Monday, April 7, 2025

‘కౌసల్య తనయ రాఘవ’ ట్రైలర్ విడుదల

మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీలు వచ్చి చాలా కాలమే అవుతోంది. ప్రస్తుతం వెండితెరపై మాస్, మసాలా, యాక్షన్, కామెడీ చిత్రాలే కనిపిస్తున్నాయి. కానీ స్వచ్చమైన వింటేజ్ విలేజ్ లవ్ ఎమోషనల్ డ్రామాలు కనిపించడం లేదు. ఆ లోటుని భర్తీ చేసేందుకు ‘కౌసల్య తనయ రాఘవ’ చిత్రం రాబోతోంది. రాజేష్ కొంచాడా, శ్రావణి శెట్టి నటీనటులుగా ఏఆర్ మూవీ మేకర్స్ బ్యానర్ పై కుటుంబమంతా కలిసి చూసే మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా అడపా రత్నాకర్ నిర్మిస్తున్న ఈ మూవీకి స్వామి పట్నాయక్ కథ, కథనం, దర్శకత్వం బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నారు.

ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్లు, టీజర్‌, సాంగ్స్ అన్నీ కూడా అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో శనివారం ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఆర్కే నాయుడు, చంటి, నిర్మాత రత్నాకర్ సంయుక్తంగా ఈ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇక ఈ ట్రైలర్‌ను ఓపెన్ చేసిన తీరు.. కథను చెప్పిన తీరు.. పాత్రల్ని పరిచయం చేసిన విధానం బాగుంది.

సీతారాములు, రావణుడు అనే కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారని అర్థం అవుతోంది. ఓ ఊరు.. అందులో హీరో, హీరోయిన్, విలన్ పాత్ర.. అయితే ఈ చిత్రంలో మాత్రం ప్రేమతో పాటుగా మంచి సందేశాన్ని ఇచ్చినట్టుగా అనిపిస్తుంది. చదువు ముఖ్యమని అంతర్లీనంగా సందేశాన్ని ఇచ్చాడు దర్శకుడు. 80వ దశకంలో జరిగిన కథను తెరపై మరింత అందంగా మల్చినట్టు అనిపిస్తుంది.

కౌసల్య తనయ రాఘవ చిత్ర ట్రైలర్‌లో విజువల్స్, మ్యూజిక్ ఎంతో నేచురల్‌గా ఉన్నాయి. యోగి రెడ్డి కెమెరా వర్క్ నాటి కాలానికి తీసుకెళ్లినట్టుగా అనిపిస్తుంది. రాజేష్ రాజ్ తేలు మ్యూజిక్ ఎంతో వినసొంపుగా ఉంది. ఈ ట్రైలర్‌లో మ్యూజిక్, విజువల్స్ అయితే అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి. త్వరలోనే ఈ సినిమాను ఏప్రిల్ 11న రిలీజ్ చేసేందుకు దర్శక, నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

ట్రైలర్ లాంచ్ అనంతరం హీరో రాజేష్ మాట్లాడుతూ… ‘నన్ను నమ్మి నాకు అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. కౌసల్య తనయ రాఘవ చిత్రానికి పని చేసిన ప్రతీ ఒక్కరికీ మంచి పేరు వస్తుంది. ఈ చిత్రం అద్భుతంగా వచ్చింది. ఏప్రిల్ 11న ఈ చిత్రం రాబోతోంది. అందరూ చూసి సపోర్ట్ చేయండి’ అని అన్నారు.

దర్శకుడు స్వామి పట్నాయక్ మాట్లాడుతూ… ‘కౌసల్య తనయ రాఘవ సినిమా అద్భుతంగా వచ్చింది. నాకు సపోర్ట్ చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. నిర్మాత రత్నాకర్ ఈ చిత్రాన్ని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. రాజేష్, శ్రావణి, ఆర్కే నాయుడు ఇలా అందరూ అద్భుతంగా నటించారు. మా చిత్రం ఏప్రిల్ 11న రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.

నిర్మాత రత్నాకర్ మాట్లాడుతూ… ‘కౌసల్య తనయ రాఘవ సినిమాకు సహకరించిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. ఈ చిత్రాన్ని స్వామి పట్నాయక్ అద్భుతంగా తెరకెక్కించారు. రాజేష్, శ్రావణి చక్కగా నటించారు. మా చిత్రం ఏప్రిల్ 11న విడుదల కానుంది. అందరూ చూసి సక్సెస్ చేయండి’ అని అన్నారు.

*నటుడు ఆర్కే నాయుడు మాట్లాడుతూ… ‘ట్రైలర్‌ను అద్భుతంగా కట్ చేశారు. ప్రస్తుతం ట్రైలర్‌ను చూస్తే ఆడియెన్స్ థియేటర్లకు వస్తున్నారు. ఇందులో నేను ఓ ముఖ్యమైన పాత్రను పోషించాను. ఆ కారెక్టర్ అందరికీ నచ్చుతుంది. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్’ అని అన్నారు.

నటి మనీషా మాట్లాడుతూ… ‘కౌసల్య తనయ రాఘవ లాంటి మంచి చిత్రంలో పాత్రను ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. పారిజాతం పాత్ర నాకు ఎంతో స్పెషల్. ఈ చిత్రం అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది. ఏప్రిల్ 11న తప్పకుండా సినిమాని చూడండి’ అని అన్నారు.

లోహిత్ మాట్లాడుతూ… ‘కౌసల్య తనయ రాఘవ సినిమా అద్భుతంగా వచ్చింది. రాజేష్ ఈ చిత్రంలో చక్కగా నటించారు. డైరెక్టర్ స్వామి గారికి చాలా మంచి పేరు రాబోతోంది. నిర్మాత రత్నాకర్ గారు ఇలాంటి మంచి చిత్రాలు మరెన్నో నిర్మించాలి. ఆర్కే నాయుడు గారి పాత్ర అందరినీ ఆకట్టుకుంటుంది. ఏప్రిల్ 11న మా సినిమాను అందరూ థియేటర్లో చూసి ఆదరించండి’ అని అన్నారు.

నటుడు చంటి మాట్లాడుతూ… ‘కౌసల్య తనయ రాఘవ టీంతో నాకు రెండేళ్లుగా పరిచయం ఉంది. ఈ సినిమా కోసం టీం అంతా చాలా కష్టపడింది. సినిమా అద్భుతంగా వచ్చింది. రాజేష్ గొప్పగా నటించాడు. నాయుడు, స్వామి ఇలా అందరూ చక్కగా నటించారు. ఈ సినిమాను థియేటర్లో చూడండి. నేను ఆల్రెడీ చూశాను. మదర్ సెంటిమెంట్‌ను చక్కగా చూపించారు. ఏప్రిల్ 11న సినిమాను అందరూ చూడండి’ అని అన్నారు.

కెమెరామెన్ యోగిరెడ్డి మాట్లాడుతూ… ‘కౌసల్య తనయ రాఘవ లాంటి మంచి చిత్రానికి పని చేయడం ఆనందంగా ఉంది. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్’ అని అన్నారు.

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సంతోష్ మాట్లాడుతూ… ‘కౌసల్య తనయ రాఘవ సినిమాకు డే వన్ నుంచి పని చేస్తూనే ఉన్నాను. ఈ చిత్రంలో ప్రతీ సీన్ అద్భుతంగా ఉంటుంది. డైరెక్టర్ అద్భుతంగా తీశారు. ఇందులో ఏ ఒక్కరూ నటించలేదు. అందరూ తమ తమ పాత్రల్లో జీవించేశారు. కెమెరావర్క్, మ్యూజిక్ చాలా రిచ్‌గా ఉంటుంది’ అని అన్నారు

మ్యూజిక్ డైరెక్టర్ రాజేష్ రాజ్ తేలు మాట్లాడుతూ… ‘కౌసల్య తనయ రాఘవ సినిమా చాలా బాగా వచ్చింది. మేం అవుట్ పుట్ చూశాం. అందరం సంతృప్తిగా ఉన్నాం. మ్యూజిక్ అద్భుతంగా వచ్చింది. ఆర్ఆర్ అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది. నాకు అవకాశం ఇచ్చిన రత్నాకర్ గారికి, స్వామి పట్నాయక్ గారికి థాంక్స్’ అని అన్నారు.

నటీనటులు : రాజేష్ కొంచాడా, శ్రావణి శెట్టి

సాంకేతిక బృందం
ప్రొడ్యూసర్ : అడపా రత్నాకర్
బ్యానర్ :  ఏఆర్ మూవీ మేకర్స్
రిటన్ & డైరెక్టర్ :  స్వామి పట్నాయక్
సంగీతం  : రాజేష్ రాజ్ తేలు
ఎడిటింగ్  : శ్రీ కృష్ణ ప్రసాద్
కెమెరామెన్  : యోగి రెడ్డి
సాహిత్యం  : అర్జిత్ అజయ్
పీఆర్వో  : సాయి సతీష్
0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x