Wednesday, January 22, 2025

గంగమ్మ ఒడిలో శవాల ప్రవాహం.. కరోనా ప్రళయమా.?

వందల కొద్దీ మృతదేహాలు గంగానదిలో తేలుతూ కనిపిస్తున్నాయి. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఇలాంటి దారుణమైన పరిస్థితులు గంగానదిలో కనిపిస్తున్నాయి. కొన్ని వారాలుగా భారత్‌లో కరోనావైరస్ సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. ఇప్పటివరకు దేశంలో 2.5 కోట్లకు పైగా కేసులు నమోదయ్యాయి. అధికారిక మరణాలు కూడా 2.75 లక్షలకుపైనే నమోదయ్యాయి. అయితే ఇదంతా అధికారిక లెక్కల ప్రకారం. ఈ లెక్కల్లో లేని మరణాలు కూడా ఇంకా ఎన్నో ఉండే ఉంటాయని అనేకమంది అంచనా వేస్తున్నారు. అయితే ఇంతమంది మరణిస్తుండడంతో మృతదేహాలకు అంతక్రియలు చేసేందుకు కూడా సరిపడా స్థలం లభించడం లేదు. దానికి తోడు అంత్యక్రియలకు అయ్యే ఖర్చు కూడా ఈ మధ్య పెరిగిపోయింది. దీంతో గంగానది సమీపంలోని అనేకమంది తమ కుటుంబాల్లో కరోనాతో మరణించిన వారి మృతదేహాలను గంగానదిలో పారేస్తున్నారు. ఇంకొంతమంది నది ఒడ్డునే పాతిపెట్టేస్తున్నారు.

ఒకప్పుడు పుణ్యం కోసం:
కొన్నేళ్ల క్రితం వరకు గంగానదిలో ఇలానే మృతదేహాలను పడేసేవారు. అయితే అప్పట్లో గంగానదిలో తమవారి మృతదేహాలు వేస్తే వారి ఆత్మ పుణ్యలోకాలకు చేరతుందని అనుకునేవారు. ఈ క్రమంలోనే ఏటా వేల మృతదేహాలు గంగానదిలో తేలేవి. అయితే గత 7-8 ఏళ్లలో ఇది గణనీయంగా తగ్గింది. ప్రధానంగా మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ‘నమామి గంగ’ పేరుతో ఓ కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీంతో ఆ తర్వాత కాలంలో నదిలో ఈ మృతదేహాల పారవేత తగ్గింది. అయితే ఈ మధ్య కాలంలో కరోనా మరణాలతో మళ్లీ ఒకప్పటి పరిస్థితులు తలెత్తుతున్నాయి.

కరోనా రెండో దశలో దేశంలో వేల మంది మరణిస్తున్నారు. ఒక్క గురువారమే 3,874 మంది కరోనా కారణంగా మరణించినట్లు తెలుస్తోంది. అయితే ఇదంతా అధికారిక లెక్క. ఆసుపత్రల్లో రికార్డయిన లెక్క. కానీ నిజానికి మరణాల రేటు తీవ్రంగా ఉన్నట్లు అనేకమంది నిపుణులు అంచనా వేస్తున్నారు. శ్మశాన వాటికల్లోని ఎలక్ట్రిక్ క్రిమెటోరియమ్స్ అన్నీ నిర్విరామంగా 24 గంటలూ ప్రతి రోజూ నడుస్తున్నాయి. అయితే శ్మశానాల బయట మృతదేహాల క్యూ తగ్గడం లేదు. దీంతో అధికారులు కూడా వేరే మార్గాల ద్వారా మృతదేహాలకు అంత్యక్రియలు చేసేందుకు అనుమతిస్తున్నారు. బయటి ప్రాంతాల్లో అంత్యక్రియలు చేసుకునేందుకు అనుమతిస్తున్నారు. కానీ ఇక్కడ కూడా పెద్ద సమస్య తలెత్తుతోంది. కేవలం ఆసుపత్రుల నుంచి వచ్చిన, ఆసుపత్రుల సర్టిఫికేట్లు ఉన్న మృతదేహాల అంత్యక్రియలకు మాత్రమే అనుమతులిస్తున్నారు. అయితే అనేకమంది కరోనా బాధితులు తమ ఇళ్లలోనే ఊపిరి వదులుతున్నారు. దీంతో అలాంటి కటుంబాలకు వేరే మార్గం ఉండడం లేదు. వారు ఆ మృతదేహాలను ఊరి చివరకు, లేదా పక్క ప్రాంతాలకు తీసుకెళ్లి అంత్యక్రియలు చేస్తున్నారు. దానికి కూడా కట్టులు కూడా లేని సమయంలో అక్కడే పూడ్చి పెట్టి వచ్చేస్తున్నారు. ఇక మరికొంతమంది హిందువులు ‘జల్ ప్రవాహ్’ అనే విధానాన్ని అవలంబిస్తూ నదుల్లో వదిలేస్తున్నారు. మృతదేహాలను తెల్లటి వస్త్రంలో చుట్టి నదిలో వదిలేస్తున్నారు.

దీనిని బట్టి చూస్తే.. మత విధానాలు మాత్రమే కాదు.. పేదరికం, కరోనా మహమ్మారి విజృంభణతో ఏర్పడిన దారుణ పరిస్థితుల్లో.. కనీసం తమవారికి అంత్యక్రియలు కూడా చేసే స్థోమత లేక, ఒకవేళ స్థోమత ఉన్నా.. శ్మశానాల్లో ఖాళీ లేక గంగా నదిలో తమవారి మృతదేహాలను వదిలేస్తున్నారని తెలుస్తోంది. నదీ తీరంలోని ఇసుకలోనూ మృతదేహాలను చాలా మంది పూడ్చేస్తున్నారు. దీంతో నది పరిసరాల్లో నివసించేవారు తమకు కోవిడ్-19 సోకుతుందేమోనని భయపడుతున్నారు.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x