Sunday, March 22, 2026

వ్యాక్సిన్ వేయించుకున్న ధవన్..

కొన్ని ఫ్రాంచైజీల ఆటగాళ్లకి కరోనా వైరస్‌ సోకడంతో ఐపీఎల్‌ 2021ను బీసీసీఐ వాయిదా వేసిన సంగతి తెలిసిందే. పక్కాగా జాగ్రత్తలు తీసుకుని, ఆటగాళ్లను బయోబబుల్‌లో ఉంచినప్పటికీ ఆటగాళ్లు కరోనా బారిన పడడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే టోర్నీని వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ మంగళవారం నిర్ణయం తీసుకుంది. దీంతో ఆటగాళ్లంతా తమ తమ ఇళ్లకు చేరుకున్నారు. తమ తమ పనుల్లో బిజీ బిజీ అయిపోయారు. ఒక్కొక్కరూ ఒక్కో పనిలో బిజీగా ఉన్నారు. ఇక టీమిండియా ఓపెనర్, ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆటగాడు శిఖర్ ధవన్ కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నాడు. దీనికి సంబంధించిన ఫోటోను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

వ్యాక్సిన్ వేయించుకున్న అనంతరం ఆ ఫోటోను ట్విటర్లో షేర్ చేసిన ధవన్..‘వ్యాక్సినేషన్‌ పూర్తయింది. ఈ కష్ట కాలంలో కూడా ఫ్రంట్ లైన్ వారియర్స్ ముందు వరుసలో నిలబడి ఎంతో అంకితభావంతో తమ విధులను నిర్వర్తిస్తున్నారు. వారికి కేవలం ధన్యవాదాలు ఏ మాత్రం సరిపోవు. వ్యాక్సినేషన్‌ విషయంలో సందేహాలు వద్దు. వెంటనే వేయించుకోండి. కరోనాను జయించండి’ అని రాసుకొచ్చాడు. ఇక ధవన్ ట్వీట్‌పై నెటిజన్లు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. నిజంగా ఫ్రంట్ లైన్ వారియర్స్ చాలా గ్రేట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇంకొంతమంది వ్యాక్సిన్ వేయించుకుని గొప్ప పని చేశావంటూ ధవన్‌ను అభినందిస్తున్నారు.


కోహ్లీ విరాళాల సేకరణ:
ఐపీఎల్ నుంచి బయటకు వచ్చిన ఆటగాళ్లలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కరోనా బాధితుల కోసం క్యాంపెయినింగ్ మొదలు పెట్టాడు. ఈ విషయాన్ని భార్య అనుష్కతో కలిసి సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. తామిద్దరం కలిసి ‘ketto’ వెబ్‌సైట్‌ ద్వారా విరాళాలు సమీకరించనున్నట్లు వెల్లడించారు. మొదటి విరాళంగా తామిద్దరూ రూ.2 కోట్లు ఇస్తున్నామని, అలాగే ఈ క్యాంపెయినింగ్ ప్రారంభిస్తున్నామని ద్వారా మొత్తంగా రూ.7 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని విరుష్క జోడీ వెల్లడించింది.

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -