Wednesday, January 22, 2025

ప్రారంభమైన శ్రీనివాస్ జొన్నలగడ్డ చిత్రం “ఆటో రజిని”

శ్రీనివాస్ జొన్నలగడ్డ ఫిలిమ్స్, శ్రీ మహాలక్ష్మి ఎంటర్ప్రైజెస్ పతాకంపై జొన్నలగడ్డ హరికృష్ణ, ప్రీతి సేన్ గుప్తా జంటగా శ్రీనివాస్ జొన్నలగడ్డ దర్శకత్వంలో సావిత్రి.జె నిర్మిస్తున్న  “ఆటో రజిని” చిత్రం పూజా కార్యక్రమాలు హైదరాబాదులోని రామానాయుడు స్టుడియోలో సినీ,రాజకీయ అతిరదుల సమక్షంలో ఘనంగా జరుపుకుంది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన బాపట్ల ఎం. పి నందిగం సురేష్ గారు తొలి ముహూర్తపు సన్నివేశానికి హీరో, హీరోయిన్ పై క్లాప్ కొట్టగా, ఆంద్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని  గారు  కెమెరా స్విచ్చాన్ చేశారు. మధుసూదన్ రెడ్డి, సిద్దార్థరెడ్డి ,గౌతంరెడ్డి మొదలగు వారందరూ గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో

పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ… మహాలక్ష్మి ఎంటర్ప్రైజెస్ మూవీస్ ఆధ్వర్యంలో మన జొన్నలగడ్డ శ్రీనివాసరావు గారి దర్శకత్వంలో జొన్నలగడ్డ సావిత్రి గారి నిర్మాణంలో వారి తనయుడు హరికృష్ణ హీరోగా, ప్రీతి సేన్ గుప్తా హీరోయిన్ గా ఈరోజు సినిమా ప్రారంభించడం జరిగింది.ఈ సినిమా మంచి విజయవంతం అవ్వాలని మా జొన్నలగడ్డ శ్రీను వారి కుటుంబానికి ఆర్థికంగా మంచి లాభాలు రావాలని అదేవిధంగా దీంట్లో నటించే నటీనటులకు టెక్నీషియన్స్ లకు మంచి పేరు ప్రఖ్యాతలు రావాలి. హీరో, హీరోయిన్స్ అందరు కూడా పదికాలాలపాటు ఇండస్ట్రీలో నటీనటులుగా వెలుగొందాలని ఈ సినిమాకు దేవుడు ఆశీస్సులు ఉండాలి.ఈ సినిమాలో నటించే నటులకు, టెక్నీషియన్స్ అందరికీ
బెస్ట్ ఆఫ్ లక్ తెలియజేశారు.

అలాగే సినిమా ఇండస్ట్రీ విషయానికి వస్తే ముందుగా గతంలో ఎగ్జిబిటర్స్, ప్రొడ్యూసర్స్ హీరోలు,దర్శకులు మాకు రేట్లు పెంచుకోవడానికి పర్మిషన్ ఇవ్వమని గత ప్రభుత్వాన్ని కోరారు.దానికి వారు పర్మిషన్ ఇవ్వకపోతే కోర్టుకెళ్లి మా సినిమాలకు రేట్లు పెంచు కోవడానికి పర్మిషన్ ఇవ్వడం లేదని కోర్టుకెళ్లారు దానికి కోర్టు చెప్పింది ఏందంటే మీరు ఒక కమిటీ వేసుకొని కమిటీ నిర్ణయాన్ని మా దృష్టికి తీసుకొస్తే మేము తగిన నిర్ణయం తీసుకుంటామని కోర్టు చెప్పడం జరిగింది. అయితే గత ప్రభుత్వం  చంద్రబాబు నాయుడు గారు కమిటీ వేయలేదు. కమిటీ వేయలేదని మళ్ళీ వీరందరూ కోర్టుకెళ్లారు. అయితే కోర్టు మీరు కమిటీ వేసి నిర్ణయం తీసుకునే వరకు మీరు ఎంతైనా టికెట్ రేట్లు అమ్ముకొని కోర్టు డైరెక్షన్ ఇచ్చింది.

గతంలో విడుదలైన సినిమాలు 50 రోజులు నుండి 100 రోజులు వరకు అడేవి. అయితే కోర్టు ఇచ్చిన ఆ జీవోను అడ్డం పెట్టుకొని సినిమాను ఎక్కువ థియేటర్లలో విడుదల చేసి బెనిఫిట్ షోల పేరుతొ ఎక్కువ రేట్లకు టికెట్లు అమ్ముతూ  ప్రజలను ఇబ్బంది కలిగిస్తున్నారనే కంప్లంట్స్ చాలా వచ్చాయి.ఈ విషయాన్ని చాలా మంది సినీ పెద్దలు కూడా  ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు అందుకే ఎవరికీ ఇబ్బంది కలగకుండా మేము తగిన చర్యలు  తీసుకోవాలని కుంటున్నాము.

ఆ జీవోను అడ్డం పెట్టుకొని  ప్రజానీకానికి ఇబ్బంది కలిగిస్తున్నారని మా దృష్టికి రావడంతో దాన్ని అరికట్టాలని ఏ హైకోర్టు అయితే  పర్మిషన్ ఇచ్చిందో దాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీ వేసి ఎక్కడెక్కడ ఏం రేట్లు ఉండాలనే నిర్ణయం తీసుకుంది ఆ నిర్ణయం ప్రకారం టికెట్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది ఈ విషయంపై మళ్లీ కోర్టుకెళ్లారు కమిటీ నిర్ణయాన్ని కట్టుబడి  ఉండాలని కోర్టు చెప్పింది

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్కడున్న ప్రజలను ఎగ్జిబిటర్స్, థియేటర్ యాజమాన్యం వారిని దృష్టిలో పెట్టుకొని సినిమా ప్రొడ్యూసర్స్ తో మా పేర్ని నాని గారి ఆధ్వర్యంలో చర్చలు జరుపుతున్నారు. అయితే నిర్మాతలు మా ప్రభుత్వానికి కొన్ని సలహాలు సూచనలు చేశారు వాటిని  మేం ఎంతవరకూ చేయగలమో చూసుకొని వాటిని మా ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకెళ్లి చర్చించి అందరికీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా సామరస్యమైన వాతావరణంలో సమస్యను పరిష్కరిస్తాము.

అంతే కానీ నలుగురు హీరోలు ,నలుగురు దర్శకులు, నలుగురు నిర్మాతలకు సంబంధించింది కాదు ఈ ఇండస్ట్రీ. సినీ పరిశ్రమ అనేది కొన్ని వేల మందికి జీవనోపాధి కలిగించేది సినీ పరిశ్రమ ఇక్కడున్న ప్రతి టెక్నీషియన్ కి సినిమానే లోకంగా బతికే ప్రతి డిస్ట్రిబ్యూటర్ నిర్మాతలకు ప్రతి ఒక్కరికీ న్యాయం జరగాలి అదేవిధంగా ప్రజలకు కూడా అన్యాయం జరగకూడదనే తపనతో మా ప్రభుత్వం అందరిని కలుపుకొని చిన్న సినిమా, పెద్ద సినిమా అనేది లేకుండా చిన్న నిర్మాతలు, పెద్ద నిర్మాతలు అని చూడకుండా అందరిని బతికించాలనేది మా ప్రభుత్వం నిర్ణయం. అందుకే ఈ విషయాన్ని జగన్ మోహన్ రెడ్డి గారు ఆలోచించి తగు చర్యలు అందరికీ ఆమోదయోగ్యమైన ఉండేలా అందరికి న్యాయం జరిగేలా ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకుంటుంది. అలాగే సినీ పరిశ్రమను రక్షించడానికే వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎప్పుడూ ముందు ఉంటుంది .నలుగురికి ఇబ్బంది కలిగితే కలగచ్చు గానీ 90% మందికి మేలు జరుగుతుంది

ఒక సినిమాను దృష్టిలో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోదు ఓవరాల్ గా ఇండస్ట్రీలో దృష్టిలో పెట్టుకొని చూస్తుంది . ప్రస్తుతము సినిమా ఒక హైదరాబాదు లో మాత్రమే షూటింగ్ జరగట్లేదు ప్రపంచ వ్యాప్తంగా వెళ్లి షూటింగ్ జరుపు కుంటున్నారు మేము తెలుగు సినిమాని ఆంధ్రప్రదేశ్ లో కొంత తీయాలి అని కోరుకునే వ్యక్తులము మేము కచ్చితమైన నిబంధనలతో  ఖచ్చితంగా సినిమా ఇక్కడే తీయాలని మాకు లేదు. ఆంధ్రప్రదేశ్లో కూడా సినిమా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాము. ఈ సినిమా నిర్మాతలకు, హీరోలకు, దర్శకులకు, టెక్నీషియన్లకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి మాకు ఈ రకమైన సౌకర్యాలు కావాలని ,మాకు అన్ని సౌకర్యాలు కల్పిస్తే సినిమా ఇక్కడ తీస్తామని వస్తే తప్పకుండా మా సహాయ సహకారాలు కచ్చితంగా ఉంటుంది

చాలామంది చిన్న సినిమా నిర్మాతలు ప్రెస్మీట్లు పెట్టి మా సినిమా రన్నింగ్ లో ఉండగా పెద్ద సినిమా ఉందని మా సినిమా తీసేస్తున్నారని చాలామంది ప్రెస్మీట్లు పెట్టి వారు వ్యతిరేకతను చాటుకున్నారు. వాటిని అడ్డుకట్ట వేసి చిన్న సినిమా, పెద్ద సినిమా అనే భేదం లేకుండా అందరు నిర్మాతలు  కూడా సమానంగా సినిమా రిలీజ్ చేసుకోవాలని కోరుతున్నాము

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకూ 30 సినిమాలు చేశాడు ఆయనను ఎవరూ టార్గెట్ చేయలేదు.ఇన్ని సినిమాలు చేసిన పవన్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని మమ్మల్ని ఏమైనా చేయగలిగాడా.. తను ఇంకా 30 సినిమాలు చేసిన ఏమైనా చేయగలడా ..పవన్ కళ్యాణ్ గారి సినిమా సూపర్ హిట్ అయినా..ఫ్లాప్ అయినా మాకు ఏమైనా లాభమా..మేము ఎప్పుడూ ఒక వ్యక్తిని దృష్టిలో పెట్టుకొని చూడాల్సిన అవసరం మాకు లేదు. పవన్ కళ్యాణ్ ని టార్గెట్  చేయాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డి గారికి  లేదు.

పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ కి ఏం చూసాడు ,మేమేమైనా చేతులకు గాజులు తొడుక్కొని కుచున్నామా పవన్ కళ్యాణ్ అంటే అదిరిపోయే బెదిరిపోయి కంగారుపడి పారిపోయే బ్యాచ్ మాది కాదు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి ఎవ్వరు సపోర్ట్ అవసరం లేదు .వారికి ఆంధ్రప్రదేశ్లో ప్రజల సపోర్ట్ ఉంది పైన ఉన్న భగవంతుడు సపోర్ట్ ఉంది రాజశేఖర్ గారికి అండ ఉంది. మేము ఇటువంటి ఉడుత ఉప్పులకు చింతకాయలు రాలవు.జగన్మోహన్ రెడ్డి గారికి బెదిరించ గలిగినవాడు గాని భయపెట్ట గలుగిన మగాడు కానీ ఇప్పటివరకు ఈ భూమ్మీద పుట్టలేదని నేను పవన్ కళ్యాణ్ కావచ్చు ఆయనకు వార్నింగ్ ఇస్తున్న  పేపర్ పులులకు, మీడియా చెపుతున్నాను. మీకు జీవితకాలం  నేను టైం ఇస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి చిటికెన వేలి మీద ఈక ముక్క కూడా  ఎవడూ  పీకలేరు అని అన్నారు.

బాపట్ల ఎంపీ నందిగామ సురేష్ మాట్లాడుతూ ..జనాల్లో ఎప్పటికీ సినిమా గుర్తుండిపోయేలా మంచి సినిమా తీయాలనే విషయాన్ని నాతో చెప్పేవాడు.ఆ రోజు అన్న ఏదైతే నాతో చెప్పాడు అదే ఈ రోజు జరుగుతుంది. హరికృష్ణ హీరో గా మాస్ లీడర్ గా ఈ సినిమాలో నటించడం జరుగుతుంది. ఆటో రజిని అంటే నేను ఫస్ట్ చెప్పినప్పుడు తమిళనాడు సినిమా తెలుగులో డబ్ చేశారు అనుకున్నాను కానీ ఇందులో డైలాగ్ విన్న తరువాత తెలుగు సినిమా ఎలా ఉండాలో అలా మంచి చిత్రం గా ఉండేలా తీస్తున్నారు. ఇందులో కొన్ని  సన్నివేశాలు మాకు చెప్పినప్పుడు సినిమా తీయడానికి చాలా క్లారిటీ గా ఉన్నారు. హరికృష్ణ కు ఈ సినిమా తర్వాత హీరోగా ఎన్నో సినిమాలలో నటించే అదృష్టాన్ని భగవంతుడు ప్రసాదించాలి. ఈ సినిమాలో నటించే ప్రతి ఒక్కరికి సినిమా బ్లాక్ బస్టర్ అయ్యి  శ్రీనివాస్ అన్నకు ,హరికృష్ణ కు భవిష్యత్తులో మంచి అవకాశాలు రావాలి.తనకు “ఆటో రజని” మంచి హీరోగా నిలబెట్టే చిత్ర మవుతుంది  “ఈ రోజున ఇంత మంచి కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించిన జొన్నలగడ్డ శ్రీనివాస్ గారికి, చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపారు..

సిద్ధార్థ రెడ్డి మాట్లాడుతూ .. జొన్నల గడ్డ గారు ఎన్నో పెద్ద పెద్ద హీరోలకు వర్క్ చేశాడు తన కొడుకు మంచి యాక్టర్ అవ్వాలని తపనతో ఈ సినిమా చేస్తున్నాడు. హరి ఇంత ముందు సినిమాల కంటే ఈ సినిమాలో చాలా స్పార్క్ గా వున్నాడు.తనకి ఈ ఆటో రజిని సినిమా మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను

మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ చిత్రం పదిమందికి మంచి మెసేజ్ ఇచ్చే చిత్రంగా ఉంటుంది .అలాగే “ఆటో రజిని తప్పకుండా మంచి సక్సెస్ అవ్వాలని మనస్పూర్తిగా కోరుతున్నాను అన్నారు.

చిత్ర దర్శకుడు జొన్నలగడ్డ శ్రీనివాస్ మాట్లాడుతూ.. పెద్ద పెద్ద హీరోల సినిమాలకు వర్క్ చేశాను. ఎదురులేని మనిషి చేసినప్పుడు కూడా ఇంత సంతోషం కలగలేదు. కొడాలి నాని గారు, సురేష్ గారు, సిద్దా రెడ్డి, గౌతంరాజు ఇలా అందరూ వచ్చి మా “ఆటో రజని” మూవీని బ్లెస్స్ చేయాడానికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది.ఇప్పుడు నాకు సినిమా తీస్తే బాగా ఆడుతుందని ధైర్యం  వచ్చింది ఈ సినిమాకు జగన్ గారి జగనన్న గారి ఆశీస్సులు తీసుకొని వచ్చాను. లవ్ అండ్ యాక్షన్ మూవీ తీస్తున్నాము. వైజాగ్ విజయవాడ, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ నెల 15 నుంచి విజయవాడలో షూటింగ్ ప్రారంభం అవుతుంది.  అక్టోబర్ నవంబర్ లో సినిమా పూర్తి చేసుకుని హాలిడేస్ లో విడుదల చేస్తాం.ఇంతవరకూ నేను తీసిన సినిమా రిలీజ్ చేసుకోవడానికి భయపడేవాడిని. 30 సంవత్సరాల నుంచి నేను ఇండస్ట్రీలో  అందరి హీరోలతో చేశాను చేసిన నేను సరైన సపోర్ట్ లేక నిలబడి లేక పోయాను. ఈరోజు ఇంత ఇంత మంది అన్నలు నాకు సపోర్ట్ గా ఉన్నందుకు నాలో కొత్త శక్తి వచ్చినట్టు అనిపిస్తుంది. నా సినిమాను కచ్చితంగా రిలీజ్ చేసుకుంటాననే ధైర్యం ఉంది.మంచి కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా తప్పక విజయం సాధిస్తుందని అన్నారు.

చిత్ర నిర్మాత సావిత్రి.జె. మాట్లాడుతూ.. మంచి మెసేజ్ తో లవ్ అండ్ యాక్షన్ మూవీ గా తెరకెక్కుతున్న “ఆటో రజని” ప్రేక్షకులను తప్పకుండా ఎంటర్టైన్ చేస్తుందనే నమ్మకం ఉందని అన్నారు.

చిత్ర హీరో జొన్నలగడ్డ హరికృష్ణ మాట్లాడుతూ .. మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు
ఇది నా రెండో సినిమా నా మొదటి మూవీ  ఆడియో కి జగనన్న గారి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది అప్పుడు కూడా ఈ అన్నలు అందరు నాకు సపోర్ట్ గా నిలిచి నీకు మేమున్నామంటూ మాకు సపోర్ట్ ఇచ్చారు. ఇప్పుడు నా రెండో సినిమాకు ఫంక్షన్ కు పిలవగానే ఎంతో ప్రేమతో వచ్చి నన్ను ఆశీర్వదించినందుకు చాలా సంతోషంగా ఉంది .ఈ “ఆటో రజిని” ఒక మాస్ సినిమా ఈ సినిమాలో నేను బై బర్త్ నుండి రజినీకాంత్ ఫ్యాన్ ని  ఇలాంటి మంచి సినిమాలో నటించే  ఛాన్స్ ఇచ్చిన మా తల్లి, తండ్రులకు  ధన్యవాదాలు తెలుపు కుంటున్నాను. ఇందులో  టెక్నీషియన్స్ అందరూ కూడా  చాలా కష్టపడి పని చేశారు. వారి నమ్మకాన్ని నిలబెడతానని అన్నారు.

చిత్ర హీరోయిన్ ప్రీత సేన్ గుప్తా మాట్లాడుతూ ..మాది  వెస్ట్ బెంగాల్ కలకత్తా ఇది నా మొదటి తెలుగు సినిమా ఇలాంటి మంచి సినిమాల్లో నటించే అవకాశం కల్పించిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు.

నటీనటులు :
జొన్నలగడ్డ హరికృష్ణ , ప్రీత సేన్ గుప్తా (తొలి పరిచయం) తదితరులు

సాంకేతిక నిపుణులు
బ్యానర్ : శ్రీ మహాలక్ష్మి ఎంటర్ప్రైజెస్
సినిమా పేరు : ఆటో రజిని
కథ : విక్రమ్ రాజా
పాటలు : చంద్రబోస్
కెమెరా : ప్రభాకర్రెడ్డి
ఎడిటింగ్ : గౌతం రాజు
డాన్స్ : ప్రేమ్ రక్షిత్
ఫైట్స్ : కనల్ కన్నన్
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ : సురేష్ బాబు
ఆర్ట్ : చిన్న
పబ్లిసిటీ : సురేష్ రంజాన్
కో డైరెక్టర్ : శ్రీనివాస రెడ్డి
నిర్మాత : సావిత్రి.జె
స్క్రీన్ ప్లే దర్శకత్వం : శ్రీనివాస్ జొన్నలగడ్డ

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x