‘కాంగ్రెస్ టూల్ కిట్’ పేరుతో కొన్ని డాక్యుమెంట్స్‌ను షేర్ చేస్తూ బీజేపీ నేతలు కాంగ్రెస్‌పై ట్వీట్లతో విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. బీజేపీ, ప్రధాని మోదీల ప్రతిష్ఠను భంగపరిచేందుకే కాంగ్రెస్ ఈ టూల్‌కిట్‌ను తీసుకొచ్చిందని అనేకమంది బీజేపీ నేతలు ఇప్పటికే ఎన్నో ట్వీట్లు చేశారు. అయితే బీజేపీ నేతలు చేస్తున్న ఈ ట్వీట్లకు ‘మ్యానిప్యులేటెడ్ మీడియా’ అనే ట్యాగ్ ఇవ్వడం మొదలు పెట్టింది. దీంతో ట్విటర్-బీజేపీ మధ్య వార్ మొదలైంది. ఆ ట్యాగ్‌ను తొలగించాలని బీజేపీ డిమాండ్ చేస్తుండగా.. ఎట్టిపరిస్థితుల్లో ఆ ట్యాగ్ తొలగించబోమంటూ ట్విటర్ పట్టుదలగా ఉంది. ఈ క్రమంలోనే తాజాగా మరో బీజేపీ నేత, తెలంగాణ బీజేపీ అధ్యక్షడు బండి సంజయ్ ట్వీట్‌కు కూడా ఇదే తరహా ట్యాగ్ ఇచ్చింది ట్విటర్. దీంతో తెలంగాణ బీజేపీలో ఈ ట్యాగ్ వచ్చిన తొలి నేతగా సంజయ్ నిలిచారు.
బండి సంజయ్ తన ట్వీట్‌లో ‘కాంగ్రెస్ టూల్ కిట్’ను షేర్ చేశారు. ‘అంత్యక్రియలకు సంబంధించి మార్పులు చేసిన ఫోటోలు వాడడం, కొత్త కరోనా స్ట్రెయిన్‌ను ఇండియా స్ట్రెయిన్ అనడం, సోషల్ మీడియా వాలంటీర్ల ద్వారా ఆ కొత్త కరోనా స్ట్రెయిన్‌ను మోదీ స్ట్రెయిన్ అని పిలవమని చెప్పడం అన్నీ బయటపడ్డాయి. ప్రస్తుతం దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుంటే.. ఈ పరిస్థితిని కూడా తమకు అనుకూలంగా వినియోగించుకుంటూ వారి స్వలాభం కోసం దేశ ప్రధానిని, దేశాన్ని దిగజార్చడమే కాంగ్రెస్ ధ్యేయం’ అని రాసుకొచ్చారు. సంజయ్ చేసిన ఈ ట్వీట్‌కు ‘డిసెప్టివ్‌లీ ఆర్టర్డ్ ఆర్ ఫ్యాబ్రికేటెడ్’ అని ట్విటర్ ట్యాగ్ ఇచ్చింది.
‘Use dramatic pictures of funerals’
‘Call new strain ‘Indian Mutant’
‘Asking Social media volunteers to call it Modi Strain’
Exposed !
Using a pandemic crisis to tarnish our Prime Minister and country for their own party to flourish is what Congress stands for. pic.twitter.com/C21WGaHOS3— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) May 18, 2021
కాగా.. బండి సంజయ్‌తో పాటు బీజేపీ జాతీయ ప్రతినిది సంబిత్ పాత్రా ట్వీట్‌కు కూడా ట్విటర్ ఇలానే ట్యాగ్ చేజ్ చేసింది. ఇక ఇప్పటికే ‘కాంగ్రెస్ టూల్ కిట్’ అని చెబుతున్న ఫైల్‌ను షేర్ చేసిన ప్రతి బీజేపీ నేత ట్వీట్‌కు ఇలాంటి ట్యాగ్‌నే ట్విటర్ ఇచ్చింది. అనేకమంది బీజేపీ నేత మరి దీనిపై బీజేపీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.