Wednesday, January 22, 2025

గ్రాండ్‌గా ‘గీత’ పాటల విడుదల కార్యక్రమం

గ్రాండ్ మూవీస్ పతాకంపై ఆర్.రాచయ్య నిర్మించిన విభిన్న కథాచిత్రం ‘గీత’. దర్శక సంచలనం వి.వి.వినాయక్ ప్రియ శిష్యుడు విశ్వ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ‘మ్యూట్ విట్నెస్’ అన్నది ఈ చిత్రానికి ఉప శీర్షిక. సెన్సార్ సహా అన్ని కార్య్రమాలు పూర్తి చేసుకుని, బిజినెస్ పరంగా మంచి క్రేజ్ సంపాదించుకున్న ‘గీత’ చిత్రం సెప్టంబర్ 9న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రం ఆడియో విడుదల వేడుక హైదరాబాద్ లోని దసపల్లాలో అత్యంత ఘనంగా జరిగింది.

క్రేజీ కథానాయిక హెబ్బా పటేల్ టైటిల్ రోల్ ప్లే చేసిన ఈ చిత్రంలో ప్రముఖ నటుడు సునీల్ ముఖ్యపాత్ర పోషించగా.. ‘నువ్వే కావాలి, ప్రేమించు’ వంటి పలు చిత్రాల్లో హీరోగా నటించిన సాయి కిరణ్ విలన్ గా నటించారు. సుభాష్ ఆనంద్ సంగీత సారథ్యం వహించిన గీత చిత్రంలోని గీతాలకు సాగర్ సాహిత్యం సమకూర్చారు. ప్రముఖ ఆడియో సంస్థ ‘టిప్స్’ ఈ చిత్రం ఆడియో హక్కులు దక్కించుకుంది.

గీత చిత్రం ఆడియో వేడుకలో మాజీ మంత్రి పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి, మాజీ మంత్రి పి.శివారెడ్డి తనయుడు పి.గిరిధర్ రెడ్డి, ప్రముఖ నిర్మాతలు మల్లిడి సత్యనారాయణరెడ్డి, తుమ్మలపల్లి రామత్యనారాయణ, సెవెన్ హిల్స్ సతీష్ కుమార్, యువ దర్శకుడు డైమండ్ రత్నబాబు, హీరో సునీల్, హీరోయిన్ హెబ్బా పటేల్, ఈ చిత్రంలో నటించిన ప్రియ, సంధ్యా జనక్, సంగీత దర్శకుడు సుభాష్ ఆనంద్, కెమెరామెన్ క్రాంటికుమార్, డిస్ట్రిబ్యూటర్స్ పొలిశెట్టి, డివిడి విజయ్ తదితరుల పాల్గొని గీత ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు. యు మీడియా కళ్యాణ్ సుంకర సారథ్యంలో ఆద్యంతం ఆసక్తికరంగా, సందడిగా సాగిన ఈ కార్యక్రమాన్ని ప్రముఖ యాంకర్ గీతా భగత్ తనదైన శైలిలో రక్తి కట్టించారు. ఆల్ రౌండర్ రవి చేసిన మిమిక్రీ ఆహుతులను అమితంగా అలరించింది.

దర్శకుడు విశ్వ మాట్లాడుతూ… ఈ సినిమా అవకాశం నా గురువు, దైవం అయిన వినాయక్ గారే ఇప్పించారు. అనివార్య కారణాల వల్ల ఆయన ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు. నిర్మాత రాచయ్యగారికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. అలాగే గీత విడుదలకు సహాయ సహకారాలు అందిస్తున్న పొలిశెట్టి, డివిడి విజయ్ లకు ప్రత్యేక కృతఙ్ఞతలు అన్నారు.

నిర్మాత ఆర్.రాచయ్య మాట్లాడుతూ… గురువుకు తగ్గ శిష్యుడు అనిపించుకునేలా మా డైరెక్టర్ విశ్వ… గీత చిత్రాన్ని చాలా అద్భుతంగా తెరకెక్కించాడు. సెప్టెంబర్ 9న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం. అన్నారు.

హీరో సునీల్, హీరోయిన్ హెబ్బా పటేల్ గీత వంటి కాన్సెప్ట్ బేస్డ్ చిత్రంలో నటించినందుకు సంతోషం వ్యక్తం చేశారు. దర్శకుడుగా విశ్వ, నిర్మాతగా రాచయ్యలకు ఉజ్వల భవిష్యత్ ఉందని పేర్కొన్నారు. గీత చిత్రంలో పని చేసే అవకాశం లభించడం పట్ల నటీనటులు, సాంకేతిక నిపుణులు కృతజ్ఞతలు తెలిపారు.

రామ్ కార్తిక్, సప్తగిరి, రాజీవ్ కనకాల, పృథ్వి (30 ఇయర్స్), తనికెళ్ళ భరణి, సంధ్యా జనక్, సూర్య, లలిత, ప్రియ, మీనాకుమారి, జబర్దస్త్ అప్పారావు, జబర్దస్త్ దుర్గారావు తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ, పబ్లిసిటీ డిజైనర్: విక్రమ్ రమేష్, డాన్స్: అనీష్, పాటలు: సాగర్, సంగీతం: సుభాష్ ఆనంద్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్: ఎస్.చిన్నా, పోరాటాలు: రామ్ కిషన్, కళ: జె.కె.మూర్తి, ఛాయాగ్రహణం: క్రాంతికుమార్.కె, కూర్పు: ఉపేంద్ర, కో-డైరెక్టర్: వి.వి.రమణ, నిర్మాత: ఆర్.రాచయ్య, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: విశ్వ.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x