Saturday, March 21, 2026

గర్ల్ ఫ్రెండ్ ను రహస్యంగా పెళ్లాడిన ఆర్సీబీ బౌలర్..

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బౌలర్ తన ప్రేయసిని పెళ్లి చేసుకున్నాడు. అది కూడా రహస్యంగా. అవును.. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆస్ట్రేలియా స్పిన్ బౌలర్ ఆడం జంపా ఎట్టకేలకు ఓ పెళ్లి పీటలెక్కాడు. తన ఇస్తా సఖినే పెళ్లి చేసుకున్నాడు. అయితే అతడి వివాహం గురువారమే జరిగినా.. ఆ వివాహాన్ని జంపా రహస్యంగా ఉంచాడు.

కరోనా మహమ్మారి కారణంగా జంపా వివాహం ఇప్పటికి రెండుసార్లు వాయిదా పడింది. గతేడాది ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు లాక్‌డౌన్‌లో చిక్కుకోవడంతో జంపా సహా పలువురి వివాహాలు వాయిదా పడ్డాయి. ఆ తర్వాత వారిలో చాలామంది ఏదో రకంగా వివాహాలు చేసుకుని జంటలుగా మారారు. వైరస్ ఇంకా భయపెడుతుండడంతో కొందరు క్రికెటర్లు మాత్రం ఇంకా శుభ ఘడియల కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఎట్టకేలకు గత వారం జంపా కూడా ఎంతోకాలంగా ప్రేమిస్తున్న హట్టీ లీ పాల్మెర్‌ను తన జీవిత భాగస్వామిని చేసుకున్నాడు.

ఆడం జంపా గతవారమే వివాహం చేసుకున్నప్పటికీ ఆ విషయాన్ని ఇప్పటి వరకు రహస్యంగా ఉంచాడు. ఇప్పటికి కూడా జంపా ఆ విషయాన్ని బయట పెట్టలేదు. అయితే జంపా గర్ల్ ఫ్రెండ్ హట్టీ లీ వివాహ దుస్తులను డిజైన్ చేసిన కేట్ వాలియా అనే కంపెనీ.. వివాహ దుస్తుల్లో ఉన్క్ జంపా-హట్టీ లీ వివాహ ఫొటోను సోషల్ మీడియాలో పోస్టు చేసింది. దీంతో జంపా రహస్య వివాహం బయటకెపిచ్చింది.

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -