Friday, November 1, 2024

డెల్టా వేరియంట్‌కు ఆ కంపెనీ టీకాతో చెక్..!

ప్రపంచం మొత్తాన్నీ ప్రస్తుతం తీవ్ర ఆందోళనలకు గురిచేస్తున్న డెల్టా వేరియంట్‌ను కట్టడి చేసే వ్యాక్సిన్ ఏదో తెలిసిపోయింది. అన్ని వ్యాక్సిన్లు ఈ వైరియంట్‌పై ప్రభావం చూపినా ఆ వ్యాక్సిన్ మాత్రం వీటన్నింటికంటే అద్బుతమైన ప్రభావం చూపుతుందని తాజా అధ్యయనాల్లో వెల్లడైంది. అదే జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్. ఈ వ్యాక్సిన్ కరోనా వ్యాక్సిన్ ఒక్క డోసు సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు కొందరు నిపుణులు తాజాగా చెబుతున్నారు.

అమెరికాలోని ఓ లాబోరేటరీలో జరిపిన అధ్యయనంలో ఈ ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. జాన్సన్ అండ్ జాన్సన్ టీకా సింగల్‌ డోసు.. డెల్టా వేరియంట్‌ను పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేస్తోందని వారు గుర్తించారు. ఈ వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా రోగనిరోధక శక్తి కూడా మెరుగు పడుతుందని, వ్యాక్సిన్ ప్రభావం దాదాపు 8 నెలల పాటు ఉంటుందని, ఆ తర్వాత మ‌రోసారి సింగిల్ బూస్ట‌ర్ డోస్ తీసుకుంటే సరిపోతుందని వారు చెబుతున్నారు.

సదరు శాస్త్ర వేత్తలు విడుదల చేసిన రిపోర్టు ప్రకారం.. ‘SARS-CoV-2 వేరియంట్లపై జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ సమర్థవంతంగా పనిచేస్తుంది. యాంటీ బాడీలు త్వరగా ఉత్పత్తి చేసి డెల్టా వేరియంట్‌ను నిర్వీర్యం చేస్తుంది. జాన్సన్ అండ్ జాన్సన్ టీకా దక్షిణాఫ్రికాలో గుర్తించిన బీటా(B.1.351) వేరియంట్‌ కంటే డెల్టా వేరియంట్‌పై మరింత ప్రభావం చూపుతోంది. ఈ టీకా తీసుకున్న 85 శాతం మందిలో వైరస్‌ ప్రాణాంతకంగా మారకుండా అడ్డుకుంది.

ఇక దీనిపై జాన్సన్ అండ్ జాన్సన్ ఎండీ పాల్ స్టాఫెల్స్ మాట్లాడుతూ.. తమ వ్యాక్సిన్ ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలలో మెరుగైన ఫలితాలు రాబట్టిందని తెలిపారు. క్లినికల్ డేటా సమాచారం మేరకే సింగిల్ డోస్ వ్యాక్సిన్‌ ప్రభావంపై ఓ అంచనాకు వచ్చామని, ఈ వ్యాక్సిన్ 8 నెలలపాటు కచ్చితంగా రక్షణ కల్పిస్తుందని శాస్త్రీయమైన ఆధారాలున్నాయని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా తమ వ్యాక్సిన్ ఒక్క డెల్టా వేరియంట్ మాత్రమే కాకుండా.. మిగిలిన అన్ని కోవిడ్ వేరియంట్లపైన కూడా సమర్థవంతంగా ప్రభావం చూపుతుందని చెప్పారు.

ఇదిలా ఉంటే తమ సింగిల్ డోసు వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగానికి అమెరికాలో ఫిబ్రవరి 27న ఆమోదం లభించిందని, మార్చి 11న యూరోపియన్ కమిషన్ కండీషనల్ మార్కెటింగ్‌కు అనుమతి పొందిందని తెలిపారు. అయితే ఈ వ్యాక్సిన్‌ వినియోగానికి భారత ప్రభుత్వం నుంచి అనుమతి పొందాల్సి ఉందని స్టాఫెల్స్ వెల్లడించారు.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x