినిమాను తెలుగులో ప్రొడ్యూస్ చేసాను .అలాగే 2016లో గ్లిట్టర్ ఫిలిం అకాడమీకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా( ఎం ఈ ఎస్సీ) సంస్థ నుండి సౌత్ ఇండియాలోనే బెస్ట్ ఇన్స్టిట్యూట్ గా అవార్డు తీసుకోవడం సంతోషంగా ఉంది. అలాగే నా డైరెక్షన్లో ఈ క్వాబ్ సారే జూతే సినిమా ఏడు రోజుల్లో నిర్మించి శభాష్ అనిపించుకున్నాను.

అప్పటి మా కెమెరామెన్ జవహర్ రెడ్డి గారు ఇప్పటికీ అప్పుడప్పుడు సర్ప్రైజ్ అవుతూనే ఉంటారు.(ఇన్ని తక్కువ రోజుల్లో సినిమా చేసినందుకు)ఇంకో విషయం ఏంటంటే ఆ చిత్రం 2021 గాను ఐఫా అవార్డుకు ఎంపికైంది. అలాగే 20 20 లో ఎన్టీఆర్ తల్లిగా దేవర సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటి జరీనా వహాబ్ తో” తూబేకబర్” ఓటీటీ సినిమా చేశాను. అలాగే నెక్స్ట్ ఇయర్లో ఫుల్ మూన్ సినిమా తీయబోతున్నాను. ఆ సినిమా ఒక ప్రముఖ బాలీవుడ్ హీరో తో నిర్మించబోతున్నాను. మన తెలుగులో సందీప్ రెడ్డి వంగ, సంకల్ప రెడ్డి లాగా ఆ సినిమా నాకు మైల్డ్ స్టోన్ అవుతుందని ఆశిస్తున్నాను. వీటితోపాటు చుంకీ పాండే, ఆదిత్య పాంచ్చోలి, నితిన్ ముఖేష్ లకు సౌత్ లో సెలబ్రిటీ మేనేజ్మెంట్ చేస్తున్నాను. రీసెంట్ గా బలంగం సంజయ్, పుష్పలో చేసిన రాజ్, మధునంబియార్ ,ఆర్య వంటి వాళ్ళు యంగ్ స్టార్స్ ఈరోజు టాలీవుడ్ లో చక్కగా రాణిస్తున్నారు.

నాకున్న స్పెషాలిటీ ఏంటంటే అటు బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కు చాలామంది ఆర్టిస్టులను ఇచ్చాను. అలాగే బిజినెస్ యాస్పెక్ట్ లో కూడా నేను చాలా సినిమా కంపెనీలకు వారధిగా ఉన్నాను . ఈ కాస్టింగ్ అనేదానికి ఒక బ్రాండ్ ఇమేజ్ తీసుకురావాలనుకుంటున్నాను. అంతేగాని ఓ మోడల్ కోఆర్డినేటర్ లాగా మిగిలిపోదాం అనుకోవట్లేదు. నాకున్న మరో స్పెషాలిటీ ఏంటంటే నా దగ్గర టాలెంట్ బ్యాంకు ఉంది ఆ బ్యాంకుతో మేకర్స్ కి, మంచి క్వాలిటీ ఉన్న పీపుల్ ని అందించగలను. అలాగే ఏ కథకు ఎవరు సూట్ అవుతారో జడ్జి చేసి చెప్పగలను అని అన్నారు.