హైదరాబాద్: బ్లాక్ ఫంగస్ ఔషధాలను బ్లాక్‌లో విక్రయించే వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. జిల్లా వ్యాప్తంగా ప్రతి రోజూ ఇలాంటి కేసులు నమోదవుతూనే ఉన్నాయి. సాధారణ ప్రజలు కూడా డబ్బుల కోసం ఈ పాడుపనికి పాల్పడుతున్నారు. గురువారం ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడుతున్న ఓ ముఠాను పేట్‌బషీరాబాద్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పేట్‌బషీరాబాద్ సీఐ ఎస్.రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం… మిర్యాలగూడకు చెందిన బి.రేఖ(30) గాంధీ ఆసుపత్రిలో అవుట్‌సోర్సింగ్ విభాగంలో స్టాఫ్ నర్సుగా పనిచేస్తోంది. బ్లాక్ ఫంగస్ మందులు రోగులకు ఇవ్వకుండా ఆసుపత్రి నుంచి దొంగిలించింది. ఈ విషయం ముషీరాబాద్ బాపూజీనగర్‌కు మాదవేని మహేశ్(30)కు చెప్పింది. అతను అదే ప్రాంతానికి చెందిన మెడికల్ దుకాణంలో పనిచేసే అలేటి రాజు(35)కు ఈ విషయాన్ని చేరవేశాడు. వీరిద్దరూ కలిసి సీతాఫల్‌మండికి చెందిన మెడికల్ రిప్రజెంటేటివ్ డేగల ప్రకాశ్(42)తో కలిసి రేఖ వద్ద ఉన్న నాలుగు బ్లాక్ ఫంగస్ ఇంజక్షన్లు బ్లాక్‌లో విక్రయించేందుకు నిర్ణయించుకున్నారు. ఆమె వద్ద నుంచి తీసుకున్న ఇంజక్షన్లను సుచిత్రా కూడలిలోని ఓ కార్పొరేట్ ఆసుపత్రి వద్ద రోగులకు ఒక్కో ఇంజక్షన్ రూ.38 వేల నుంచి రూ.40 వేల వరకు విక్రయించేందుకు ప్రయత్నించారు. అయితే దీనికి సంబంధించి సమాచారం అందడంతో బాలానగర్ ఎస్‌ఓటీ పోలీసులు, పేట్‌బషీరాబాద్ పోలీసులు కలిసి.. నిందితులు నలుగురినీ అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
మరికొన్ని కేసులు:
బంజారాహిల్స్‌లో ఓ మందుల దుకాణంలో పని చేసే శ్రీకాకుళం జిల్లాకు చెందిన గదవరాజు అప్పలరాజు(33) అనే వ్యక్తి.. ఫిల్మ్‌నగర్‌కు చెందిన0 నిజామాబాద్ జిల్లా బోదన్ నివాసి మారుతితో కలిసి.. నేరేడ్‌మెట్‌లో ప్రకాశ్ అనే మందుల దుకాణం నిర్వాహకుని వద్ద మందులు కొనుగోలు చేసి అధిక ధరకు విక్రయిస్తున్నారు. సమాచారం అందడంతో గురువారం ఎస్‌ఓటీ, పేట్‌బషీరాబాద్ పోలీసులు వీరిని అదుపులోనికి తీసుకుని రిమాండ్‌కు పంపారు. వారి నుంచి 2 ఇంజక్షన్లు స్వాధీనం చేసుకొన్నారు.
పొత్నూరు ముకుందరావు(32) యూసుఫ్‌గూడలో శ్రీసాయి మణికంఠ పేరుతో మెడికల్ షాప్ నిర్వహిస్తున్నాడు. కాకినాడకు చెందిన కడియాల చిరంజీవి(22), అదే ప్రాంతానికి చెందిన వీడియోగ్రాఫర్ కాకర్పల్లి సతీష్(22)తో కలిసి ఒక్కో ఇంజక్షన్ రూ. 35వేలకు విక్రయిస్తున్నారు. నిమ్స్ సమీపంలో వాటిని విక్రయిస్తుండగా టాస్క్ ఫోర్స్ పోలీసులు వారిని అక్కడే అదుపులోకి తీసుకుని 30 ఇంజక్షన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పంజాగుట్ట పోలీసులకు అప్పగించారు. వారు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
కూకట్‌పల్లికి చెందిన గంగొల్ల మనీష్ (23) విద్యార్థి. తండ్రికి చెందిన మెడికల్ దుకాణానికి అప్పుడప్పుడు వెళ్లి చూసుకుంటుంటాడే. ఈ క్రమంలోనే ‘బ్లాక్ ఫంగస్’ ఇంజక్షన్‌ను నల్లబజార్‌లో విక్రయించి సొమ్ము చేసుకోవాలని భావించాడు. దీంతో ఓ వ్యక్తితో బేరం కుదుర్చుకుని విక్రయించేందుకు బుధవారం దిల్‌సుఖ్‌నగర్‌లోని కొత్తపేటకు వచ్చాడు. సమాచారం అందుకున్న ఎల్బీనగర్ ఎస్వోటీ పోలీసులు అతడిని అదుపులోనికి తీసుకున్నాడు.