Friday, November 1, 2024

రూటు మార్చిన బ్లాక్ ఫంగస్.. పేగుల్లో చేరి..

దేశం మొత్తం కరోనా తగ్గుతోంది. కానీ మరో మహమ్మారి బ్లాక్ ఫంగస్‌(మ్యూకోర్‌ మైకోసిస్‌) విజృంభించడం మొదలుపెట్టింది. నానాటికీ కేసుల సంఖ్య పెరుగుతూ పోతోంది. ఇది తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. తాజాగా, దేశ రాజధాని ఢిల్లీలో అరుదైన బ్లాక్‌ ఫంగస్‌ కేసులు రెండు బయటపడ్డాయి. శనివారం కరోనా బాధితుల చిన్న ప్రేగులో బ్లాక్‌ ఫంగస్‌ చేరినట్లు వైద్యులు గుర్తించారు. కరోనా బారిన పడిన ఓ 56 ఏళ్ల వ్యక్తి గత కొద్దిరోజులుగా కరోనాకు చికిత్స తీసుకుంటున్నాడు. 3 రోజుల క్రితం అతడి కడుపులో నొప్పి ప్రారంభమైంది. దీంతో గ్యాస్ట్రిక్‌ ప్రాబ్లమ్‌గా భావించిన అతడు సంబంధిత మందులు వాడి ఊరుకున్నాడు. సరైన వైద్యం తీసుకోకుండా 3 రోజుల పాటు నొప్పిని నిర్లక్ష్యం చేశాడు. అయినా నొప్పి తగ్గకపోవటంతో చివరిగా నాలుగో రోజు సర్‌ గంగారామ్‌ హాస్పిటల్‌కు వెళ్లి విషయం చెప్పాడు. దీంతో అతడికి సిటీ స్కాన్‌ చేసిన డాక్టర్లు షాకయ్యరు. అతడి చిన్న పేగులో రంథ్రాలు ఉన్నట్లు పరీక్షల్లో తేలింది. అంతేకాకుండా కరోనా ముదిరి ఆరోగ్య పరిస్థితి విషమించింది.

అలాగే 68 ఏళ్ల మరో కరోనా బాధితుడి విషయంలోనూ ఇలాంటి పరిస్థితే చోటు చేసుకుంది. అతడి చిన్న పేగులోనూ అలాంటి రంథ్రాలున్నట్లు తేలింది. వాటిపై పరీక్షలు నిర్వహించగా ఇద్దరి చిన్న ప్రేగులకు బ్లాక్‌ ఫంగస్‌ సోకినట్లు నిర్ధారణ అయింది. కాగా, ఇద్దరికీ కరోనాతో పాటు డయాబెటీస్‌ కూడా ఉంది. ఇద్దరిలోనూ ఒకే లక్షణాలు ఉండడం ఇప్పుడు సంచలనంగా మారుతోంది.

కాగా.. కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన లెక్కల ప్రకారం.. ఈ నెల 21 నాటికి దేశవ్యాప్తంగా 8,848 బ్లాక్‌ ఫంగస్ కేసులు నమోదయ్యాయి. గుజరాత్‌లో అత్యధికంగా 2,281 మందికి ఈ వ్యాధి సోకగా.. మహారాష్ట్రలో 2,000, ఆంధ్రప్రదేశ్‌లో 910 మంది దీని బారిన పడ్డారు. మొత్తం కేసుల్లో ఈ 3 రాష్ట్రాల వాటా 58.66 శాతం.

పలు రాష్ట్రాల్లో వెలుగుచూస్తోన్న బ్లాక్‌ ఫంగస్‌ కేసుల ఆధారంగా ఆంఫోటెరిసిన్‌-బీ ఔషధాన్ని ఆయా రాష్ట్రాలకు కేటాయింపులు జరిపినట్లు కేంద్ర మంత్రి సదానంద గౌడ శనివారం ట్విటర్ ద్వారా వెల్లడించారు. ఇక ఇదేమీ కొత్త వ్యాధి కాకపోయినా.. దీని బారినపడిన వారికి రోజుల్లోనే పరిస్థితి విషమిస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా శరీరంలోని రక్షణ వ్యవస్థ ఈ ఫంగల్ వ్యాధిని తిప్పికొడుతుంది. అయితే రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, క్యాన్సర్ రోగులు, అవయవ మార్పిడి చికిత్సలు చేయించుకున్నవారు దీని బారిన పడే అవకాశం ఉందని సదానంద గౌడ తన ట్వీట్ ద్వారా వెల్లడించారు.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x