కింగ్ నాగార్జున హీరోగా అహిషోర్ సాల్మన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘వైల్డ్‌డాగ్’. మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై నిరంజన్‌రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 2న గ్రాండ్‌గా విడుదల అవుతున్న సందర్భంగా చిత్ర దర్శకుడు అహిషోర్ సాల్మన్ మీడియాకు చిత్ర విశేషాలను తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ..
ఓ చిన్న న్యూస్ ఆర్టికల్ చదివి ఇన్‌స్పైర్ అయ్యి వైల్డ్‌డాగ్ కథ రాసుకున్నాను. 2007లో గోకుల్ చాట్, లుంబినీ పార్క్‌లో బాంబ్ బ్లాస్ట్‌లు జరిగాయి. అప్పటినుంచి 2015 వరకు మన దేశంలో చాలా చోట్ల బాంబ్‌బ్లాస్ట్‌లు జరిగాయి. వీటి వెనక ఐఎస్‌ఐ హస్తం ఉందని భావించిన కేంద్రప్రభుత్వం ఈ కేసులను ఎన్‌ఐఏ (నేషనల్ ఇన్విస్టిగేషన్ ఏజెన్సీ)కి అప్పగించింది. అందుకే ఓ అండర్‌కవర్ ఆపరేషన్ చేసింది. ఈ వాస్తవ సంఘటనలకు కొన్ని కల్పిత అంశాలు జోడించి వైల్డ్‌డాగ్‌ను తెరకెక్కించాము. ఆరు పాటలు, ఓ కామెడీ ట్రాక్ ఉండే సినిమా కాదు ఇది. ఈ సినిమా ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుంది. అవసరమైన సన్నివేశాల్లో తెలుగు ప్రేక్షకులకు తగ్గట్లుగా సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నాం.
నేను జర్నలిజంలో మాస్ కమ్యునికేషన్స్ చేశాను. నా స్నేహితులు కొందరు జర్నలిజంలో ఉన్నారు. ముంబై, బెంగళూరులో ఉన్నవారిని అడిగి ఎన్‌ఐఏ గురించి, బాంబ్ బ్లాస్ట్‌ల గురించి కొంత రీసెర్చ్ చేశాను. పబ్లిక్‌డొమైన్‌లో ఉన్న కొన్ని పుస్తకాలు చదివి, ఆ అంశాలను వైల్డ్‌డాగ్ సినిమాలో పొందుపరచాము.
ఈ అండర్‌కవర్ ఆపరేషన్ చేసే వ్యక్తుల వివరాలు చాలా గోప్యంగా ఉంటాయి. ఈ ఆపరేషన్‌లో వారు మరణించిన ఎవరికి తెలియని పరిస్థితి ఉంటుంది. ఒకవేళ వీరి సీక్రెట్ ఆపరేషన్ సక్సెస్ అయినా కూడా వీరి గురించిన వివరాలు రహాస్యంగానే ఉంటాయి. అందుకే వారిని ఆన్‌సంగ్ హీరోలు అంటారు. ఇలాంటి కథను తెలుగు ప్రేక్షకులకు చెప్పాలనిపించింది.
కొత్త దర్శకులను, విభిన్న తరహా కథలను నాగార్జునగారు బాగా ప్రొత్సహిస్తారు. శివ, గీతాంజలి, అన్నమయ్య, ఊపిరి వంటి డిఫరెంట్ సినిమాలను మొదట ప్రయత్నించింది నాగార్జున గారే. అందుకే వైల్డ్‌డాగ్ సినిమాలో నాగార్జునగారు అయితే బాగుంటుందని, ఆయనకు కథ వినిపించాను. కథ నచ్చి ఆయన ఒకే అన్నారు. నాగార్జునగారి ఊపిరి సినిమాకు నేను కో రైటర్‌గా వర్క్ చేశాను. ఆ సమయంలో నాగార్జునగారితో మంచి అనుబంధం ఏర్పడింది. నిర్మాత నిరంజన్‌రెడ్డిగారు వైల్డ్‌డాగ్ సినిమా గురించి చెప్పగానే, అహిషోర్ నాకు తెలుసు అని నాగార్జునగారు ఈ కథకు ఒకే చెప్పారు. ఈ సినిమాలోని ప్రతి క్యారెక్టర్ హైలైట్‌గా ఉంటుంది. బిగ్‌బాస్ ఫేమ్ అలీ రెజాను నాగార్జునగారే సజెస్ట్ చేశారు.
వైల్డ్‌డాగ్ సినిమా మేజర్‌గా నేపాల్ బ్యాక్‌డ్రాప్‌లో జరుగుతుంది. థాయ్‌ల్యాండ్‌లో ఓ షెడ్యూల్ ప్లాన్ చేశాం. ఆ సమయంలో విదేశాల్లో లాక్‌డౌన్ రావడం, కరోనా పరిస్థితుల వల్ల వీలుపడలేదు. సిక్కింలో షూటింగ్ చేసేందుకు లొకేషన్స్ రెక్కీ చేశాం. స్టేట్ లెవల్ లాక్‌డౌన్ రావడంతో అక్కడ కూడా చేయలేకపోయాం. కరోనా ప్రభావం తగ్గి షూటింగ్ పర్మిషన్స్ వచ్చిన తర్వాత మొదట షూటింగ్ చేసుకునేందుకు హిమాచల్‌ప్రదేశ్ ప్రభుత్వం పెద్దగా ఆంక్షలు పెట్టలేదు. సినిమాను త్వరగా పూర్తి చేయాలని వెంటనే అక్కడికి వెళ్లి షూట్ చేశాం. మేం ఊహించినదాని కంటే మంచి లొకేషన్స్ దొరికాయి. మంచి యాక్షన్ ప్యాక్డ్ మూవీ ఇది. డేవిడ్, శ్యామ్ మంచి యాక్షన్ సీక్వెన్స్‌లను డిజైన్ చేశారు. 20 వేల అడుగుల ఎత్తులో ఓ యాక్షన్ సీన్‌ను షూట్ చేశాం.
ఈ సినిమాకు ఓటీటీ ఆఫర్ వచ్చింది. ప్రాఫిట్‌లో ఉంటాం. ఓకే చెబుదామా? అని నిరంజన్‌రెడ్డిగారు అన్నారు.. నేను సానుకూలంగానే స్పందించాను. కానీ అదే సమయంలో యాభైశాతం థియేటర్ ఆక్యుపెన్సీతో విడుదలైన క్రాక్ సినిమా మంచి కలెక్షన్స్‌ను రాబట్టింది. దీంతో మా సినిమాను కూడా థియేటర్స్‌లోనే విడుదల చేద్దామని డిసైడ్ చేశాం. నిజానికి వైల్డ్‌డాగ్ సినిమాను థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ కోసమే తీశాం. కానీ పరిస్థితుల కారణంగా ఓటీటీ ఆలోచన చేశాం. థియేటర్స్‌లో వైల్డ్‌డాగ్ సినిమా ఆడియన్స్‌ను థ్రిల్ చేస్తుంది.
మహర్షికి జాతీయఅవార్డు రావడం హ్యాపీ
జాతీయ అవార్డులు సాధించిన మహర్షి సినిమాలో నేను ఒక భాగమైనందుకు సంతోషంగా ఉంది. వంశీ, నేను, హరి కలిసి మహర్షి కథను రాశాం. కేవలం సందేశాత్మకగా చిత్రంగానే కాకుండా మహేశ్‌బాబులాంటి స్టార్ ఇమేజ్‌కి, డైరెక్టర్ వంశీ విజన్‌కు తగ్గట్లు అన్ని కమర్షియల్ అంశాలను జోడించి కథ రాయడం ఒక చాలెంజ్.
రెండు మూడు సినిమాలు క్యాన్సిల్ కావడం వల్ల డైరెక్టర్‌గా నాకు గ్యాప్ వచ్చింది. నెక్ట్స్ రెండు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. త్వరలో వివరాలను వెల్లడిస్తాను.