Wednesday, January 22, 2025

నిర్మాత బెక్కం వేణుగోపాల్ ఆవిష్కరించిన ‘ఏయ్ బుజ్జి నీకు నేనే’ ఆడియో

Aye Bujji Neeku Nene: సంజన చరణ్ సమర్పణలో.. ఎస్ఎస్ మూవీ కార్పోరేషన్ బ్యానర్‌పై సతీష్ మేరుగు, హృతికా సింగ్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘ఏయ్ బుజ్జి నీకు నేనే’. హీరోగానే కాకుండా ఈ చిత్రానికి కథ, స్ర్కీన్‌ప్లే, డైలాగ్స్, నిర్మాత, దర్శకత్వం బాధ్యతలను సతీష్ మేరుగు నిర్వహిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉంది. తాజాగా ఈ చిత్ర ఆడియో విడుదల వేడుకను చిత్రయూనిట్ ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ నిర్మాత బెక్కం వేణుగోపాల్ ఆడియో సీడీని ఆవిష్కరించి.. చిత్రయూనిట్‌కు అందజేశారు. ఇంకా ఈ కార్యక్రమానికి SI కృష్ణమూర్తి, CI రామిరెడ్డి, తెలంగాణ స్టేట్ ఫీచర్స్ ప్రెసిడెంట్ ప్రేమ్ కుమార్, ‘మీలో ఒకడు’ దర్శకుడు కుప్పిలి శ్రీనివాస్, నటుడు దేవా తదితరులు హాజరై.. సినిమా ఘన విజయం సాధించాలని కోరారు.

ఆడియో సీడీ విడుదల అనంతరం బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ.. ‘‘ నేను చిన్న సినిమాలకు సపోర్టర్‌ని. చిన్న సినిమాలకు మద్దతు ఇస్తే ఇండస్ట్రీ బాగుంటుంది. మరిన్ని మంచి సినిమాలు వచ్చే అవకాశం ఉంటుంది. ‘ఏయ్ బుజ్జి నీకు నేనే’ చిత్రానికి సంబంధించి మంచి కంటెంట్‌తో ఈ సినిమాని తెరకెక్కించినట్లుగా.. ప్రోమోస్ చూస్తుంటే తెలుస్తుంది. ఈ రోజుల్లో సినిమాకి ఒక బాధ్యతని నిర్వహించడమే చాలా కష్టం. అలాంటిది ఏ సినిమా కోసం అన్నీ తానై.. ఒక మంచి ప్రొడక్ట్ బయటికి రావడానికి కారణమైన సతీష్ మేరుగును అభినందిస్తున్నాను. ఈ చిత్రానికి పని చేసిన అందరికీ ఆల్ ద బెస్ట్. సినిమా మంచి విజయం సాధించి, అందరికీ మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను..’’ అని తెలిపారు.

కథ, స్ర్కీన్‌ప్లే, డైలాగ్స్, నిర్మాత, దర్శకత్వం బాధ్యతలతో పాటు హీరోగానూ నటించిన సతీష్ మేరుగు మాట్లాడుతూ.. ‘‘ఒక సినిమాకు పనిచేయడం అంటే చాలా గొప్ప విషయం. సినిమా అవుట్‌పుట్ చూసిన తర్వాత ఈ సినిమాకు నేను పడిన కష్టం అంతా మరిచిపోయాను. అంత బాగా అవుట్‌పుట్ వచ్చింది. సినిమా నిర్మాణం సమయంలో.. చాలా ఇబ్బందులు తలెత్తాయి. వాటన్నింటిని జయించి.. ఈ రోజు ఇంత వరకు తీసుకువచ్చాను. పెద్దలు బెక్కం వేణుగోపాల్‌గారి సహకారం మరువలేనిది. ఈ కార్యక్రమానికి వచ్చి మమ్మల్ని బ్లెస్ చేసిన ఆయనకు, ఇంకా హాజరైన అతిథులకు మా టీమ్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సినిమాలో మంచి ప్రేమకథే కాకుండా.. ప్రేక్షకులకు కావాల్సిన అన్ని అంశాలూ ఉంటాయి. తప్పకుండా ప్రేక్షకుల ఆదరణను చూరగొంటుందని ఆశిస్తున్నాను. త్వరలోనే విడుదలకు సంబంధించిన వివరాలను తెలియజేస్తాము..’’ అని అన్నారు.

సతీష్ మేరుగు, హృతికా సింగ్, దేవా, అభినవ్ సింగ్ రాఘవ్, మాధవి ప్రసాద్, కొండపల్లి హరిప్రసాద్ తదితరులు నటించిన ఈ చిత్రానికి

ఎడిటింగ్: మేనుగ శ్రీను,
మ్యూజిక్: గౌతమ్ రవిరామ్
రీరికార్డింగ్: ఎమ్.ఎల్. రాజు
కెమెరా: రాము గడుతూరి
ఫైట్స్: అవినాష్,
కొరియోగ్రాఫర్: హరి తాటిపల్లి
పీఆర్వో: బి. వీరబాబు
కథ, స్ర్కీన్‌ప్లే, డైలాగ్స్, నిర్మాత, దర్శకత్వం: సతీష్ మేరుగు

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x