ప్రతి ఒక్కరికీ ఏదో ఒకటి సాధించాలని ప్యాషన్ ఉంటుంది. కానీ దానికి ఎన్నో అవరోధానలు ఏర్పడతాయి. వాటన్నింటినీ దాటుకుని ముందుకొచ్చి తనకు నచ్చిన దానిని సాధించే వారు చాలా తక్కువగా ఉంటారు. అలాంటి వారిలో ఒకరు కివీస్ యంగ్ ఓపెనర్ డెవాన్ కాన్వే. లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌తో జాతీయ జట్టులోకి అరంగేట్రం చేసిన కాన్వే తొలి మ్యాచ్‌లోనే తానేంటో నిరూపించుకున్నాడు. అత్యద్భుతమైన ద్విశతకాన్ని సాధించి, ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. అయితే ఇది అతడికి అంత సులువుగా దక్కలేదు. దీని కోసం తన జీవితంలో ఎంతో విలువైన వాటిని వదులుకు్నాడు కాన్వ గత జీవితంలో చాలా ఎత్తుపల్లాలుంటాయి. క్రికెట్ అంటే అమితంగా ఇష్టపడే కాన్వే.. ట్రైనింగ్ కోసం ఇల్లు, కారు సహా చాలా ఆస్తులు అమ్ముకున్నాడు. పుట్టింది దక్షిణాఫ్రికాలోనే అయినా.. క్రికెట్ కోసం దేశాన్ని వీడి న్యూజిలాండ్ బాట పట్టాడు. 2017 మార్చిలో దక్షిణాఫ్రికా దేశవాలీ క్రికెట్‌లో ఆఖరి మ్యాచ్ ఆడిన కాన్వే.. అందులో డబుల్ సెంచరీ సాధించి శభాష్ అనిపించుకున్నాడు. కానీ ఆ తర్వాత ఆ దేశాన్ని వదిలి న్యూజిల్యాండ్ బయలుదేరాడు.
సౌత్‌ఆఫ్రికా నుంచి న్యూజిల్యాండ్ చేరుకోవడానికి కాన్వేకు అతడి స్నేహితులు సాయం చేశారు. వెల్లింగ్టన్ చేరుకున్న కాన్వే తన క్రికెట్ కెరీర్‌ను కొనసాగించాడు. విక్టోరియా క్రికెట్ క్లబ్ కోచ్‌గా, బ్యాట్స్‌మెన్‌గా డ్యుయల్ రోల్ పోషిస్తూ, అవకాశాల కోసం ఎదురు చూశాడు. రెండేళ్లకు అతడి ఆశ ఫలించింది. కల నెరవేరింది. న్యూజిలాండ్ జాతీయ జట్టులో చోటు దక్కింది. వచ్చిన అవకాశాన్ని కాన్వే రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు. టెస్ట్, టీ20, వన్డే.. ఫార్మాట్ ఏదైనా బ్యాటుతో బౌండరీలు బాదడమే ధ్యేయంగా అనతి కాలంలోనే ఎన్నో రికార్డులు సాధించాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో అరంగేట్రంలోనే డబుల్ సెంచరీ సాధించిన అతను.. అండర్సన్, బ్రాడ్ లాంటి ప్రపంచ స్థాయి బౌలర్లను ధీటుగా ఎదుర్కొని నిలబడి క్రికెట్ మక్కాలో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు. అంతేకాకుండా దశాబ్దాల నాటి రికార్డులను బద్దలు కొట్టి.. కివీస్ జట్టుకు క్రికెట్ హీరోగా మరాడు
ఇదిలా ఉంటే ఓపెనర్‌గా వచ్చిన కాన్వే.. 347 బంతుల్లో 22 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 200 పరుగులు చేశాడు. ఈ క్రమంలో పలు అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. అతని బ్యాటింగ్ తీరు చూసిన ఏబీ డివిలియర్స్ ఫిదా అయ్యాడు. క్రికెట్‌ను ప్రాణంగా ప్రేమించే మరో స్టార్ పుట్టుకొచ్చాడంటూ ప్రశంసలతో ముంచెత్తాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పటివరకు 14 టీ20లు, 3 వన్డేలు, ఒక టెస్ట్ మ్యాచ్ ఆడిన కాన్వే.. టీ20ల్లో 151.12 సగటులో 473 పరుగులు(4 అర్ధశతకాలు), వన్డేల్లో 75 సగటులో 225 పరుగులు(సెంచరీ, హాఫ్ సెంచరీ), టెస్ట్‌లో 200 పరుగులు సాధించాడు.