Thursday, November 21, 2024

మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ చిత్రం :మోహన్ రాజా ఇంటర్వ్యూ

భారతీయ చిత్రపరిశ్రమలోని ఇద్దరు మెగాస్టార్లు చిరంజీవి, సల్మాన్ ఖాన్ కలసి నటిస్తున్న ఆల్ టైమ్ బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘గాడ్ ఫాదర్’ ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ మూవీ. స్టైలిష్ ఫిల్మ్ మేకర్ మోహన్ రాజా దర్శకత్వం వహించారు. నయనతార, సత్యదేవ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కొణిదెల సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్లపై ఆర్బి చౌదరి, ఎన్వి ప్రసాద్ ఈ చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మించారు. గాడ్ ఫాదర్ అక్టోబర్ 5న దసరా కానుకగా తెలుగు, హిందీలో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలౌతున్న నేపధ్యంలో దర్శకుడు మోహన్ రాజా విలేఖరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.

దాదాపు ఇరవై ఏళ్ల తర్వాత మళ్ళీ తెలుగు సినిమా చేయడం ఎలా అనిపించింది ?
చాలా అనందంగా వుంది. తమిళనాడులో పుట్టాను. కానీ దర్శకుడి గా పుట్టింది మాత్రం తెలుగు చిత్ర పారిశ్రమలోనే. నాన్న గారు వేసిన బాటలో ప్రయణిస్తున్నాం. అయితే నాకు తెలుగు పరిశ్రమకి దూరంగా వున్నాననే భావన లేదు. వరుసగా ఆరు తెలుగు సినిమాలని తమిళ్ లో రీమేక్ చేశా. అలాగే తనివరువన్ ఇక్కడ ధ్రువగా రావడం కూడా ఆనందంగా వుంది.

గాడ్ ఫాదర్ అవకాశం ఎలా వచ్చింది ?
నిర్మాత ఎన్వి ప్రసాద్ గారు నాకు చిన్నప్పటి నుండి తెలుసు. నేనంటే చాలా ఇష్టం ఆయనికి. నన్ను మళ్ళీ తెలుగులోకి రమ్మని పిలిచేవారు. ఒకసారి మహేశ్ బాబు దగ్గరికి కూడా తీసుకెళ్ళారు. తని వరువన్ నుండి నాకు చరణ్ కి పరిచయం ఏర్పడింది. ధ్రువ -2 గురించి చర్చలు జరుపుతున్న సమయంలో లూసిఫర్ ప్రస్తావన వచ్చింది. ఈ సినిమాకి దర్శకుడిగా ఎన్వీ ప్రసాద్ గారే నాపేరుని సూచించారు. చరణ్ బాబు, చిరంజీవి గారికి నచ్చింది. ఫోన్ చేసి పిలిపించారు. వారిని కలిసే ముందే లూసిఫర్ ని చూశాను. అందులో నాకు ఒక కొత్త కోణం దొరికింది. అదే చిరంజీవి గారితో పంచుకున్నాను. ఆ కోణం చిరంజీవిగారికి చాలా నచ్చింది.

లూసిఫర్ ని గాడ్ ఫాదర్ గా తెరకెక్కించే క్రమంలో ఏమైనా మార్పులు చేశారా ?
లూసిఫర్ లో లేని ఒక కోణం గాడ్ ఫాదర్ లో వుంటుంది. కథని అలానే వుంచి ఫ్రెష్ స్క్రీన్ ప్లే చేశాను. గాడ్ ఫాదర్ స్క్రీన్ ప్లే చాలా సర్ ప్రైజింగ్ గా వుంటుంది. ఇందులో హీరోతో పాటు మరో పది పాత్రలు కూడా గెలుస్తాయి. మలయాళంలో చూడని పది పాత్రలు ఇందులో వేరే రూపంలో వుంటాయి. ఈ పాత్రలు చాలా సర్ ప్రైజింగ్ గా వుంటాయి. ఓపిక వుంటే లూసిఫర్ మరోసారి చూసిరండి (నవ్వుతూ)

మలయాళంలో విడుదల చేయడానికి కారణం కూడా స్క్రీన్ ప్లే లో చేసిన మార్పులేనా ?
అవును. కథలు దాదాపు ఒకేలా వుంటాయి. కొత్త స్క్రీన్ ప్లే ప్యాట్రన్ పట్టుకోవాలి. గాడ్ ఫాదర్ లో ఫ్రెష్ స్క్రీన్ ప్లే ప్యాట్రన్ తో చేశాం. చాలా కీలకమైన మార్పు చేశాం. అది తెలుగు ప్రేక్షకులు కోరుకున్న వినోదం అందిస్తుంది. లూసిఫర్ సినిమాకి నేను పెద్ద అభిమానిని. ఆ సినిమా దర్శకుడు ప్రుద్విరాజ్ సుకుమారన్ కంటే ఎక్కువ ప్రేమించాను. ఏడాదిన్నర పాటు లూసిఫర్ తో కాపురం చేశాను(నవ్వుతూ) ప్రేమ లేకుండా కాపురం చేయలేం కదా (నవ్వుతూ). అలా ప్రేమించిన నాకే అందులో ప్లస్ మైనస్ తెలుస్తాయి. అలా గొప్ప గా ప్రేమించి ఇంకా గొప్పగా తీసిన సినిమా గాడ్ ఫాదర్

సత్యదేవ్ ని తీసుకోవడానికి కారణం ?
ఇందులో ట్రిక్కి విలన్ పాత్ర వుంది. చక్కగా ఫెర్ ఫార్మ్ చేసే విలన్ కావాలి. దాని కోసం సత్యదేవ్ ని తీసుకున్నాం. సినిమా చూసిన తర్వాత చిరంజీవి గారు సత్యదేవ్ పాత్రే అందరికీ గుర్తుంటుంది. ఎప్పుడైనా హీరోకి విలన్ కష్టమైన సమస్యలు ఇస్తేనే స్క్రీన్ ప్లే మజా వుంటుంది. ఇందులో సత్యదేవ్ దిమ్మతిరిగే ప్రాబ్లమ్స్ ఇస్తారు(నవ్వుతూ).

లూసిఫర్ లో మోహన్ లాల్ అండర్ ప్లే చేశారు కదా.. అలాగే అందులో స్క్రీన్ ప్లే కూడా స్లో పెస్డ్ గా వుంటుంది. చిరంజీవి గారి సినిమాకి ఈ రెండూ రిస్క్ కదా ?

గాడ్ ఫాదర్ కోసం స్క్రీన్ ప్లే చాలా ఫ్రెష్ గా చేశామని ఇంతకిముందే చెప్పాను. 2గంటల 50 నిమిషాల లూసిఫర్ లో మోహన్ లాల్ గారు 50 నిమిషాలు మాత్రమే కనిపిస్తారు. గాడ్ ఫాదర్ లో చిరంజీవి గారు 2 గంటల పాటు కనిపిస్తారు. ఆయన కనిపించని సీన్స్ లో కూడా ఆయన ప్రజన్స్ వుంటుంది. దిని ప్రకారం ఎలాంటి మార్పులు చేశామో మీరు అర్ధం చేసుకోవచ్చు. అలాగే గాడ్ ఫాదర్ కి నేను రాసుకున్న స్క్రీన్ ప్లే లో స్లో పెస్డ్ కుదరదు. గాడ్ ఫాదర్ కంప్లీట్ ఫాస్ట్ పెస్డ్ గా వుంటుంది. గాడ్ ఫాదర్ చిరంజీవి గారి ఇమేజ్ కి తగ్గ కథ. ఈ కథకి సరిపడే ఇమేజ్ వున్న హీరోలు ఇండియాలో ఓ ముగ్గురు మాత్రమే వుంటారు.

చిరంజీవి గారు, సల్మాన్ ఖాన్ లతో పని చేయడం ఎలా అనిపించింది ?
చిరంజీవి, సల్మాన్ ఖాన్ లాంటి ఇద్దరు మెగాస్టార్లని డైరెక్ట్ చేయడం అంత సులువైన విషయం కాదు.చాలా ఒత్తిడి వుంటుంది. అయితే మెగాస్టార్ చిరంజీవి గారు ఆ ఒత్తిడిని తీసేశారు. చిరంజీవి గారు ఇచ్చిన ప్రోత్సాహం మర్చిపోలేను. సల్మాన్ ఖాన్ గారు కూడా చాలా కూల్ వుంటారు. చిరంజీవి గారిపై వున్న ప్రేమతో ఈ సినిమాని చేశారు సల్మాన్.

సల్మాన్ ఖాన్ ని తీసుకోవడానికి కారణం ?
లూసిఫర్ లో ప్రుద్వి రాజ్ సుకుమారన్ చేశారు. ఆయన అక్కడ పెద్ద స్టార్. గాడ్ ఫాదర్ కి కూడా ఒక పెద్ద స్టార్ అవసరం పడింది. అయితే ఇది గ్లామర్ కోసం కాదు. ఇందులో హీరో పాత్ర సర్వాంతర్యామి. ఎవరు ఏం గేమ్ ఆడిన ఆయన ఆడే నాటకంలో పాత్రధారులే అంతా. అలాంటి పాత్ర కోసం చెప్పడానికి ఒక పెద్ద స్టార్ కావాలి. ఆయన ఇంట్లో చాలా మంచి పెద్ద స్టార్లు వున్నారు. ఆ పాత్ర గురించి వాళ్ళు చెప్పడం కంటే బయటవారు అయితే మరింత ఇంపాక్ట్ ఫుల్ గా ఉంటుందని భావించాను. చరణ్ బాబు, సల్మాన్ స్నేహితులని తెలిసింది. చరణ్ బాబు కి చెప్పడం ఆయనే అంతా చూసుకోవడం జరిగింది. సల్మాన్ ఖాన్ స్క్రీన్ ప్రజన్స్ అదిరిపోతుంది. సల్మాన్ ఖాన్ గారు ఆయన సీన్స్ చూశారు. చాలా హ్యాపీగా ఫీలయ్యారు.

మిగతా పాత్రల గురించి ?
ఇందులో పది పాత్రలు ప్రేక్షకులని థ్రిల్ చేస్తాయి. చిరంజీవి, సల్మాన్, నయనతార, సత్యదేవ్, పూరి జగన్నాద్, మురళి శర్మ, సునీల్, సముద్రఖని, సఫీ, బ్రహ్మాజీ, ఇలా పాత్రలన్నీ ప్రేక్షకులని అరెస్ట్ చేస్తాయి. ఇందులో పూరిగారు జర్నలిస్ట్ గా కనిపిస్తారు. ఆయన పాత్ర చాలా బావుంటుంది.

గాడ్ ఫాదర్ 2 వుంటుందా ?
మలయాళంలో లుసిఫర్ 2 మొదలైయింది. ప్రస్తుతం నా ద్రుష్టి మాత్రం గాడ్ ఫాదర్ పైనే వుంది. అయితే గాడ్ ఫాదర్ సీక్వెల్ కి మంచి కంటెంట్ వుంది. తని వరువన్ సీక్వెల్ ఆలోచన కూడా వుంది.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x