లక్ష్మీ గంగ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పతాకం పై ఎం.ఆనంద్ నిర్మాతగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం ‘నువ్వంటే పిచ్చే’. సంతోష్ కుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలోని పాత్రలు, సంఘటనలు, సన్నివేశాలు నిత్యం మన సమాజంలో జరుగుతున్నవే. యువత మనోభావాలను దర్శకుడు సంతోష్ వెండితెరపై అద్భుతంగా తీర్చిదిద్దారు. ఈ చిత్రంలో పాటలు కూడా దర్శకుడే రాయటం గొప్ప విశేషం. సున్నితమైన కథాంశంతో, కుటుంబమంతా కలిసి చూసే విధంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో విశాఖపట్నం నటీనటులు ఎఫ్.ఎం బాబాయ్, బాబుదేవ్, లక్ష్మీ పూజిత, సోనిరెడ్డి వంటి వారు నటించారు.
యాక్షన్, కామెడీ సన్నివేశాలు అలరిస్తోన్న ఈ చిత్రంలో హీరో అజయ్ తన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటికే కొన్ని చిత్రాలు వాయిదా పడగా, మరికొన్ని చిత్రాలు ఓటీటీ బాట పట్టాయి. అయితే ఇప్పట్లో థియేటర్స్ తెరుచుకొనే అవకాశం లేకపోవడంతో ఈ చిత్రాన్ని కూడా ఓటీటీలోనే విడుదల చేశారు. ఈ చిత్రం యానం, కాకినాడ, విశాఖ, అరకు తదితర ప్రాంతాల్లో షూటింగ్ జరిగింది. ఈ చిత్రానికి సంగీతం: శేఖర్, కెమెరా: క్రాంతి కుమార్, ఎడిటింగ్: సునీల్ చరణ్, ఫోటో గ్రాఫి: బాలు, సహా నిర్మాత ఎం.శివ, కథ,స్క్రీన్‌ప్లే,మాటలు,దర్శకత్వం: బి.సంతోష్ కుమార్, నిర్మాత: ఎం. ఆనంద్.