Monday, March 23, 2026

నడుమూపి మైమరపించిన క్రికెటర్ గర్ల్ ఫ్రెండ్.. వీడియో వైరల్

క్రికెటర్లంటే మన దేశంలో ఎంత క్రేజ్ ఉంటుందో వేరే చెప్పనక్కర్లేదు. వారు ఏం చేసినా అభిమానులు తెగ పొగిడేస్తూ ఉంటారు. ఇక ఈ మధ్య కాలంలో క్రికెటర్ల గర్ల్ ఫ్రెండ్స్‌కు కూడా అదే స్థాయిలో క్రేజ్ లభిస్తోంది. దీంతో కొందరు క్రికెటర్లు గర్ల్ ఫ్రెండ్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నారు. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్‌ యువ ఆటగాడు పృథ్వీ షా గర్ల్ ఫ్రెండ్ ప్రాచి సింగ్‌ సోషల్ మీడియాలో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.

పృధ్వీ షా – ప్రాచీతో లవ్ ట్రాక్ నడుపుతున్నాడని చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. కొంతకాలంగా పృథ్వీ, ప్రాచిలు పీకల్లోతూ ప్రేమలో మునిగితేలుతున్నారని సోషల్ మీడియా కోడై కూస్తోంది. దీనికి సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా ఆన్‌లైన్‌లో ప్రత్యక్షం కావడంతో వీరిద్దరి లవ్ నిజమేనని అంతా అనుకుంటున్నారు. కానీ దీనిపై ఇప్పటివరకు వీరిద్దరి నుంచి ఎలాంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు. అయితే తాజాగా ప్రాచి తన సోషల్ మీడియాలో ఓ వీడియో అప్‌లోడ్ చేసింది. అందులో నాజూకైన తన నడుపుము తిప్పుతూ.. బెల్లీ డ్యాన్స్‌తో అదరగొట్టింది. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.

ఈ వీడియోతో పాటు ‘కరోనా విజృంభిస్తున్నవేళ మీకు ఉపశమనం కలిగించడానికి బెల్లీ డ్యాన్స్ ట్రై చేశా. చూసి ఎలా ఉందో చెప్పండి’ అంటూ క్యాప్షన్‌ జత చేసింది. ఈ వీడియోనూ ప్రాచి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేయడంతో ఆమె అభిమానులు, పృధ్వీ షా అభిమానులు విపరీతంగా కామెంట్లు చేస్తూ ఆమె డ్యాన్స్‌ను ప్రశంసిస్తున్నారు.

ఇదిలా ఉంటే గతేడాది జరిగిన ఆసీస్ సిరీస్‌తో టీమిండియాలోకి అడుగుపెట్టాడు. కానీ రాణించకపోవడంతో స్థానం కోల్పోయాడు. అయితే ఆ తర్వాత జరిగిన విజయ్ హజారే ట్రోఫీలో రికార్డుల మోత మోగించాడు. ఈ క్రమంలోనే ఐపీఎల్ 14వ సీజన్లో కూడా అదరగొడుతున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్‌ తరపున ఆడుతున్న పృధ్వీ షా మొత్తం 8 మ్యాచ్‌ల్లో ఆడి 308 పరుగులు చేశాడు. ఈ సీజన్లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్ల జాబితాలో 4ద స్థానంలో ఉన్నాడు. ముఖ్యంగా కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో పృథ్వీ షా కేవలం 41 బంతుల్లోనే 82 పరుగులు జట్టుకు విజయాన్ని అందించాడు.

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -