Wednesday, January 22, 2025

ఇన్‌స్టాగ్రాం ఓపెన్ చేసేందుకు మెడపై పచ్చబొట్టు.. పనిచేయకపోవడంతో..

వెర్రి వెయ్యి రకాలంటారు. కొందరికి ఈ వెర్రి వేపకాయంత ఉంటే.. మరికొందరికి గుమ్మడికాయంత ఉంటుంది. ఈ వెర్రితో వారు చేసే పనులు.. మామూలుగా ఉండవు. తాజాగా ఓ వ్యక్తి అలాంటి పిచ్చితోనే ఓ విచిత్రమైన పని చేశాడు. కొలంబియాలో ఓ యువకుడు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను ఓపెన్ చేసేందుకు మెడ వెనక క్యూఆర్ కోడ్‌ను పచ్చబొట్టుగా పొడిపించుకున్నాడు. అయితే, ఆ తర్వాత అది పనిచేయకపోవడంతో విస్తుపోయాడు. మౌరీసియా గోమెజ్‌కు సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గా మంచి గుర్తింపు ఉంది. లా లీండ్రా పేరుతో ఓ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నడుపుతున్నాడు. అతడి ఖతాకు ఏకంగా 5 మిలియన్ల ఫాలోవర్లున్నారు.

ఈ నెల మొదట్లో లా లీండ్రా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ వీడియోను షేర్ చేశాడు. అందులో తన మెడ వెనక పచ్చబొట్టుతో పొడిపించుకున్న క్యూఆర్ కోడ్ ఉంది. ఓ వ్యక్తి ఆ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసిన వెంటనే స్క్రీన్‌పై పాపప్ నోటిఫికేషన్ వచ్చింది. దానిపై టచ్ చేయగానే లా లీండ్రా ఇన్‌స్టాగ్రామ్ పేజీ ఓపెన్ అయింది. అది చూసి అతడి ఫాలోవర్లు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. అయితే, కొన్ని వారాల తర్వాత ఆ వార్త పనిచేయడం మానేసింది. దీంతో ఈ సారి షాకవడం లా లిండ్రా వంతయింది. దీంతో ఎంతో కష్టపడి పొడిపించుకున్న క్యూఆర్ కోడ్ పచ్చబొట్టు పనిచేయకపోవడంతో లీండ్రా తెగ బాధపడిపోతున్నాడు.

అయితే కొంతమంది నెటిజన్లు మాత్రం ఈ పచ్చబొట్టు క్యూఆర్ కోడ్ ఎప్పుడూ పనిచేయలేదని, లా లిండ్రా అబధ్ధం చెబుతున్నాడంటూ విమర్శించగా.. మరి కొంత మంది మాత్రం మొదట్లో పనిచేసినా.. శరీరంపై పిగ్మెంట్ మారడం కారణంగా అది పనిచేయడం మానేసిందని వివరణ ఇస్తున్నారు. మరి ఇందులో నిజానిజాలేవో పక్కనపెడితే.. ప్రస్తుతానికి ఆ పచ్చబొట్టు మాత్రం వేస్ట్ అయిపోయింది.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x