అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని భారత దేశం వ్యాక్సినేషన్ విషయంలో సరికొత్త రికార్డును నెలకొల్పింది. సోమవారం ఒక్కరోజే ఏకంగా 70 లక్షల మంది ప్రజలు వ్యాక్సినేషన్ వేసుకున్నారు. ఇంత పెద్ద సంఖ్యలో వ్యాక్సినేషన్ కోసం ప్రజలు ముందుకు రావడం దేశంలోనే ఓ అరుదైన ఘట్టం. ఈ క్రమంలోనే జాతికి ప్రధాని నరేంద్ర మోదీ ధన్యవాదాలు చెప్పారు. ఈ మేరకు ప్రధాని ట్విట్టర్ వేదికగా దేశ ప్రజలకు థాంక్స్ అంటూ ట్వీట్ చేశారు.
వ్యాక్సినేషన్ విషయంలో రికార్డు సాధించడం ఎంతో ఆనందంగా ఉందని, నిజంగా ఇది గర్వించ తగిన అంశమని ప్రధాని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు.
‘‘వ్యాక్సినేషన్ ఇంత పెద్ద మొత్తంలో జరగడం ఆనందదాయకం. కోవిడ్‌కు వ్యతిరేకంగా ఉన్న ఏకైక ఆయుధం వ్యాక్సిన్. చాలా మంది పౌరులకు వ్యాక్సిన్ సక్రమంగా అందేలా కృషి చేస్తున్న ఫ్రంట్‌లైన్ యోధులకు, టీకాలు వేసుకున్న వారికి ధన్యవాదాలు. వెల్‌డన్ ఇండియా’’ అంటూ ప్రధాని మోదీ దేశ ప్రజలపై ప్రశంసలు కురిపించారు.