కొన్ని సార్లు చేసే చిన్న తప్పుల వల్ల పెద్ద మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. అలాగే అందరి దృష్టిలో విలన్‌లా నిలబడాల్సి వస్తుంది. తాజాగా ఐపీఎల్ 14వ సీజన్లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఆటగాడు వరుణ్ చక్రవర్తి పరిస్థితి ప్రస్తుతం అలాగే ఉంది. టోర్నీ వాయిదా పడడానికి అతడే కారణమని బీసీసీఐ అధికారికంగా ప్రకటించకపోయినా.. అతడు చేసిన ఓ చిన్న తప్పు వల్లే బయోబబుల్ లోకి కరోనా ప్రవేశించిందనే ఓ వార్త ఇప్పుడు తెగ చక్కర్లు కొడుతోంది. దీంతో ఐపీఎల్ అభిమానులంతా వరుణ్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘నీవల్లే ఐపీఎల్ ఆగిపోయింది. నువ్వే దీనికంతటికీ కారణం’ అంటూ నిందిస్తున్నారు.
When you realise bcoz of you #IPL is getting suspended#VarunChakravarthy pic.twitter.com/79dcQqqVzg
— Gaurav Vyas (@thegauravvyas) May 4, 2021
కొన్ని ఫ్రాంచైజీల ఆటగాళ్లకి కరోనా వైరస్ సోకడంతో ఐపీఎల్ 2021ను బీసీసీఐ వాయిదా వేసిన సంగతి తెలిసిందే. పక్కాగా జాగ్రత్తలు తీసుకుని, ఆటగాళ్లను బయోబబుల్‌లో ఉంచినప్పటికీ ఆటగాళ్లు కరోనా బారిన పడడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఎక్కడో ఏదో చిన్న నిర్లక్ష్యం కారణంగా భారీ మూల్యాన్నే బోర్డు చెల్లించాల్సి వచ్చిందని ఇటీవల బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ కూడా చెప్పుకొచ్చారు.
#iplcancel #iplpostponed #COVIDSecondWaveInIndia #COVIDEmergencyIndia #VarunChakravarthy pic.twitter.com/Rh3ZzamrmT
— Gotu Manthan Dave (@GotuDave) May 4, 2021
అయితే బయోబుల్‌లో ఉన్న ఆటగాళ్లలో మొదట కోల్‌కతా నైటరైడర్స్ ప్లేయర్లు వరుణ్ చక్రవర్తికి, అతడి నుంచి సందీప్ వారియర్‌కు, అతడి ద్వారా అమిత్ మిశ్రాకు వైరస్ సోకినట్లు సమాచారం. ఈ క్రమంలోనే నెటిజన్లు ట్విటర్ వేదికగా వరుణ్ తీవ్రంగా విమర్శిస్తున్నారు. అక్కడితో ఆగకుండా అతడిపై సెటైరికల్ మీమ్స్, కామెంట్స్ పెడుతున్నారు.‘గేమ్ చేంజర్ ఆఫ్ ది సీజన్ వరుణ్ చక్రవర్తి’ అని ఓ యూజర్ ట్విట్ చేస్తే.. ‘డ్రీమ్ 11 సీజన్ క్యాన్స్‌లర్ అవార్డు నీకే’ అంటూ మరో యూజర్ వ్యంగ్యాంస్త్రాలు విసిరాడు. ఇంకొంతమంది వరుణ్ ఫొటోను ఎడిట్ చేసి మరీ మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. దీంతో తెలిసో తెలియకో, అసలు చేశాడో, లేదో కూడా తెలియని తప్పుకు వరున్ నెటిజన్ల చేతిలో బుక్కయిపోయాడని మరికొంతమంది సానుభూతి చూపిస్తున్నారు.