Sunday, March 22, 2026

అంపైర్ అవుట్ ఇవ్వలేదని, వికెట్లను తన్ని, పీకి పారేసిన షకిబ్

అంపైర్ అవుట్ ఇవ్వలేదని బంగ్లాదేశ్ స్టార్ ఆల్‌‌రౌండర్ షకీబ్ అల్ హసన్ మైదానంలో రచ్చ రచ్చ చేశాడు. తన బౌలింగ్ లో అవుట్ ప్రత్యర్థి బ్యాట్స్‌మన్ అవుటైనా.. అంపైర్ అవుటివ్వకపోవడం వెంటనే నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లోని వికెట్లను షకిబ్ బలంగా కాలితో తన్నాడు. అంతటితో ఆగకుండా అంపైర్‌ను నోటికొచ్చినట్లు తిడుతూ.. అతనిపైకి దూసుకెళ్లాడు. అలాగే మరో వికెట్ విషయంలోనూ అంపైర్‌ను దుర్భాషలాడిన షకిబ్.. ఈ సారి వికెట్లను మొత్తంగా గిరాటేశాడు.

ప్రస్తుతం బంగ్లాదేశ్‌‌లో జరుగుతున్న ఢాకా ప్రీమియర్ డివిజన్ టీ20 క్రికెట్ లీగ్‌లో షకిబ్ ఆడుతున్నాడు. అయితే తాజా మ్యాచ్‌లో అతడి ప్రవర్తన ఇప్పుడు క్రికెట్ లోకాన్నే దిగ్భాంతికి గురి చేస్తోంది. ఈ టోర్నీలో షకిబ్ అల్ హసన్ మహమ్మదెన్ స్పోర్టింగ్ క్లబ్‌ జట్టుకు ప్రతినిథ్యం వహిస్తున్నాడు. తాజాగా ఈ జట్టు అబహాని లిమిటెడ్ జట్టుతో తలపడింది. మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన షకీబ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 145 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన అబహాని లిమిటెడ్ జట్టు ఆచితూచి ఆడుతున్న క్రమంలో, షకీబ్ ఐదో ఓవర్ బౌల్‌ చేశాడు. ఈ ఓవర్‌లో తొలి రెండు బంతులను అబహాని బ్యాట్స్‌మెన్‌ ముష్ఫికర్ వరుసగా సిక్స్‌, ఫోర్ బాదాడు.

అయితే, ఆ మరుసటి బంతి ముష్ఫికర్‌ బ్యాట్‌ను మిస్‌ అయి ప్యాడ్లను తాకింది. దీంతో ఎల్బీ కోసం గట్టిగా అప్పీల్ చేసిన షకీబ్.. అంపైర్ నాటౌట్ ఇవ్వడంతో సహనం కోల్పోయాడు. ఆగ్రహంతో అతనిపైకి దూసుకెళ్తూ నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లోని వికెట్లను గట్టిగా తన్నాడు. కాగా, షకీబ్‌ ఇదే మ్యాచ్‌లో మరోసారి అంపైర్ నిర్ణయం పట్ల అసహనానికి గురయ్యాడు.

ఈ క్రమంలోనే అంపైర్‌ నిర్ణయంపై పూర్తి అసహనానికి గురైన షకిబ్.. మతి కోల్పోయినట్లు ప్రవర్తించాడు. అసహనంతో వికెట్లను తన్నడంతో పాటు అంపైర్‌ పైకి దూసుకెళ్లాడు. అలాగే అదే మ్యాచ్ దాదాపు పూర్తయిన సమయంలో స్లిప్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న షకిబ్.. మరోసారి అంపైర్‌తో వాగ్వాదానికి దిగాడు. అంపైర్‌ను దుర్భాషలాడుతూ, వికెట్లను పీకి విసిరేశాడు. అయితే షకీబ్‌ వ్యవహరించిన తీరు కచ్చితంగా ఐసీసీ నియమావళి ఉల్లంఘన కిందకే వస్తుందని క్రికెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. మరి దీనిపై బీసీబీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఒకవేళ కఠిన చర్యలే తీసుకుంటే షకిబ్ కెరీర్ దాదాపు ముగిసినట్లే అవుతుందని కూడా అంచనాలున్నాయి.

కాగా.. షకీబ్‌ ఇలా ప్రవర్తించడం ఇది తొలిసారేమీ కాదు. గతంలోనూ అనేకసార్లు ఈ తరహా ప్రవర్తనతోనే మందలింపుకు గురయ్యాడు. అయితే తాజా వీడియోలపై బంగ్లా క్రికట్‌ బోర్డు స్పందిస్తే మాత్రం అతనిపై కఠిన చర్యలు తప్పకపోవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -