ఫన్ ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై అజయ్, వీర్తి వఘాని, హీరో హీరోయిన్లుగా, హనుమాన్ వాసంశెట్టి దర్శకత్వంలో మురళీధర్ రెడ్డి ముక్కర నిర్మిస్తున్న యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్ ‘కొత్త కొత్తగా’. బి జి గోవింద రాజు చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపధ్యంలో సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. దర్శకులు మారుతి, త్రినాథ్ రావు నక్కిన, గోపినాథ్ రెడ్డి ఈ ఈవెంట్ లో ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు.
మారుతి మాట్లాడుతూ.. చిన్న సినిమా సూపర్ హిట్ కొట్టాలని కోరుకునే వ్యక్తుల్లో నేను ఒకరని. నన్ను ఈ స్థాయిలోకి తెచ్చింది చిన్న సినిమానే. నిర్మాత గోవింద రాజు కి సినిమా పట్ల ప్యాషన్. ఈ సినిమా పాటలు ఇంత సక్సెస్ కావడానికి కారణం ఆయనే అని భావిస్తున్నాను. చిన్న సినిమా బావుంటే అన్నీ విభాగాలు బావుంటాయి. చిన్న సినిమా మధ్యతరగతి కుటుంబం లాంటింది. మధ్య తరగతి బావుంటేనే మిగతా తరగతులు బావుంటాయి. ఈ సినిమా కూడా పెద్ద విజయం సాధిస్తుందనే నమ్మకం వుంది. దినిని ప్రీరిలీజ్ లా కాకుండా సక్సెస్ మీట్ లానే జరుపుకుంటున్నారు. చాలా ఆనందంగా వుంది. ఇలాంటి సినిమాని ఆదరిస్తే మరిన్ని మంచి సినిమాలు వస్తాయి. ఈ సినిమా టీం అందరికీ ఆల్ ది బెస్ట్. ఈ సినిమా చూసి మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.
త్రినాథ్ రావు నక్కిన మాట్లాడుతూ.. గోవింద రాజుకి సినిమా అంటే ప్యాషన్. మురళీధర్ రెడ్డి బెస్ట్ విశేష్. లవ్ స్టొరీ కి శేఖర్ చంద్ర బెస్ట్ ఆప్షన్. ఈ సినిమాకి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ప్రియతమా పాట నాకు చాలా నచ్చింది. ఈ సినిమా దర్శకుడిగా హనుమాన్ కి మంచి విజయం దక్కాలి. అజయ్, వీర్తి కెమిస్ట్రీ బావుంది. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలి అని కోరారు.
గోపినాథ్ రెడ్డి మాట్లాడుతూ.. అజయ్, వీర్తి, గోవింద రాజు గారు మిగతా టీం అందరికీ ఆల్ ది బెస్ట్. శేఖర్ చంద్ర మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఈ సినిమా పెద్ద హిట్ కావాలి అని కోరారు.
ఎస్కేఎన్ మాట్లాడుతూ.. శేఖర్ చంద్ర అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. పాటలు సూపర్ హిట్ కావడం ఈ సినిమా మొదటి విజయం. ట్రైలర్ యూత్ కి నచ్చేలా వుంది. సినిమా పెద్ద విజయం సాధించాలి అని కోరారు.
అజయ్ మాట్లాడుతూ.. ఇక్కడి వచ్చి మాకు విష్ చేసిన మారుతి గారికి, త్రినాధ్ గారికి కృతజ్ఞతలు. దర్శకుడు హనుమాన్ ఈ సినిమా కోసం నాకంటే పది రేట్లు ఎక్కువ కష్టపడ్డారు. గోవింద రాజు గారు ఇంత మంచి సినిమా నాకు ఇచ్చారు. శేఖర్ గారు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. హరి కిరణ్ గా చాలా కూల్ గా వుండి కోరియోగ్రఫీ చేశారు. మిగతా సాంకేతిక నిపుణులు అద్భుతంగా చేశారు. నిర్మాతలు ఎక్కడా రాజీ పడకుండా ఈ సినిమా చేశారు. ఇంత మంచి టీంతో నాకు సినిమా ఇచ్చిన గోవింద రాజు గారికి కృతజ్ఞతలు. సెప్టెంబర్ 9న సినిమా వస్తోంది. ప్రేక్షకులు థియేటర్ లో చూసి మంచి విజయం అందించాలి అని కోరారు.
వీర్తి వఘాని మాట్లాడుతూ.. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలు కృతజ్ఞతలు. ఈ సినిమాకి పని చేసిన మిగతా సాంకేతిక నిపుణులకు కృతజ్ఞతలు. సినిమా ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది. అందరూ థియేటర్ లో సినిమా చూడాలి అన్నారు.
దర్శకుడు హనుమాన్ మాట్లాడుతూ.. మా సినిమాని ఆశీర్వాదించడానికి వచ్చిన మారుతి, త్రినాద్, సోహెల్, గోపినాథ్ రెడ్డి గారికి కృతజ్ఞతలు. టైటిల్ లానే సినిమా చాలా కొత్తగా వుంటుంది. అబ్బాయికి షేక్ హ్యాండ్ కూడా ఇవ్వడానికి ఇష్టపడని ఒక అమ్మాయి, ఆ అమ్మాయిని ప్రాణంగా ప్రేమించే అబ్బాయి మధ్య జరిగే వండర్ ఫుల్ కథ ఇది. కథ వినగానే శేఖర్ చంద్ర చాలా సర్ ప్రైజ్ అయ్యారు. మంచి మ్యూజిక్ ఇచ్చారు. వెంకట్ గారు అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. ఎడిటర్ ప్రవీణ్ పూడిగారు చక్కగా ఎడిటర్ చేశారు. హరి కిరణ్ మాస్టర్ ఎంతో అందం గా కోరియోగ్రఫీ చేశారు. కో డైరెక్టర్ పుల్లారావు మాకు గురువు. నిర్మాతలు ఎక్కడా రాజీపడకుండా తీశారు. ఈ సినిమా చివరవరకు ప్రేక్షకులని యంగేజ్ చేస్తుంది. అజయ్, వీర్తి అద్భుతంగా చేశారు. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాం. ఈ కష్టానికి తగ్గ ప్రతిఫలం ప్రేక్షకులు ఇస్తారని నమ్ముతున్నాను అన్నారు.
గోవింద రాజు మాట్లాడుతూ.. ఈ చిన్న సినిమాని ఆశీర్వాదించడానికి వచ్చిన వారికి కృతజ్ఞతలు. మారుతి గారు మాకు చాలా సహకరించారు. విడుదల తర్వాత ఈ చిన్న సినిమా పెద్ద సినిమా అవుతుంది. కంటెంట్ లో ఇది చాలా పెద్ద సినిమా. ఇన్ని పెద్ద సినిమాల మధ్య ఈ సినిమా ని ఎందుకు విడుదల చేస్తున్నారని చాలా మంది అన్నారు. భోజనం ఎంత పెద్దగా పెట్టిన చివర్లో స్వీట్ ఇస్తారు. ఈ సినిమా కూడా స్వీట్ లాంటింది. అందరికీ స్వీట్ మోమోరీస్ అందిస్తుంది. ఖచ్చితంగా సినిమా పెద్ద విజయం సాధిస్తుంది అన్నారు.
సోహెల్ మాట్లాడుతూ., అజయ్ లో చాలా ఫైర్ వుంది. తొలి సినిమానే చాలా అనుభవం వున్న నటుడిగా చేశాడు. ఈ సినిమాతో పెద్ద విజయం సాధించాలి. అజయ్, వీర్తి క్యూట్ గా కనిపిస్తున్నారు. చిత్ర యూనిట్ కి ఆల్ ది బెస్ట్. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలి అని కోరారు.
శేఖర్ చంద్ర మాట్లాడుతూ.. ఈ వేడుకకి వచ్చిన మారుతి, త్రినాద్ రావుకి కృతజ్ఞతలు. దర్శకుడు హనుమాన్ గారు చాలా కొత్త కథ చెప్పారు. అందుకే పాటలు కొత్తగా వచ్చాయి. గోవింద రాజుగారు చాలా సపోర్ట్ చేశారు. అనంత శ్రీరామ్ , కాసర్ల శ్యాం, శ్రీమణి చక్కగా పాటలు రాశారు. సిద్ శ్రీరామ్, అనురాగ్ కులకర్ణి మిగతా గాయకలు అద్భుతంగా పాడారు. సినిమా చాలా కొత్తగా వుంటుంది. మీ అందరికీ నచ్చుతుంది అన్నారు.
అనంత శ్రీరామ్ మాట్లాడుతూ.. ఇందులో ప్రియతమా అనే పాట రాశాను. నా 1300 వందల పాటల్లో గుర్తుపెట్టుకునే పక్తులు అరుదుగా వుంటాయి. లాంటి అరుదైన మాటలు ఈ పాటలో కుదిరాయి. శేఖర్ చంద్ర అద్భుతమైన సంగీతం అందించారు. టైటిల్ లో వున్న కొత్తదనం సినిమాలో వుంటుంది. సినిమా తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది అన్నారు.
వెంకట్ మాట్లాడుతూ.. సినిమా మ్యూజిక్ సూపర్ హిట్ అయ్యింది. శేఖర్ చంద్ర మంచి మ్యూజిక్ ఇచ్చారు. సినిమా కూడా అద్భుతంగా వచ్చింది. మీ అందరికీ నచ్చుతుంది.
లావణ్య మాట్లాడుతూ.. ఇందులో చాలా క్యూట్ రోల్ చేశాను. దర్శకుడు హనుమాన్ గారి కృతజ్ఞతలు. అజయ్, వీర్తి చాలా వండర్ ఫుల్ గా చేశారు. నిర్మాతలు ఎక్కడ రాజీ పడకుండా ఈ సినిమాని చేస్తున్నాం. ప్రేక్షకులు సెప్టెంబర్ 9న థియేటర్ కి వచ్చి చూడాలి అని కోరారు.
వాసు మాట్లాడుతూ.. ఈ సినిమాలో ఫ్రండ్ క్యారెక్టర్ గా మంచి రోల్ చేశాను. ఈ ఆవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు. అజయ్ చాలా మంచి హీరో అవుతారు. ఈ సినిమాలో పాటలు సూపర్ హిట్ అయ్యాయి. సినిమా కూడా సూపర్ హిట్ కొడుతుంది. సెప్టెంబర్ 9న సినిమాని తప్పకుండా థియేటర్లూ చూడండి అన్నారు.
కాసర్ల శ్యామ్ మాట్లాడుతూ.. ఈ చిత్రంలో డైమండ్ రాణి పాట రాశాను. శేఖర్ చంద్ర మంచి ట్యూన్ ఇచ్చారు. అనురాగ్ కులకర్ణి అద్భుతంగా పాడారు. ఈ పాటని యూత్ గా కనెక్ట్ అయ్యేలా రాశాను. సినిమా ఖచ్చితంగా మంచి విజయం సాధిస్తుంది అన్నారు.