శాండిల్‌వుడ్ బాద్‌షా కిచ్చా సుదీప్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న భారీ బడ్జెట్ మూవీ ‘విక్రాంత్ రోణ’. జాన్ మంజునాథ్, శాలిని మంజునాథ్ నిర్మించిన ‘విక్రాంత్ రోణ’ చిత్రాన్ని అనుప్ భండారి డైరెక్ట్ చేస్తున్నారు. ఈ భారీ చిత్రాన్ని ఆగస్ట్ 19న విడుదల చేస్తున్నారు. ఈ రోజు ప్రపంచానికి విక్రాంత్ రోణ అనే కొత్త సూపర్ హీరో పరిచయమవుతున్నాడు. సినీ పరిశ్రమలో నటుడిగా సిల్వర్ జూబ్లీ పూర్తి చేసుకున్న సుదీప్ నటిస్తోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. రీసెంట్‌గా కిచ్చా సుదీప్ సినీ జర్నీకి సంబంధించిన స్నీక్ పీక్‌ను ప్రపంచంలోనే ఎత్తైన భవనం, దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫాలో విడుదల చేసిన సంగతి తెలిసిందే.
బాద్‌షా కిచ్చా సుదీప్ యాక్ట్ చేస్తున్న `విక్రాంత్ రోణ` గురించి ప్రేక్షకాభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో విడుదల తేదీని ప్రకటించడం థియేటర్లలో సినిమాలు చూసే ప్రేక్షకులపై సానుకూల ప్రభావం చూపడానికి సిద్ధంగా ఉంది. పాన్-వరల్డ్ మూవీగా రూపొందుతోన్న యాక్షన్ అడ్వెంచర్ `విక్రాంత్ రోణ` పద్నాలుగు భాషల్లో, 55 దేశాలలో విడుదల అవుతుండటం విశేషం.
ఈ సందర్భంగా నిర్మాత జాక్ మంజునాథ్ మాట్లాడుతూ… నిర్మాతగా, విక్రాంత్ రోణ చిత్రాన్ని ఆగస్ట్ 19న విడుదల చేస్తామని తెలియజేయడానికి సంతోషంగా ఉంది. ప్రపంచంలోని కొత్త హీరో విక్రాంత్ రోణను ప్రేక్షకులకు వారి ప్రాధాన్యత భాషలో అందించడానికి మేము ప్రయత్నిస్తాం. విజువల్ వండర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రం కిచ్చా సుదీప్ స్టార్ పవర్‌తో ప్రేక్షకులను థియేటర్స్‌కు భారీగా రప్పిస్తుందని మేం నమ్మకంగా, ఎగ్జయిట్‌మెంట్‌తో ఎదురుచూస్తున్నాం అన్నారు.
దర్శకుడు అనూప్ భండారి మాట్లాడుతూ… మా `విక్రాంత్ రోణ`ను ఆగస్ట్ 19న విడుదల చేస్తున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. బెస్ట్ టెక్నీషియన్స్‌తో విక్రాంత్ రోణ అనే సరికొత్త హీరోను ప్రపంచానికి పరిచయం చేయబోతున్నాం అన్నారు.
విజువల్ వండర్‌గా రూపొందుతోన్న `విక్రాంత్ రోణ` చిత్రాన్ని త్రీడీ టెక్నాలజీలో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. త్వరలోనే దీనికి సంబంధించిన వివరాలను మేకర్స్ ప్రకటిస్తారు.
జాన్ మంజునాథ్, శాలిని మంజునాథ్ నిర్మించిన ‘విక్రాంత్ రోణ’ చిత్రాన్ని అనుప్ భండారి డైరెక్ట్ చేస్తున్నారు. అలంకార్ పాండియన్ సహ నిర్మాత. బి.అజనీష్ లోక్‌నాథ్ సంగీత సారథ్యం వహిస్తున్న ఈ చిత్రానికి విలియమ్ డేవిడ్ సినిమాటోగ్రఫీ అందించారు. శివకుమార్.జె ప్రొడక్షన్ డిజైననర్‌గా వ్యవహరించారు.