18ఏళ్ల నిండిన ప్రతి ఒక్కరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. ఈ నెల 21వ తేదీ నుంచి రాష్ట్రాలకు వ్యాక్సిన్ సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. కేంద్రం పరిధిలోనే వ్యాక్సినేషన్ కార్యక్రమం ఇక పూర్తిగా జరగుతుందని చెప్పారు. అంతేకాదు.. ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా ప్రైవేట్ ఆసుపత్రలకు 25 శాతం డోసులు ఇస్తామని ప్రధాని ప్రకటించారు.
అలాగే వ్యాక్సినేషన్ బాధ్యత ఇక పూర్తిగా కేంద్రమే తీసుకుంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. రాష్టాలు వ్యాక్సిన్‌పై ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదని, కేంద్రమే వ్యాక్సిన్లు కొని రాష్ట్రాలకు అందజేస్తుందని ప్రధాని స్పష్టం చేశారు.
అనంతరం వ్యాక్సిన్ తయారీ కోసం జాతీయ స్థాయిలో శాస్త్రవేత్తలు ఎంతగానో కష్టపడ్డారని, తక్కువ సమయంలోనే మన శాస్త్రవేత్తలు సఫలమయ్యారని మోదీ ప్రశంసించారు. వ్యాక్సిన్ తయారు చేసే సంస్థలకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని, మౌలిక సదుపాయాలతోపాటు భారీగా నిధులు కూడా కేటాయిస్తామని ప్రధాని చెప్పారు. అలాగే.. ప్రస్తుతం 23 కోట్ల మందికి ఇప్పటివరకు వ్యాక్సినేషన్ వేశామని, దీనికోసం వ్యాక్సిన్ టాస్క్‌ఫోర్స్‌ను కూడా ఏర్పాటు చేశామని ప్రధాని మోదీ పేర్కొన్నారు.