Wednesday, January 22, 2025

విజ‌య్ శంకేశ్వ‌ర్ బ‌యోపిక్ ‘విజయానంద్’ టీజర్ రిలీజ్

ఇండియ‌న్ సినిమాలో బ‌యోపిక్స్ హ‌వా కొన‌సాగుతోంది. ఈ కోవ‌లో మ‌రో బ‌యోపిక్ సినీ ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌టానికి సిద్ధ‌మైంది. ఆ బ‌యోపిక్ మ‌రెవ‌రిదో కాదు.. సామాన్యుడిగా త‌న జీవితాన్ని ప్రారంభించి ఓ పెద్ద లాజిస్టిక్ కంపెనీకి అధినేత‌గా ఎదిగి ఎంద‌రికో ఆద‌ర్శ‌ప్రాయుడిగా డా.ఆనంద్ శంకేశ్వ‌ర్‌ది. ఆయ‌న జీవితాన్ని ‘విజయానంద్’ అనే పేరుతో రూపొందిస్తున్నారు.

దేశంలో అతి పెద్ద లాజిస్టిక్ కంపెనీల్లో ఒక‌టైన వీఆర్ఎల్‌కు సంబంధించిన వీఆర్ఎల్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఇప్ప‌టికే లాజిస్టిక్ రంగంతో పాటు మీడియా స‌హా ప‌లు రంగాల్లో త‌న‌దైన స్థానాన్ని ద‌క్కించుకుంది. ఇప్పుడు వి.ఆర్‌.ఎల్ ఫిల్మ్‌ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌తో సినీ రంగంలోకి అడుగు పెడుతున్నారు. ఈ బ్యాన‌ర్‌లో రూపొందుతోన్న తొలి చిత్రం ‘విజయానంద్’. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ మలయాళ భాషల్లో సినిమాను ప్రేక్ష‌కుల‌కు అందించ‌టానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

ఆనంద్ శంకేశ్వ‌ర్ స‌మ‌ర్ప‌ణ‌లో వి.ఆర్‌.ఎల్ ఫిల్మ్‌ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై రిషికా శ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో ఆనంద్ శంకేశ్వ‌ర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజ‌ర్‌ను మంగ‌ళ‌వారం విడుద‌ల చేశారు. విజ‌యానంద్ త‌న తండ్రిపై ఆధార‌ప‌డ‌కుండా త‌న సొంత తెలివి తేట‌ల‌తో లారీల వ్యాపారంలోకి ఎలా ప్ర‌వేశించారు. అటు నుంచి ఆయ‌న క్ర‌మ క్ర‌మంగా ఎలా ఎదుగుతూ వ‌చ్చారు. ఆ క్ర‌మంలో ఆయ‌న‌కు స‌పోర్ట్‌గా నిలిచిందెవ‌రు? అనే విష‌యాల‌ను టీజ‌ర్‌లో చూపించారు. టీజ‌ర్ ఇన్‌స్పైరింగ్‌గా ఉంది. కృషి ఉంటే మ‌నుషులు ఋషుల‌వుతారు.. మ‌హా పురుషుల‌వుతారు అని చెప్ప‌డానికి బెస్ట్ ఎగ్జాంపుల్ విజ‌య్ శంకేశ్వ‌ర్‌. ఆయ‌న జీవితం సినిమా రూపంలో వ‌స్తుందంటే వఇది క‌చ్చితంగా చాలా మందికి స్ఫూర్తిని క‌లిగిస్తుంద‌న‌టంలో సందేహం లేదు.

హార‌ర్ థ్రిల్ల‌ర్ మూవీ ట్రంక్ అనే సినిమాను తెర‌కెక్కించిన డైరెక్ట‌ర్ రిషికా శ‌ర్మ ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. విజ‌య్ శంకేశ్వ‌ర్ పాత్ర‌లో నిహాల్ న‌టించారు. ఆనంత్ నాగ్‌, విన‌య ప్ర‌సాద్‌, వి.ర‌విచంద్ర‌న్‌, ప్ర‌కాష్ బెల‌వాడి, అనీష్ కురివిల్లా త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. సౌతిండియ‌న్ ఫేమ‌స్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ గోపీ సుంద‌ర్ సంగీతాన్ని అందిస్తున్నారు. ర‌వి వ‌ర్మ యాక్ష‌న్ బాధ్య‌త‌ల‌ను నిర్వ‌హిస్తుండ‌గా ర‌ఘు నిడువ‌ల్లి డైలాగ్స్ రాస్తున్నారు. కీర్త‌న్ సినిమాగ్ర‌ఫీ అందిస్తున్నారు. ఇంకా ఈ చిత్రానికి ఇమ్రాన్ స‌ర్దారియా కొరియోగ్ర‌ఫీ, ఎడిట‌ర్‌గా హేమంత్ కుమార్ డి.. ప్రకాష్ గోఖ‌క్ మేక‌ప్ అండ్ హెయిర్ స్టైలిష్ట్ బాధ్య‌త‌ల‌ను నిర్వ‌హిస్తున్నారు.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x