Friday, November 1, 2024

అనన్య నాగళ్ల ‘వకీల్‌ సాబ్‌’ ఇంటర్వ్యూ

మల్లేశం చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమైన నాయిక అనన్య నాగళ్ల. ఈ తెలుగమ్మాయి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ చిత్రంలో నటించి ప్రస్తుతం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఏప్రిల్ 9న వకీల్ సాబ్ ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా ఈ చిత్రంలో నటించిన అనుభవాలను అనన్య తెలిపింది. అనన్య నాగళ్ల చెప్పిన ఆ విశేషాలు చూస్తే….

– మల్లేశం సినిమా నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయ్యాక దర్శకుడు శ్రీరామ్ వేణు గారు ఆ సినిమా చూసి వకీల్ సాబ్ లో ఈ క్యారెక్టర్ కు నేను సరిపోతానని పిలించారు. మూడు రౌండ్స్ ఆడిషన్ చేశాక సెలెక్ట్ చేశారు. అయితే ఇది పవన్ కళ్యాణ్ గారి సినిమా అని నాకు ముందు తెలియదు. తెలిశాక సర్ ప్రైజ్ అయ్యాను.

– జీవితంలో ఊహించని ఆనందం ఎదురైతే మనం వెంటనే దాన్ని నిజం అనుకోము. ఇదోదే కల అనిపిస్తుంటుంది. వకీల్ సాబ్ చిత్రంలో నా సెలెక్షన్ జరిగిన తర్వాత కూడా అదే ఫీలింగ్ కలిగింది. చిత్ర పరిశ్రమలో ఎన్నో రిజెక్షన్స్ చూసి వచ్చాను కాబట్టి, కొన్ని రోజులు అయ్యాక గానీ నిజంగానే పవన్ కళ్యాణ్ గారి సినిమాలో నటిస్తున్నాను అనే నమ్మకం కలగలేదు.

– వకీల్ సాబ్ సినిమాలో నా పాత్ర చాలా ఇన్నోసెంట్ గా ఉంటుంది. తన పనేదో తన చూసుకునే అమ్మాయిలా కనిపిస్తాను. నేను చేసిన క్యారెక్టర్ మన జీవితంలో తరుచుగా చూస్తుంటాం. ఇలాంటి ఒక అమ్మాయికి సమస్య వస్తే, అయ్యో తనకు ఇలా జరిగిందా అని బాధపడేలా ఉంటుంది. నా క్యారెక్టర్ మీద ప్రేక్షకులు సింపథీ చూపిస్తారు.

– వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చాలా సేపు మాట్లాడాలనుకుని అక్కడి గెస్ట్ లను చూసి అంతా మర్చిపోయాను. తెలుగు అమ్మాయిలకు తెలుగులో అవకాశాలు రావు, ముందు తమిళం లాంటి లాంగ్వేజ్ చిత్రాలు చేసి తర్వాత ఇక్కడికి వస్తే గౌరవం ఉంటుందని మాలాంటి కొత్త హీరోయిన్స్ మధ్య డిస్కషన్స్ జరుగుతుంటాయి. కానీ వకీల్ సాబ్ తెలుగు అమ్మాయిలకు ఒక హోప్ ఇచ్చింది.

– పవన్ కళ్యాణ్ గారితో సెట్ లో గడిపిన సమయం మర్చిపోలేను. ఆయనతో ఫన్ గా టైమ్ గడిచింది, పవన్ గారు చెప్పే విషయాలు ఇన్ స్పైరింగ్ గా ఉండేవి. అలాగే చాలా విషయాలు నేర్చుకున్నాను. ఆయనతో డీప్ డిస్కషన్స్ ఉంటాయి. సరదాగా మనం మాట్లాడుకునే విషయాలు మాట్లేందుకు ఆయన ఆసక్తి చూపించరు. వకీల్ సాబ్ షూటింగ్ జరుగుతున్నప్పుడే ఏపీ లో ఒక అమ్మాయి మీద అఘాయిత్యం జరిగితే ఆ విషయం గురించి పవన్ గారు నాతో మాట్లాడారు. దిశ ఇన్సిడెంట్ లాంటివి అమ్మాయిల మీద జరిగినప్పుడు వాటి మీద పోరాటం చేసేందుకు నేనేమీ చేయలేను, నాకేమీ శక్తి లేదు అనుకోవద్దు నీ ప్రార్థనను యూనివర్స్ కు పంపించు. అది కూడా ప్రభావం చూపిస్తుందని పవన్ గారు చెప్పేవారు. ఆయనతో జరిగిన ఇలాంటి రెండు మూడు డిస్కషన్స్ మర్చిపోలేను.

– నివేదా థామస్, అంజలితో పోల్చుకుంటే నాకు ఎక్సీపిరియన్స్ తక్కువ. కాబట్టి వారితో ఎప్పుడూ నటనలో పోటీ పడాలని అనుకోలేదు. వీలైనంత వరకు వాళ్ల దగ్గర నుంచి నేర్చుకునేందుకు ప్రయత్నించాను గానీ కాంపిటేషన్ గా ఫీలవలేదు. అంజలి గారితో చాలా ఫన్ గా ఉండేది. ఆమె ఎప్పుడూ సరదాగా నవ్విస్తూ ఉండేది. నివేదా కొద్దిగా సీరియస్. తన ఆలోచనలు కూడా ఇంటెన్స్ గా ఉండేవి. ఇద్దరూ నాకు చాలా సపోర్ట్ చేశారు. మాకు శృతి హాసన్ తో కాంబినేషన్ సీన్స్ ఉండవు.

– పవన్ కళ్యాణ్ గారితో మొదట్లో భయంగానే ఉండేది. ఆయన పవర్ స్టార్. వెంటనే వెళ్లి మాట్లాడలేం కదా. నేను దూరంగా ఉండేదాన్ని. కోర్టు సీన్స్ జరిగేప్పుడు మాత్రం మాకు కొద్దిగా పరిచయం అయ్యే అవకాశం కలిగింది. నేను భయపడుతున్నాను అనే విషయం పవన్ గారు తెలుసుకుని నాతో మాట్లాడారు. ఆయన నాతో మాట్లాడుతూ…మల్లేశం సినిమా గ్లింప్స్ లా చూశాను. బాగా నటించవు అని చెప్పారు. ఆ తర్వాత నేను ఎక్కడి నుంచి ఇండస్ట్రీకి వచ్చాను. ఏం చదివాను, ఏ సినిమాలు చేస్తున్నాను అనే విషయాలు అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత సార్ తో నటించడం కంఫర్ట్ గా అనిపించింది. ప్రకాష్ రాజ్ గారు, అంజలి బాగా జోక్స్ చేసేవారు. పవన్ గారు వారితో కలిసినప్పుడు సెట్స్ లో ఇంకా సరదాగా ఉండేది.

– నివేదా, అంజలి నాకు కలిసి పవన్ గారితో కొన్ని ఇంటెన్స్ సీన్స్ ఉంటాయి. నా సీన్స్ ముందు జరిగాయి. ఆ తర్వాత నివేదా, అంజలి సీన్స్ చేశారు. కోర్ట్ సీన్ చేసేప్పుడు పవన్ గారితో కాంబినేషన్ లో నటించాను. అప్పుడు నా నటన చూసి, మీ యాక్టింగ్ లో ఎమోషన్ బాగా ఉంది. సీన్ రిపీట్ చేసినా అదే ఎమోషన్ లో ఉంటున్నారు అని కాంప్లిమెంట్ ఇచ్చారు. ఆ ప్రశంసకు చాలా హ్యాపీగా ఫీలయ్యాను.

– మల్లేశం, ప్లే బ్యాక్ చిత్రాల తర్వాత నా కెరీర్ సరైన దారిలో వెళ్తుందని అనుకుంటున్నా. ఎవరికైనా సరైన ప్రాజెక్ట్ లు రావడంతో పాటు కొంత అదృష్టం కలిసి రావాలి. ఇప్పుటికైతే నా కెరీర్ బాగుందని అనుకుంటున్నా. వకీల్ సాబ్ లాంటి చిత్రాలను నేను ఎంపిక చేసుకోలేను, అవే నన్ను తీసుకున్నాయి. కానీ మిగతా చిత్రాల సెలెక్షన్ అప్పుడు మాత్రం బాగా ఆలోచిస్తా. మనం చేసే సినిమాలో ఏదో ఒక ప్రత్యేకత ఉండాలని అనుకుంటా.

– తెలుగు అమ్మాయిలకు ఇండస్ట్రీకి మధ్య చిన్న అవరోధం ఉంది. అదేంటంటే వీళ్లు సినిమాలకు సరిగ్గా సపోర్ట్ చేయరు. ఆటిట్యూడ్ చూపిస్తారు అనే ముద్ర మాపై ఎప్పటినుంచో ఉంది. దాని వల్ల అవకాశాలు రావడం కష్టమవుతోంది. అంతకుమించి ఇండస్ట్రీలో మాకేం ఇతర సమస్యలు లేవు. సినిమా నచ్చితే నటించడానికి హద్దులేం పెట్టుకోలేదు. ఇలాగే కనిపించాలనే రూల్స్ నాకు లేవు.

– వకీల్ సాబ్ సినిమా సమాజం మీద ప్రభావం చూపించాల్సిన సమయం ఇది. ఖచ్చితంగా ఈ సినిమా ఒక మార్పు తేవాలి, తెస్తుంది. మన ముందు తరంలో అమ్మాయి అంటే ఇలా ఉండాలి, అబ్బాయి ఇలా ఉండాలనే తేడా స్పష్టంగా ఉండేది. ఇప్పుడు అమ్మాయి, అబ్బాయి ఎవరైనా సరైన దారిలో వెళ్తే చాలు అనుకుంటున్నారు. ఈ టైమ్ లో వకీల్ సాబ్ సినిమా మహిళలకు మరింత సపోర్ట్ గా ఉంటుందని చెప్పొచ్చు. అమ్మాయిలనే కాదు అబ్బాయిలను కూడా సరైన విధంగా పెంచాలని చెబుతుందీ సినిమా.

– ఇండస్ట్రీలో అమ్మాయిలకు ఇబ్బందులు ఎదురవుతుంటాయని నేనూ విన్నాను కానీ నాకెప్పుడూ అలాంటి సందర్భాలు ఎదురుకాలేదు. నేను ఇండస్ట్రీలోకి రావడం కష్టమయ్యింది కానీ ఇక్కడికొచ్చాక చేదు సంఘటనలు ఎదురుకాలేదు.

– ప్రస్తుతం బబ్లీ క్యారెక్టర్స్ చేయాలని అనుకుంటున్నాను. ఆ తర్వాత ఫర్మార్మెన్స్ ఓరియెంటెడ్ మూవీస్ కు ప్రిపరెన్స్ ఇస్తాను. ప్రస్తుతం రెండు చిత్రాలు చేస్తున్నాను. వాటి వివరాలు త్వరలో చెబుతాను. వకీల్ సాబ్ సినిమా సెలబ్రేషన్స్ కు ఇంకా టైముంది. రిలీజ్ అయ్యాక సెలబ్రేషన్స్ చేసుకుంటాను. అని చెప్పింది.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x