ఆయనో సీఎం. ఓ కుంభకోణంలో చిక్కుకుని నిందితుడిగా కోర్టుమెట్లెక్కాడు. ఆ తరువాత దోషిగా తేలడంతో కటకటాల పాలయ్యాడు. సీఎం పదవి కోల్పోయాడు. 10ఏళ్ల పాటు జైలు జీవితం గడిపి ఈ రోజే(శుక్రవారం) విడుదలయ్యారు. ఆయనే హర్యానా మాజీ ముఖ్యమంత్రి, ఇండియన్ నేషనల్ లోక్ దళ్ అధ్యక్షుడు ఓం ప్రకాశ్ చౌతా.
2013లో బయటపడిన టీచర్ రిక్రూట్‌మెంట్ కుంభకోణంలో పదేళ్ల పాటు జైలుశిక్ష అనుభవించిన ఆయన నేడు తీహార్ జైలు నుంచి విడుదలయ్యాడు. ఇందుకు సంబంధించిన లాంఛనాలు అన్నీ పూర్తి కావడంతో ఆయనను విడుదల చేసినట్లు తీహార్ జైలు అధికారులు తెలిపారు. 86 ఏళ్ల చౌతాలా ఇప్పటికే పెరోల్‌పై బయట ఉన్నారు. శుక్రవారం ఆయన జైలుకు వచ్చి లాంఛనాలు పూర్తి చేయడంతో విడుదలకు మార్గం సుగగమైంది.
పదేళ్ల శిక్షలో తొమ్మిదిన్నరేళ్ల శిక్ష అనుభవించిన ఆయన.. గతేడాది నుంచి విజృంభించిన కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు గత నెలలో ఆయనకు 6 నెలల జైలుశిక్షను తగ్గించింది. దీంతో గతేడాది మార్చి 23 నుంచి ఆయన ఎమర్జెన్సీ పెరోల్‌లో ఉన్నారు.
ఇక ఇప్పటికే చౌతాలా ఇప్పటికే తొమ్మిదేళ్ల తొమ్మిది నెలల జైలు అనుభవించినందున ఆయన జైలు శిక్ష పూర్తయినట్లు అధికారులు నిర్ధారించి విడుదల చేశారు. 2021 ఫిబ్రవరిలో ఆయన సరెండర్ కావాల్సి ఉండగా, ఆయన పెరోల్‌ను హైకోర్టు 6 నెలలు పొడిగించింది. ఫిబ్రవరి 21 నాటికి రెండు నెలల 26 రోజుల పాటు మిగిలి ఉన్న జైలుశిక్షను కోర్టు తగ్గించింది.