Wednesday, January 22, 2025

‘18 పేజీస్’ ఫ‌స్ట్ లుక్ కి విశేష స్పంద‌న‌

అర్జున్ సుర‌వ‌రం వంటి బ్లాక్ బ‌స్ట‌ర్స్ హిట్ త‌రువాత‌ యంగ్ డైన‌మిక్ హీరో నిఖిల్, మ‌ళ‌యాలీ ముద్దుగుమ్మ అనుప‌మ జంట‌గా కుమారి 21 ఎఫ్ ఫేమ్ ప‌ల్నాటి సూర్య ప్ర‌తాప్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న చిత్రం 18 పేజీస్. మెగాప్రొడ్యూసర్ అల్లు అర‌వింద్ గారి స‌మ‌ర్ప‌ణలో స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ స్టోరీ, స్క్రీన్ ప్లే అందిస్తూ, 100 ప‌ర్సెంట్, భ‌లే భ‌లే మ‌గాడివోయ్, గీత‌గోవిందం, ప్ర‌తిరోజూపండుగే వంటి స‌క్సెస్ ఫుల్ చిత్రాల‌తో స‌క్స‌స్ కి కేర్ ఆఫ్ అడ్ర‌స్ గా మారిన యంగ్ నిర్మాత బ‌న్నివాసు నిర్మాత‌గా జీఏ2పిక్చ‌ర్స్ మ‌రియు ఉప్పెన వంటి స‌న్సెషేన‌ల్ హిట్ అందుకుని విజ‌య‌వంతంగా ముందుకు సాగుతున్న సుకుమార్ రైటింగ్స్ తో క‌లిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 18 పేజీస్ అనే టైటిల్ ఈ సినిమాకు ఫిక్స్ చేసిన‌ప్ప‌టి నుంచి అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ అనూహ్య స్పంద‌న ల‌భించింది, అలానే స్టార్ ద‌ర్శ‌కుడు సుకుమార్ ఈ సినిమాకు స్టోరీ, స్క్రీన్ ప్లే అందిస్తుండ‌టం, కుమారి 21 ఎఫ్ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ త‌రువాత ప‌ల్నాటి సూర్య ప్ర‌తాప్ డైరెక్ట్ చేస్తున్న సినిమా కావ‌డంతో, నిఖిల్ – అనుప‌మ కాంబినేష‌న్, జీఏ2 పిక్చ‌ర్స్ – సుకుమార్ రైటింగ్స్ సంయుక్త నిర్మాణం వెర‌సి 18 పేజీస్ ప్రాజెక్ట్ పై అంద‌రి అస‌క్తి మ‌రింత పెంచుతున్నాయి. ఈ నేప‌థ్యంలో జూన్ 1న నిఖిల్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా 18 పేజీస్ ఫ‌స్ట్ లుక్ ని విడుద‌ల చేశారు. నిఖిల్ క‌ళ్ల‌కు గంత‌లు క‌ట్టి, వాటి పై అనుప‌మ

“నా పేరు నందిని
నాకు మొబైల్ లో అక్ష‌రాలను టైప్ చెయ్య‌డం క‌న్నా
ఇలా కాగితం పై రాయ‌డం ఇష్టం
టైప్ చేసే అక్ష‌రాల‌కి ఎమోష‌న్స్ ఉండ‌వు
ఎవ‌రు టైప్ చేసినా ఒకేలా ఉంటాయి, కానీ
రాసే ప్ర‌తి అక్ష‌రానికి ఒక ఫీలింగ్ ఉంటుంది
దానీ పై నీ సంత‌కం ఉంటుంది
నాకెందుకో ఇలా చెప్ప‌డ‌మే బాగుంటుంది”అని రాస్తున్న ఉన్న స్టిల్ తో ఈ పోస్టర్ ప్ర‌స్తుతం ట్విట్ట‌ర్ తో పాటు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. క్రెజీ మ్యూజిక్ డైరెక్ట‌ర్ గోపీ సుంద‌ర్ సంగీత ద‌ర్శ‌కత్వం వ‌హిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు త్వ‌ర‌లోనే అధికారికంగా విడుద‌ల అవ్వ‌నున్నాయి.

స‌మ‌ర్ప‌ణ – అల్లు అర‌వింద్, బ్యాన‌‌ర్ – జీఏ2 పిక్చ‌ర్స్, సుకుమార్ రైటింగ్స్, క‌‌థ‌, స్క్రీన్ ప్లే – సుకుమార్, డైరెక్ట‌ర్‌ – ప‌ల్నాటిసూర్య ప్ర‌తాప్, నిర్మాత‌ – బ‌న్నీ వాస్, మ్యూజిక్ డైరెక్ట‌ర్ – గోపీసుంద‌ర్, లైన్ ప్రొడ్యూస‌ర్ – బాబు,కెమెరా – వ‌సంత్, ఎడిట‌ర్ – న‌వీన్ నూలీ, ర‌చ‌న – శ్రీకాంత్ విస్సా, ఎక్స్ క్యూటీవ్ ప్రొడ్యూస‌ర్ – శ‌ర‌ణ్ రాప‌ర్తి, అశోక్ బికో డైరెక్ట‌ర్ – రాధా గోపాల్, పీఆర్ఓ – ఏలూరు శ్రీను, మేఘ‌శ్యామ్

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x