Wednesday, January 22, 2025

‘లాట్స్ ఆఫ్ లవ్’ సెన్సార్ పూర్తి.. సెప్టెంబర్ 30న విడుదల

అనిత అండ్ ప్రఖ్యాత్ సమర్పణలో.. ఎస్ఎమ్ఆర్ క్రియేషన్స్, ప్రణ్వీ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘లాట్స్ ఆఫ్ లవ్’. ప్రముఖ తారాగణం నటించిన ఈ చిత్రానికి కథ, స్ర్కీన్‌ప్లే, డైలాగ్స్, ప్రొడ్యూసర్, దర్శకత్వం డాక్టర్ విశ్వానంద్ పట్టార్. డాక్టర్ బికె కిరణ్ కుమార్ ఎగ్జిక్యూటివ్ నిర్మాత. ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 30న విడుదల చేయబోతున్నట్లుగా నిర్మాత ప్రకటించారు.

ఈ సందర్భంగా దర్శకనిర్మాత విశ్వానంద్ మాట్లాడుతూ.. ‘‘లాట్స్ ఆఫ్ లవ్. ప్రేమలోని సరికొత్త కోణాన్ని పరిచయం చేస్తూ.. ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది. నటీనటులు, సాంకేతిక నిపుణులందరూ ఎంతగానో సపోర్ట్ చేశారు. సినిమా చాలా బాగా వచ్చింది. యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ అందరికీ నచ్చేలా ఈ సినిమా చిత్రీకరణ జరిగింది. సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. సెన్సార్ నుండి మంచి ప్రశంసలు లభించాయి. చిత్రాన్ని సెప్టెంబర్ 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని థియేటర్లలో చూసి.. మా ప్రయత్నాన్ని సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాను..’’ అన్నారు.

ప్రముఖ నటీనటులు నటించిన ఈ చిత్రానికి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: డా. బి.కె. కిరణ్ కుమార్
సంగీతం: విశ్వ
ఎడిటర్స్: శ్రీనివాస్, నాగిరెడ్డి
సినిమాటోగ్రఫీ: మురళీ, నగేష్, కుమార్
పీఆర్వో: బి. వీరబాబు
కథ, స్ర్కీన్‌ప్లే, డైలాగ్స్, నిర్మాత, దర్శకత్వం: డా. విశ్వానంద్ పట్టార్

3.5 2 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x