Wednesday, January 22, 2025

రానా దగ్గుబాటి రిలీజ్ చేసిన త్రిశంకు చిత్రంలోని ‘ఏడు రంగుల..’ సాంగ్

స్టార్ హీరోయిన్ ర‌కుల్ ప్రీత్‌సింగ్ సోద‌రుడు అమన్ ప్రీత్ సింగ్ హీరోగా న‌టిస్తోన్న చిత్రం ‘త్రిశంకు’.
ప్రాచి తెహ్లాన్, రష్మీ గౌతమ్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో సుమ‌న్‌, మహేష్ ఆచంట, నవీన రెడ్డి కీల‌క‌పాత్ర‌లు పోషిస్తున్నారు. శ్రీ కృష్ణ గొర్లె దర్శకత్వంలో గణేశ్ క్రియేష‌న్స్‌, ఎ.యు అండ్ ఐ స్టూడియోస్ బ్యానర్లపై లండన్ గణేష్ మరియు నల్ల అయ్యన్న నాయుడు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటీవ‌ల‌ మూవీ నుండి ఫ‌స్ట్ లిరికల్ సాంగ్ ‘ఏడు రంగుల ఓ ఇంద్ర‌ధ‌నస్సులా’ ను టాలీవుడ్ స్టార్ హీరో రానా దగ్గుబాటి రిలీజ్ చేసి చిత్ర యూనిట్‌కి విషెస్ తెలిపారు. రాహుల్ సిప్లిగంజ్ ఆలపించిన ఈ పాటకి సునీల్ క‌శ్య‌ప్ స్వ‌రాలు స‌మ‌కూర్చారు. భాష్యశ్రీ సాహిత్యం అందించారు.

ఈ సందర్భంగా దర్శకుడు శ్రీ కృష్ణ గొర్లె మాట్లాడుతూ.. నాకు ఈ సినిమా అవకాశం ఇచ్చిన నిర్మాతలకు కృతజ్ఞతలు. ఈ సినిమా ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ప్రతి పాత్ర ఎంతో చక్కగా రూపుదిద్దుకుంది. అడగ్గానే ఈ చిత్రంలోని పాటను విడుదల చేయటానికి ఒప్పుకున్న హీరో దగ్గుబాటి రానా గారికి ధన్యవాదాలు అని అన్నారు.

నిర్మాతలు లండన్ గణేష్ మరియు నల్ల అయ్యన్న మాట్లాడుతూ.. దర్శకుడు శ్రీ కృష్ణ చెప్పిన పాయింట్ ఎంతో బాగా నచ్చింది. ఈ సినిమాలో మంచి మంచి ఎలిమెంట్స్ ఉన్నాయి. చిత్రం ఎంతో బాగా వచ్చింది. మా చిత్రంలోని తొలి పాటను విడుదల చేసిన రానా గారికి కృతజ్ఞతలు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అన్ని వివరాలను వెల్లడిస్తాం అన్నారు.

నటీనటులు : అమన్ ప్రీత్ సింగ్, ప్రాచి తెహ్లాన్ , రష్మీ గౌతమ్, సుమన్, మహేష్ ఆచంట, నవీన రెడ్డి తదితరులు

సాంకేతిక నిపుణులు :
ద‌ర్శ‌క‌త్వం: శ్రీ కృష్ణ గొర్లె
నిర్మాత‌లు: లండన్ గణేష్ మరియు నల్ల అయ్యన్న నాయుడు
బ్యానర్: గణేశ్ క్రియేష‌న్స్‌, ఎ.యు అండ్ ఐ స్టూడియోస్
సంగీతం: సునీల్ క‌శ్య‌ప్
కో ప్రొడ్యూసర్: హరి అయినీడి

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x