ధర్మ, ఐశ్వర్య శర్మ హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా “డ్రింకర్ సాయి”. బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్ అనేది ఈ చిత్ర ట్యాగ్ లైన్. ఈ చిత్రాన్ని ఎవరెస్ట్ సినిమాస్, స్మార్ట్ స్క్రీన్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరిధర్ నిర్మించారు. కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా దర్శకుడు కిరణ్ తిరుమలశెట్టి ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ నెల 27న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వచ్చిన “డ్రింకర్ సాయి” సినిమా యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ ఆదరణతో విడుదలైన అన్ని చోట్ల విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈరోజు “డ్రింకర్ సాయి” సినిమా సక్సెస్ మీట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో
యాక్టర్ రాజేశ్ వుల్లి మాట్లాడుతూ… మా “డ్రింకర్ సాయి” సినిమాను సక్సెస్ చేసిన ఆడియెన్స్ కు థ్యాంక్స్. నేను నా ఫ్యామిలీతో కలిసి ఈ మూవీ చూసేందుకు థియేటర్ కు వెళ్లాను. మూవీ క్లైమాక్స్ లో మా వైఫ్ ఎమోషనల్ గా ఫీలై ఏడవటం చూశాను. మా మూవీ యూత్ తో పాటు మహిళలకు బాగా నచ్చుతోంది. మా మూవీని మరింతగా ఆదరిస్తారని కోరుకుంటున్నా. అన్నారు.
డీవోపీ ప్రశాంత్ అంకిరెడ్డి మాట్లాడుతూ… “డ్రింకర్ సాయి” సినిమాకు వస్తున్న టాక్ చూస్తుంటే హ్యాపీగా ఉంది. డీవోపీగా నాకు “డ్రింకర్ సాయి” సినిమా మంచి పేరు తీసుకొచ్చింది. మా నాన్న ఫోన్ చేసి మూవీ చాలా బాగుంది, గర్వంగా ఉంది అని చెప్పారు. మహిళలు మా మూవీకి బాగా కనెక్ట్ అవుతున్నారు. ఇలాంటి మంచి చిత్రాలకు మీరు ఇంకాస్త ఆదరణ ఇస్తే మరిన్ని చిన్న చిత్రాలు రూపొందే అవకాశం ఉంటుంది. మరో 40, 50 మంది కొత్త వాళ్లకు అవకాశాలు వస్తాయి. మూవీ చూడనివారు థియేటర్స్ కు వెళ్లి “డ్రింకర్ సాయి” సినిమా చూడాలని కోరుతున్నా. అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ శ్రీవసంత్ మాట్లాడుతూ… “డ్రింకర్ సాయి” సినిమాకు మేము ఆశించినట్లే మంచి రెస్పాన్స్ వస్తోంది. నా ఫ్రెండ్, డైరెక్టర్ కిరణ్ కు కంగ్రాట్స్, అలాగే టీమ్ అందరికీ నా విశెస్ చెబుతున్నా. ఈ సినిమాను ఎంతవరకు ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లాలో అంత వరకు మా ప్రొడ్యూసర్స్ ప్రయత్నం చేశారు. డే 1 మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. సినిమా చూసిన ఆడియెన్స్ వాళ్లంతట వాళ్లే వచ్చి మేము మా రెస్పాన్స్ చెబుతాం అని ముందుకొస్తున్నారు. కథ విన్నప్పుడే ఈ సాంగ్స్ ఇలా ఉండాలని డిజైన్ చేసుకున్నాం. చంద్రబోస్ గారు ఇచ్చిన లిరిక్స్ అద్భుతంగా కుదిరాయి. మీరు ఫ్యామిలీతో కలిసి “డ్రింకర్ సాయి” సినిమా చూడాలని రిక్వెస్ట్ చేస్తున్నా. అన్నారు.
ప్రొడ్యూసర్ బసవరాజు శ్రీనివాస్ మాట్లాడుతూ… నేను ఈ మూవీకి ప్రొడ్యూసర్ అయినా ఫస్ట్ టైమ్ మీడియా ముందుకు వస్తున్నాను. భారత సేవా సహకార ఫోరమ్ అనే సంస్థ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నా. లాక్ డౌన్ లో నేను చేసిన సేవలకు మాస్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా అనే అవార్డ్ వచ్చింది. పద్మశ్రీ పురస్కారానికి ఫైనల్ లిస్ట్ దాకా నా పేరు వెళ్లింది. ఇలాంటి నేపథ్యమున్న నేను డ్రింకర్ సాయి టైటిల్ తో సినిమా చేసినప్పుడు కొందరు మిత్రులు సందేహాలు వెలిబుచ్చారు. కానీ ఈ సినిమా ద్వారా ఒక మంచి సందేశాన్ని ఇస్తున్నామని వారికి చెప్పాను. మంత్రి శ్రీధర్ బాబు గారు మా మూవీ పోస్టర్ లాంఛ్ చేశారు. డ్రింకర్ సాయి సినిమాకు మంచి వసూళ్లు వస్తున్నాయి. మేము పెట్టిన పెట్టుబడి సేఫ్ అయ్యింది. లాభాలు కూడా వస్తాయి. అయితే వీటన్నింటికంటే ఒక మంచి సందేశాత్మక సినిమా చేశామనే సంతృప్తి ఉంది. డైరెక్టర్ కిరణ్ ను సెట్ లో చూశాను. ఎంతో డెడికేటెడ్ గా, ప్రతిభావంతంగా పనిచేశాడు. అలాగే హీరో ధర్మ ప్రతి పనిలో తాను ఇన్వాల్వ్ అయి చేశాడు. హీరోయిన్ ఐశ్వర్యను మా సొంత అమ్మాయిలా చూసుకున్నాం. మా అబ్బాయి లహరిధర్ ప్రొడక్షన్ పనులన్నీ చూసుకున్నాడు. అలాగే ఇస్మాయిల్ ప్రొడక్షన్ లో భాగమయ్యారు. మా టెక్నీషియన్స్ అంతా ప్యాషనేట్ గా వర్క్ చేశారు. మా “డ్రింకర్ సాయి” సినిమాకు విజయాన్ని అందించిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. అన్నారు.
ప్రొడ్యూసర్ బసవరాజు లహరిధర్ మాట్లాడుతూ… “డ్రింకర్ సాయి” సినిమాకు వస్తున్న రెస్పాన్స్ పట్ల మా టీమ్ అంతా సంతోషంగా ఉన్నాం. మా డైరెక్టర్, హీరో, ఇతర టీమ్ పడిన కష్టానికి ఫలితం దక్కింది. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ సినిమాను చూసి బాగుందని అంటున్నారు. మా మూవీకి మీ సపోర్ట్ ఇలాగే కొనసాగాలి. అన్నారు.
ప్రొడ్యూసర్ ఇస్మాయిల్ షేక్ మాట్లాడుతూ… “డ్రింకర్ సాయి” సినిమాలో మీరు అనుకుంటున్నట్లు అడల్ట్ కంటెంట్ ఉండదు, ఇబ్బందిపెట్టే సన్నివేశాలు, మాటలు లేవు అని మేము మొదటి నుంచే చెబుతున్నాం. ఇవాళ సినిమా చూస్తున్న వాళ్లంతా అదే ఫీల్ అవుతున్నారు. అసలు ఈ చిత్రంలో ఏ సర్టిఫికెట్ ఇచ్చేంత ఏముంది అంటున్నారు. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ సినిమాను ఆదరిస్తుండటం సంతోషంగా ఉంది. అన్నారు.
డిస్ట్రిబ్యూటర్ సత్యనారాయణ మాట్లాడుతూ… “డ్రింకర్ సాయి” సినిమాను డిస్ట్రిబ్యూట్ చేయడం సంతోషంగా ఉంది. ప్రతి థియేటర్ లో కలెక్షన్స్ బాగున్నాయి. సుదర్శన్ థియేటర్ లో ఈరోజు కూడా 50 వేల కలెక్షన్ వచ్చింది. చిన్న సినిమాలకు సెకండ్ డే కలెక్షన్స్ ఎక్కువగా ఉండవు. అలాంటిది “డ్రింకర్ సాయి” మాత్రం మంచి వసూళ్లు దక్కించుకుంటున్నాడు. అన్నారు.
హీరోయిన్ ఐశ్వర్య శర్మ మాట్లాడుతూ… “డ్రింకర్ సాయి” సినిమాకు మీరు ఇస్తున్న సపోర్ట్ కు థ్యాంక్స్. థియేటర్స్ లోకి వెళ్లి ప్రేక్షకులతో కలిసి సినిమా చూశాను. వాళ్లు ఫన్, ఎమోషన్..ఇలా ప్రతి సందర్భంలోనూ బాగా రెస్పాండ్ అవుతున్నారు. ఆడియెన్స్ అందరికీ కావాల్సిన ఎలిమెంట్స్ మా మూవీలో ఉన్నాయి. ఇంకా మూవీ చూడని వారుంటే వెంటనే వెళ్లి చూడాలని కోరుతున్నా. అన్నారు.
డైరెక్టర్ కిరణ్ తిరుమలశెట్టి మాట్లాడుతూ… “డ్రింకర్ సాయి”ని సక్సెస్ చేసిన తెలుగు ప్రేక్షకులకు నా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెబుతున్నా. ముందుగా మా సినిమా కోసం ఏది అడిగితే అది ఇచ్చి సపోర్ట్ చేసిన ప్రొడ్యూసర్స్ శ్రీనివాస్ గారు, లహరిధర్, ఇస్మాయిల్ గారికి థ్యాంక్స్. అలాగే నా సోదరుడిలా నాతో పాటు పనిచేసిన హీరో ధర్మకు థ్యాంక్స్. నా ఫ్రెండ్ మ్యూజిక్ డైరెక్టర్ శ్రీవసంత్, అలాగే నా సోదరుడు డీవోపీ ప్రశాంత్..ఇలా వీళ్లంతా నా సొంత మనుషులు. ఇలాంటి టీమ్ దొరకడం అదృష్టంగా భావిస్తున్నా. ఇకపైనా వీళ్లతోనే నా జర్నీ కొనసాగుతుంది. మనం జీవితంలో చేసే తప్పులు కొన్ని ఆలస్యంగా తెలుసుకుంటాం. అప్పుడు తెలుసుకుని ప్రయోజనం ఉండదు. మా మూవీలో హీరో ధర్మ అలాగే ఒక తప్పు చేస్తాడు. అది తెలుసుకునేలోగా నష్టం జరుగుతుంది. అలా మీలో ఎవరి లైఫ్ లో జరగొద్దు అనే మంచి సందేశాన్నిస్తూ ఈ మూవీ చేశాను. ఈ వీకెండ్ మీరు థియేటర్స్ కు వెళ్లాలనుకుంటే పుష్ప 2 తప్ప మరో సినిమా లేదు. ఒకసారి మా మూవీ చూడండి. నచ్చితే పదిమందికి చెప్పండి. ఫ్యామిలీతో వెళ్లండి తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. సుదర్శన్ థియేటర్ లో మా సినిమా సెకండ్ డే కూడా మంచి కలెక్షన్స్ ఉన్నాయి. ఆడియెన్స్ నుంచే రివ్యూస్ తీసుకోబోతున్నాం. ఈ కాంటెస్ట్ ద్వారా సెలెక్ట్ అయిన వారికి డ్రింకర్ సాయి 31న మంచి పార్టీ ఇస్తాడు. అలాగే ఆడియెన్స్ దగ్గరకు మా మూవీ గురించి చెప్పుకునేందుకు థియేటర్స్ విజిట్ కు వెళ్తున్నాం. “డ్రింకర్ సాయి” మూవీని ప్రతి ఆడియెన్ కు చేర్చాలనేదే మా ప్రయత్నం. అన్నారు.
హీరో ధర్మ మాట్లాడుతూ… “డ్రింకర్ సాయి” సినిమాకు సక్సెస్ ఇచ్చిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. సాయిదుర్గ తేజ్ అన్న మా మూవీ గురించి ట్వీట్ చేశాడు. ఆయనకు చాలా థ్యాంక్స్ చెబుతున్నా. ఒకసారి సాయి దుర్గ తేజ్ అన్నని కలుస్తాను. అలాగే నాకు ఈ మూవీలో హీరోగా చేసే అవకాశం ఇచ్చిన మా ముగ్గురు ప్రొడ్యూసర్స్ కు థ్యాంక్స్. వాళ్లను లైఫ్ లో మర్చిపోను. మా డీవోపీ ప్రశాంత్, మ్యూజిక్ డైరెక్టర్ శ్రీవసంత్ గురించి సినిమా చూసిన వాళ్లు ఎక్కువగా చెబుతున్నారు. హీరోయిన్ ఐశ్వర్య పర్ ఫార్మెన్స్ తో ఆకట్టుకుంది. ఈ సినిమాతో నేను యూత్ ను చెడగొట్టలేదు అనే పేరొచ్చింది చాలు. ఒక మంచి మెసేజ్ తో మూవీ చేశాం. మహిళలకు, ఫ్యామిలీస్ కు మూవీ నచ్చడం సంతోషంగా ఉంది. కొందరు ఫస్టాఫ్ బాగుందని, మరికొందరు సెకండాఫ్ బాగుందని అంటున్నారు. ఏరియా వైజ్ గా రెస్పాన్స్ చూస్తే అందరి దగ్గర నుంచీ మూవీ బాగుందనే టాక్ వస్తోంది. మా డిస్ట్రిబ్యూటర్స్ హ్యాపీగా ఉన్నారంటే అంతకంటే సంతోషం లేదు. మా టీమ్ అంతా బాగా పర్ ఫార్మ్ చేసిందంటే అందుకు మా డైరెక్టర్ కిరణ్ గారే కారణం. మా మూవీని ఆదరిస్తున్న మహిళా ప్రేక్షకుల కోసం టికెట్స్ ను ఉచితంగా ఇవ్వబోతున్నా. అన్నారు.
నటీనటులు – ధర్మ, ఐశ్వర్య శర్మ, పోసాని కృష్ణమురళి, శ్రీకాంత్ అయ్యంగార్, సమీర్, ఎస్ఎస్ కాంచి, భద్రం, కిర్రాక్ సీత, రీతు చౌదరి, ఫన్ బకెట్ రాజేశ్, రాజ ప్రజ్వల్, తదితరులు