Sunday, March 22, 2026

పొట్టి ప్రపంచ కప్ ఎప్పుడో తేల్చి చెప్పిన ఐసీసీ

క్రికెట్ ప్రేమికులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూఅతున్న పొట్టి ప్రపంచకప్ అతి త్వరలో ప్రారంభం కానుంది. దీనికి సంబంధికి ఐసీసీ కీలక ప్రకటన చేసింది. టీ20 ప్రపంచకప్‌ టోర్నీ నిర్వహణ తేదీని ఐసీసీ మంగళవారం ట్విటర్‌ వేదికగా అధికారిక ప్రకటన చేసింది.

అక్టోబర్‌ 17 నుంచి నవంబర్‌ 14 వరకు టోర్నీని నిర్వహించనున్నట్లు తెలిపింది. తాజాగా ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ టోర్నీలో మ్యాచ్‌లను యూఏఈతో పాటు ఒమన్‌లో నిర్వహించనున్నట్లు ప్రకటనలో తెలిపింది.

భారత్‌లో క‌రోనా సెకండ్ వేవ్ బీభ‌త్సం సృష్టించిన నేప‌థ్యంలో వ‌ర‌ల్డ్‌క‌ప్ టోర్నీ నిర్వహణ వేదిక‌ల‌ను మార్చాల్సి వ‌చ్చింది. బీసీసీఐ ఆతిథ్యంలోనే ఈ టోర్నీ మొత్తం జ‌రుగనుందని ఐసీసీ స్పష్టం చేసింది.

టోర్నీలో భాగంగా మొత్తం నాలుగు వేదిక‌ల్లో మ్యాచ్‌లు ఉంటాయి. దుబాయ్ ఇంట‌ర్నేష‌న‌ల్ స్టేడియం, ద షేక్ జాయెద్‌ స్టేడియం(అబుదాబి), షార్జా స్టేడియం, ఒమ‌న్ క్రికెట్ అకాడ‌మీ గ్రౌండ్‌లో మ్యాచ్‌ల‌ను నిర్వహించ‌నున్నారు.

ఇదిలా ఉంటే.. టోర్నీలో తొలి రౌండ్‌లో అర్హత సాధించిన 8 జ‌ట్లను రెండు గ్రూపులుగా విడగొడతారు. ఆ రెండు గ్రూపులూ ఒమ‌న్‌, యూఏఈ దేశాల్లో వరుస మ్యాచ్‌ల్లో తలపడతాయి. ఈ జ‌ట్ల నుంచి టాప్ లో ఉన్న 4 టీమ్‌లు సూప‌ర్‌12కు అర్హత సాధిస్థాయి.

ఆ జ‌ట్ల మధ్య 8 ఆటోమెటిక్ క్వాలిఫైయ‌ర్స్‌ మ్యాచులు జరుగుతాయని ఐసీసీ త‌న ట్వీటర్ వేదికగా వెల్లడించింది. ఇక సోమవారం టీ20 ప్రపంచకప్‌ వేదికలను భారత్‌ నుంచి యూఏఈకి తరలించినట్లు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ వెల్లడించిన సంగతి తెలిసిందే.

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -