Wednesday, January 22, 2025

రోటి క‌ప‌డా రొమాన్స్ మూవీ నుండి సాంగ్ రిలీజ్ చేసిన తమన్

‘హుషారు, సినిమా చూపిస్త మావ, మేం వయసుకు వచ్చాం, ప్రేమ ఇష్క్ కాదల్, పాగల్’ వంటి యూత్ ఫుల్ చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాత, లక్కీ మీడియా అధినేత బెక్కెం వేణుగోపాల్.. సృజన్‌ కుమార్ బొజ్జంతో కలిసి నిర్మించిన చిత్రం ‘రోటి కపడా రొమాన్స్’. హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్ రంగా, సోనూ ఠాకూర్, నువ్వేక్ష, మేఘలేఖ, ఖుష్బూ చౌదరి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి విక్రమ్ రెడ్డి దర్శకుడు. ఇటీవ‌ల విడుద‌ల చేసిన  ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ డోస్ (టీజ‌ర్‌)కు అనూహ్య‌మైన స్పంద‌న వ‌చ్చింది. తాజాగా ఈ చిత్రం సెకండ్‌డోస్ లో భాగంగా   ఈ సినిమాలోని అరెరె.. అరెరె అనే లిరిక‌ల్ వీడియో  సాంగ్‌ను మ్యూజిక్ స‌న్సేష‌న్ త‌మ‌న్ విడుద‌ల చేశారు.
ఆర్‌.ఆర్. ధ్రువ‌న్ సంగీతాన్ని అందించిన ఈ పాట‌కు ర‌ఘ‌రామ్ సాహిత్యం అందించ‌గా, క‌పిల్ క‌పిల‌న్ ఆల‌పించారు.

ఈ సంద‌ర్భంగా త‌మ‌న్ మాట్లాడుతూ… ‘ఇదొక వైవిధ్య‌మైన క‌థాంశంతో రూపొందిన యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌లా క‌నిపిస్తుంది. ఈ చిత్ర సంగీత ద‌ర్శ‌కుడు ఆర్‌.ఆర్ ధ్రువ‌న్ మ‌ల్టీ టాలెంటెడ్‌, పాట‌ల ర‌చ‌యిత‌గా, సింగ‌ర్‌గా త‌ను నాకు తెలుసు. ఈ చిత్రంతో అత‌ను సంగీత ద‌ర్శ‌కుడిగా మార‌డం ఎంతో ఆశ్చ‌ర్యంగా వుంది. న‌మ్మ‌లేక‌పోతున్నాను. ఈ సాంగ్‌ను నేను లాంచ్ చేయ‌డం హ్య‌పీగా వుంది. విన‌గానే షూర్ షాట్ బ్లాక్‌బ‌స్ట‌ర్ సాంగ్‌లా అనిపించింది. ఈ పాట‌లో చాలా పాజిటివ్ వైబ్స్ వున్నాయి. త‌ప్ప‌కుండా ఈ పాట సినిమా విజ‌యంలో ముఖ్య భూమిక పోషిస్తుంది. పాట‌తో పాటు చిత్రం కూడా హిట్ అవ్వాల‌ని కోరుకుంటున్నాను అన్నారు. త‌మ‌న్ గారి చేతుల మీదుగా ఈ పాట విడుద‌ల కావ‌డం ఎంతో సంతోషంగా వుంద‌ని’ సంగీత ద‌ర్శ‌కుడు ఆర్‌.ఆర్. ధ్రువ‌న్ తెలిపారు.

ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ… ‘త‌మ‌న్ గారు మా పాట‌ను విడుద‌ల చేయ‌డం శుభ‌సూచ‌కంలా అనిపిస్తుంది. ఈ చిత్రం న‌లుగురు స్నేహితుల క‌థ ఇది. వారి స్నేహం, ప్రేమ‌, వారి లైఫ్ జ‌ర్ని ఈ చిత్రంలో చూపిస్తున్నాం. నేటి యువ‌త‌రాన్ని అమితంగా ఆక‌ట్టుకునే ఈ యూత్‌ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్‌లో కుటుంబ ప్రేక్ష‌కుల‌ను అల‌రించే భావోద్వేగాలు కూడా వున్నాయి. అభిరుచి గ‌ల నిర్మాత బెక్కెం వేణుగోపాల్‌తో క‌లిసి  సృజన్‌ కుమార్ బొజ్జం ఈ చిత్రాన్ని ఎక్క‌డా రాజీప‌డ‌కుండా నిర్మించారు. త‌ప్ప‌కుండా ఈ చిత్రం యూత్‌కు ఓ ఫెస్ట్‌లా వుంటుంది’ అన్నారు.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x