Tuesday, December 31, 2024

ఓ చెలియా మూవీ ఫస్ట్ లుక్ లాంచ్

ఎస్ ఆర్ ఎస్ క్రియేషన్ పతాకం ఫై నాగ ప్రణవ్, కావేరి కర్ణిక, ఆద్య హీరో హీరోయిన్లుగా నాగ రాజశేఖర్ దర్శకత్వంలో రూపా శ్రీ, చంద్రమౌళి సంయుక్తంగా నిర్మించిన చిత్రం ఓ చెలియా. ఈ చిత్ర ఫస్ట్ లుక్ ను జూబ్లీహిల్స్ రోడ్డు నెం 5 లో ఉన్న హైరిస్ స్టూడియో లో నటులు కుడితి శ్రీనివాస్ అండ్ సతీష్ సారిపల్లె  చేతులు మీద ఓపెన్ చేయడం  జరిగింది .

ఈ  సందర్భంగా ప్రొడ్యూసర్ రూప శ్రీ అండ్ చంద్రమౌళి  మాట్లాడుతూ… ఎస్ ఆర్ ఎస్ మూవీ క్రియేషన్స్ బ్యానర్ పైన ఈ మూవీ నీ నిర్మిస్తా ఉన్నాం. ఈ ఓ చెలియా సినిమా కి డైరెక్టర్ నాగ రాజశేఖర్ రెడ్డి చాలా కష్టపడ్డారు . అంతా తానే చూసుకొంటు ఎక్కడ రాజీపడకుండా టైం వేస్ట్ చేయకుండా మంచి టీం నీ సెలెక్ట్ చేసుకొని అనుకొన్న రీతి లో ఔట్పుట్ తీసుకొచ్చారు. హీరో నాగ ప్రణవ్ ఎంతో టాలెంటెడ్ . తను డాక్టర్ గా ఫిలిప్పీన్స్ లో చదువుతూ  మూవీ కోసం  ఎంతో కష్టపడ్డాడు. హీరోయిన్స్ కావేరి కర్ణిక,  ఆధ్య టెక్నీషియన్స్ అందరూ చాలా బాగా వర్క్ చేశారు అన్నారు.  మేము మా ఓ చెలియా నీ మార్చ్ లో రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నo అని, మీడియా మిత్రులందరూ మా ఈ సినిమా కి సపోర్ట్ చేయాలి అని చంద్రమౌళి  గారు అన్నారు.

డైరెక్టర్ నాగ రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ… ప్రొడ్యూసర్ చంద్రమౌళి గారు ఓ చెలియా స్టోరీ లైన్ విని చాలా బాగా ఉంది అని తన ఫ్రెండ్ సహకారం తో ఈ సినిమా నీ నిర్మించారు. ఎక్కడ రాజీపడకుండా మంచి ఔటపుట్ కోసం భాగా సపోర్ట్ చేశారు.  హీరో నాగ ప్రణవ్ తను డాక్టర్ గా చదువుతూ యాక్టింగ్ అంటే ఎంతో ఫ్యాషన్ తో తన మొదటి సినిమా అయినా కొత్త యాక్టర్ లా కాకుండ  ఒక సీనియర్ యాక్టర్ లా సింగిల్ టేక్ లొ డైలాగ్స్ చెప్పడం గానీ,  డ్యాన్స్ లో స్టెప్స్ గానీ ,  ఫైట్స్ గానీ ఈజీ గా సింగిల్ టేక్ లొ చేస్తూ ఫుల్ ఎనర్జీ తొ చాలా భాగా చేశాడు అని డైరెక్టర్ అన్నారు. హీరోయిన్ కావేరి కర్ణిక మర్యాద రామన్న మూవీ తో ఇండస్ట్రీ కి చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంటర్ అయ్యి దూకుడు, రెబెల్ , గ్రీకువీరుడు , సార్ ఇలా 50 సినిమా లు కు పైగా చైల్డ్ ఆర్టిస్ట్ గా పని చేసిన కావేరి మా మూవీ తో హీరోయిన్ గా పరిచయం అవుతున్నారు అని డైరక్టర్ అన్నారు. వెరీ డెడికేటెడ్  గర్ల్ , టైమ్ టు టైమ్ సెట్ లో ఉండటం వర్క్ లో సిన్సియర్ గా ఉంటూ డైలాగ్స్  పేపర్ ఒకసారి చదువుతే చాలు సింగిల్ టేక్ లో కంప్లీట్ చేసి ఎంతో భాగా సపోర్ట్ చేసింది అని డైరెక్టర్ అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ మ్ మ్ కుమార్ చాలా మంచి సాంగ్స్ ఇచ్చారు అన్నారు. ట్యూన్ నచ్చలేదు అంటే ఎక్కడ ఫీల్ అవ్వకుండా నచ్చేంత వరకు చేసి ఇచ్చేవారన్నారు. మ్యూజికల్ గా మా ఓ చెలియా జనాలకు భాగా దగ్గర అవుతుంది అన్నారు.  కెమెరామెన్ సురేష్ బాల (చెన్నై)  ఫ్రేమ్ నీ అందం గా చూపించడం లో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఎంతో ఎనర్జిటిక్ గా వర్క్ చేశారు.

హీరోయిన్ కావేరి కర్ణిక మాట్లాడుతూ… నాకు హీరోయిన్ గా ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్ శేఖర్ సార్ కి నా కృతజ్ఞతలు.  ఈ ఓ చెలియా స్టోరీ లైన్ చాలా భాగా ఉంది. నాకు హీరోయిన్ గా సక్సెస్ ఇస్తాది అని గెట్టి నమ్మకం ఉంది. ఇందులో సాంగ్స్ చాలా చాలా భాగా ఉన్నాయి . ఇందులో నన్ను కెమరామెన్ సార్  చాలా అందంగా చూపించారు. మా హీరో నాగ ప్రణవ్ మొదటి సారి యాక్టింగ్ చేస్తునట్టు అనిపించదు. ఎంతో భాగా చేశారు. నాతో పాటు ఆక్ట్ చేసిన ఆర్టిస్టు లందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.

హీరో నాగ ప్రణవ్ మాట్లాడుతూ… తెలుగు సినిమాకి నా  కి సరైన కథ కోసం ఎదురుచూస్తున్న టైమ్ లో వచ్చింది ఓ చెలియ… చాలా అద్భుతమైన లవ్ స్టోరీనీ డైరెక్టర్ రెడ్డి సార్ చెప్పారు. చాలా మంచి సాంగ్స్ తో తొందరలో మీ ముందుకు వస్తున్నాం, ఆడియెన్స్ ను మా ఓ చెలియా అలరిస్తుంది అని మాకు నమ్మకం ఉంది. . . నాతోపాటు ఆక్ట్ చేసిన ఆర్టిస్టు లందరికీ నా హృదయపూర్వక అభినందనలు. సీనియర్ యాక్టర్ అజయ్ ఘోష్ గారు ఇందులో ఇండస్ట్రీ లో ఇప్పటి వరకు చేయని వెరైటీ  స్పెషల్  రోల్ చేస్తున్నారు. చాలా భాగా సపోర్ట్ చేశారు. కుడితి శ్రీనివాస్ గారు సతీష్ గారు చాలా భాగా సపోర్ట్ చేశారు. మా ఇంకో హీరోయిన్ ఆధ్య ఎంతో భాగా ఆక్ట్ చేసింది . డైలాగ్స్ కి పర్ఫెక్ట్ ఎక్రెషన్స్ ఇస్తూ సింగిల్ టేక్ లొ కంప్లీట్ చేస్తూ భాగా సపోర్ట్ చేసింది అన్నారు.  స్టోరీ గురించి చెప్పుతూ ఓ చెలియా ఇది ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని మార్చ్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నాం అని అన్నారు.

కుడితి శ్రీనివాస్ గారు మాట్లాడుతూ… డైరెక్టర్ నాగ రాజశేఖర్ రెడ్డి నాకు మంచి రోల్ ఇచ్చారు. ఓ చెలియా స్టోరీ లైన్ చాలా భాగా ఉంది అని ఎక్కడ సీన్ విషయం లో కాంప్రమైజ్ అవ్వకుండా ఔట్పుట్ వచ్చేంత వరకు నీట్గా ఎక్సప్లెయిన్ చెసి ఔట్పుట్ రాబట్టుకొనేవాడు అని డైరక్టర్ గురించి చెప్పారు.

సతీష్ గారు మాట్లాడుతూ… నేను ఇప్పటి వరకు ఎన్నో మూవీస్ షార్ట్ ఫిల్మ్స్ చేశాను . గానీ ఎప్పడూ చేయని క్యారక్టర్ ఇందులో చేస్తున్నా . నాకు ఇంత మంచి రోల్ ఇచ్చిన డైరెక్టర్ రెడ్డి గారికి నా కృతజ్ఞతలు అని అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ మాట్లాడుతూ… ట్యూన్ విషయం లో ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా మంచి ట్యూన్స్  నీ నా నుండి రాబట్టుకొన్నారు. నాకు ఈ ఛాన్స్ డైరక్టర్ రెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.

కెమెరామెన్ సురేష్ బాల మాట్లాడుతూ… డైరెక్టర్ నాగ రాజశేఖర్ రెడ్డి గారు నాకు ఈ ఛాన్స్ ఇచ్చి తెలుగు లో కెమెరామెన్ గా పరిచయం చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. చాలా మంచి స్టోరీ లైన్ ఇది. కచ్చితం గా సక్సెస్ అవుతాది నమ్మకం ఉంది అన్నారు.

సునీల్ రావినూతల మాట్లాడుతూ… డైరెక్టర్ రెడ్డి గారు మంచి డిఫరెంట్  కామెడీ రోల్ ఇంచి ఎంకరేజ్ చేస్తున్నందుకు ఆనందంగా ఉంది అన్నారు. ఐశ్వర్య నాయుడు, తన్వి,అమ్మరమేష్ , పెద్దిరాజు, తన్మయ, స్వప్న, దాస్, తదితరులు యాక్ట్ చేశారు.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x