Vidudhala Part2: తమిళంలో లాస్ట్ ఇయర్ సంచలన విజయం సాధించి తెలుగు ప్రేక్షకులను సైతం విపరీతంగా ఆకట్టుకున్న చిత్రం ‘విడుదల’. విజయ్ సేతుపతి పెర్ఫార్మన్స్ హైలెట్‌గా రూపొందిన ఈ చిత్రానికి తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. అతి త్వరలో ఈ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కిన ‘విడుదల2’ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించేందుకు ఎంతోమంది నిర్మాతలు పోటీ పడగా, ఫాన్సీ రేట్‌తో ఈ చిత్రాన్ని దక్కించుకున్నారు ప్రముఖ నిర్మాత చింతపల్లి రామారావు.
ఈ సందర్భంగా నిర్మాత చింతపల్లి రామారావు మాట్లాడుతూ.. ‘విడుదల 2’ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించబోతున్నందుకు సంతోషంగా ఉంది. విజయ్ సేతుపతి, సూరి నటన హైలైట్‌గా ప్రేక్షకులను ఈ సినిమా కనువిందు చేయబోతోంది. అలాగే ఏడు సార్లు నేషనల్ అవార్డు పొందిన ఏకైక దర్శకుడు వెట్రీ మారన్, ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన ఆర్ ఎస్ ఇన్ఫోటైన్మెంట్ అధినేత ఎల్రెడ్ కుమార్‌తో కలిసి ఈ చిత్రాన్ని అత్యద్భుతంగా తెరకెక్కించారు. మంచి కమర్షియల్ వాల్యూస్ ఉన్న ఈ చిత్రాన్ని మేము దక్కించుకున్నందుకు సంతోషపడుతూ, ఈ చిత్రం డెఫినెట్‌గా ఒక బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని ఆశిస్తున్నాను. ఈ చిత్రాన్ని డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నామని తెలిపారు.
విజయ సేతుపతి, సూరి, మంజూ వారియర్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, భవాని శ్రీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి డిఓపి: వేల్ రాజ్, సంగీతం: ఇళయరాజా, దర్శకత్వం: వెట్రీ మారన్