ప్రముఖ దర్శకుడు ఎన్.శంకర్ లాంచ్ చేసిన `రివెంజ్` ట్రైలర్
ఆది అక్షర ఎంటర్టైన్ మెంట్స్ పతాకంపై బాబు పెదపూడి హీరోగా నటిస్తూ నిర్మించిన చిత్రం `రివెంజ్`. నేహదేశ్ పాండే హీరోయిన్. రెట్టడి శ్రీనివాస్ దర్శకుడు. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ఈ రోజు ప్రసాద్ ల్యాబ్స్ లో ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ దర్శకుడు ఎన్.శంకర్ చేతుల మీదుగా లాంచైంది.
ఈ సందర్భంగా ప్రముఖ దర్శకుడు ఎన్.శంకర్ మాట్లాడుతూ…“రివెంజ్ ` చిత్ర దర్శకుడు శ్రీను నాకు మంచి మిత్రుడు. మద్రాస్ నుంచి ఇద్దరి జర్నీ ప్రారంభమైంది. తను మంచి రైటర్, దర్శకుడు. సినిమానే ప్రాణంగా బ్రతికే వ్యక్తి. ఈ సినిమాతో తనలో ఉన్న మరో కోణాన్ని మనకు పరిచయం చేయబోతున్నాడు. ట్రైలర్ చాలా ప్రామిసింగ్ గా ఉంది. సినిమా అంటే విపరీతమైన ప్యాషన్ ఉన్న బాబు గారిని ఒక మంచి నటుడుగా పరిచయం చేయాలన్న ఉద్దేశంతో దర్శకుడు తనకోసం ఒక మంచి క్యారక్టర్ డిజైన్ చేసి ఈ కథ అల్లుకున్నాడు. దర్శకుడు, హీరో కమ్ ప్రొడ్యూసర్ ఇద్దరూ కూడా సినిమా అంటే ఎంతో ప్యాషన్, డెడికేషన్ ఉన్న వ్యక్తులు. ఈ సినిమా సక్సస్ సాధించి పని చేసిన ప్రతి ఒక్కరికీ మంచి పేరు రావాలని కోరుకుంటున్నా“ అన్నారు.
మరో దర్శకుడు వీరభద్రమ్ చౌదరి మాట్లాడుతూ…“ హీరో, నిర్మాత బాబు గారితో నాకు 12 ఏళ్ల పరిచయం. సినిమా అంటే విపరీతమైన ప్యాషన్ ఉన్న వ్యక్తి. దర్శకుడు శ్రీనివాస్ ఒక మంచి కథతో ఈ సినిమా రూపొందించారన్న విషయం ట్రైలర్ చూశాక అర్థమైంది. ఈ సినిమా విజయం సాధించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా“ అన్నారు.
హీరో, నిర్మాత బాబు పెదపూడి మాట్లాడుతూ..“మా ఫ్యామిలీ సపోర్ట్ తో అబ్రాడ్ వెళ్లాను. కానీ నాకు మొదటి నుంచి సినిమాలంటే ఎంతో ఇష్టం. అబ్రాడ్ లో ఉంటూనే త్రివిక్రమ్ గారి `అతడు`, దశరథ్ గారి `శ్రీ` సినిమాల్లో మంచి క్యారక్టర్స్ చేశాను. ఇంకా కొన్ని అవకాశాలు వచ్చినప్పటికీ నాకున్న బిజీ వల్ల చేయలేకపోయాను. ఈ నేపథ్యంలో మూడేళ్ల కిత్రం దర్శకుడు శ్రీనివాస్ గారితో పరిచయం ఏర్పడింది. ఒక మంచి నటుడుగా నన్ను పరిచయం చేయడానికి నాకోసం చాలా పాత్రలు రాశారు. తన డెడికేషన్ నచ్చి ఈ సినిమా తనకిచ్చాను. అద్భుతంగా తీశారు. ట్రైలర్ చూశాక ఇది ఒక సైకో కథ అనిపించవచ్చు. కానీ బర్నింగ్ పాయింట్స్ తో తీసిన సినిమా ఇది. ప్రతి ఆడియన్ హర్ట్ ని టచ్ చేసే కథ. మనం అమితంగా ఇష్టపడే వాళ్లకు ఏమైనా జరిగితే మనం ఎలా మారిపోతాం అనేది సినిమా. ఆర్టిస్ట్స్ , టెక్నీషియన్స్ అంతా ప్రాణం పెట్టి పనిచేశారు. త్వరలో విడుదలకు ప్లాన్ చేస్తున్నాం“ అన్నారు.
చిత్ర దర్శకుడు రెట్టడి శ్రీనివాస్ మాట్లాడుతూ..“30 ఏళ్లుగా సినిమా రంగంలో ఉంటున్నా. విజయ్ భాస్కర్, వంశీ గార్ల వంటి ప్రముఖ దర్శకుల వద్ద పని చేశాను. పొదరిల్లు, ఐపిసి సెక్షన్ రెండు సినిమాలు డైరక్ట్ చేశాను. ఇది మూడో సినిమా. హీరో, నిర్మాత బాబుగారిని అనుకోకుండా కలిశాను. ఆయన ప్యాషన్ చూశాక ఒక మంచి కథ రాయాలని డిసైడ్ అయ్యాను. చాలా పాత్రలు రాశాను. చివరిగా రివెంజ్ కథ తీశాం. మొదట క్యారక్టర్ రాసి ఆ తర్వాత సినిమా కథ రాశాను. బాబుగారు ఎక్సెలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. కథలో ట్విస్టుల మీద ట్విస్టులు ఉంటాయి. ఇటీవలే మా మిత్రులకు షో వేసి చూపించాము. అందరూ మంచి రివ్యూస్ ఇచ్చారు. సినిమా అంతా పూర్తయింది. త్వరలో రిలీజ్ చేస్తాం“ అన్నారు.
వ్యాపార మరియు రాజకీయవేత్త ప్రభాకర్ మాట్లాడుతూ…“ సినిమా చూశాను. చాలా బాగా వచ్చింది. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ “ అన్నారు.
నిర్మాత , డిస్ట్రిబ్యూటర్ శోభారాణి మాట్లాడుతూ…“ దర్శకుడు చూస్తే ఎంతో సౌమ్యంగా ఉన్నాడు కానీ..సినిమాను ఎంతో పవర్ ఫుల్ గా తీశాడు. బాబు గారు పర్ఫార్మెన్స్ తో ఇరగదీసారు. కచ్చితంగా సినిమా హిట్ అవుతుందన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో ఆరోహి, అశోక్ రెడ్డి, చరణ్ సాయి, మోహన్ గౌడ్, మాణిక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఆరోహి, భార్గవ్, నాగేష్ కర్ర ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి డిఓపిః చిడతల నవీన్; సంగీతంః విజయ్ కురాకుల; పీఆర్వోః రమేష్ చందు; ఎడిటర్ః మేనగ శ్రీను; నిర్మాత: బాబురావు పెదపూడి(USA) రచన-దర్శకత్వంః రెట్టడి శ్రీనివాస్.