Wednesday, January 22, 2025

మ‌హేష్ బాబు, త్రివిక్రమ్ ల కొత్త చిత్రం ఫస్ట్ లుక్ రిలీజ్

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ ల హ్యాట్రిక్ కాంబినేషన్ లో, టాలీవుడ్ అగ్ర చిత్ర నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత ఎస్.రాధాకృష్ణ ‌(చిన‌బాబు) నిర్మిస్తున్న భారీ, ప్రతిష్టాత్మక చిత్రం షూటింగ్ త్వరలో ప్రారంభం అవుతోంది.

ఈ చిత్రంలో సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు సరసన అందం, అభినయం కలబోసిన తార ‘పూజాహెగ్డే‘ మరోసారి
జతకడుతుండగా, మ‌హేష్‌బాబు, త్రివిక్ర‌మ్ ల హ్యాట్రిక్ మూవీగా రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించి పూర్వ నిర్మాణ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభమవుతుంది. ఇదిలా ఉండగా ఈ చిత్రానికి సంబంధించిన ఒక వార్త అభిమానులలో ఆనందోత్సాహాలు కలిగించింది. అదే చిత్రం విడుదల తేదీ. 28 ఏప్రిల్, 2023 వేసవిలో విడుదల అయ్యే ఈ చిత్రానికి సంబంధించి ప్రచార చిత్రంను విడుదల చేసారు ఈరోజు హారిక అండ్ హాసిని క్రియేషన్స్ చిత్రం యూనిట్. సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబుకు ఇది 28 వ చిత్రం కావడం, చిత్రం విడుదల తేదీ కూడా 28 వ తేదీ కావడంతో ఈ వార్త విశేష ప్రాధాన్యతను సంతరించుకుంది.

జాతీయ అవార్డ్ గ్రహీత నవీన్ నూలి ఎడిటర్ గా, అలాగే కళా దర్శకునిగా ఎ.ఎస్. ప్రకాష్, ఛాయాగ్రాహకుడు గా పి.ఎస్.వినోద్, సంగీత ప్రపంచంలో సంచలనాలు సృష్టిస్తున్న తమన్ ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహిస్తున్న విషయం విదితమే.

ఈ చిత్రానికి సంబంధించిన‌ ఎన్నో ఆసక్తికరమైన అంశాలు, మరిన్ని ఇతర వివరాలు త్వరలో మరో ప్రకటనలో తెలియ పరుస్తామని చిత్ర నిర్మాత ఎస్.రాధా కృష్ణ ఈ సందర్భంగా తెలిపారు. టాలీవుడ్ లో ఒక ప్రత్యేకమైన స్పెష‌ల్ క్రేజ్ ఉన్న ఈ చిత్రానికి నిర్మాత‌: ఎస్.రాధాకృష్ణ‌(చిన‌బాబు), ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: త్రివిక్ర‌మ్‌.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x