Sunday, March 22, 2026

ఊపిరితిత్తులే డెల్టా ప్లస్ టార్గెట్.. మిగతా వాటికంటే..

భారత్‌లో కొత్తగా బయటపడిన కరోనా డెల్టా ప్లస్ వేరియంట్ మిగతా వాటితో పోల్చితే అత్యంత దారుణ ప్రభావమే చూపుతోందట. ఇతర వేరియంట్ల కంటే ఇది అధికంగా ఊపిరితిత్తుల్లో కేంద్రీకృతమవుతున్నట్టు కొవిడ్ వర్కింగ్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ ఎన్‌కే అరోరా చెప్పారు.

అయితే దీనివల్ల వ్యాధి తీవ్రత పెరుగుతుందా లేదా వ్యాధి వ్యాప్తి తీవ్రమవుతుందా అనేది ఇప్పుడే చెప్పలేమని ఆయన పేర్కొన్నారు.

డెల్టా ప్లస్‌ను జున్ 11న తొలిసారిగా శాస్త్రవేత్తలు గుర్తించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఈ వేరియంట్‌ను ప్రభుత్వం ఆందోళనకరమైన వైరస్‌గా గుర్తించింది.

ఈ కొత్త వేరియంట్ కారణంగా కరోనా సంక్షోభం ఎలాంటి పరిస్థితులకు చేరుతుందో తెలియాలంటే ఇంకా డెల్టా ప్లస్ కేసులు వెలుగులోకి రావాలని, అప్పుడే దీని ప్రభావం గురించి పూర్తి అవగాహన వస్తుందని డాక్టర్ ఆరోరా పేర్కొన్నారు.

‘పరిస్థితులను నిశితంగా గమనిస్తూ..వైరస్ వ్యాప్తిని విశ్లేషించాలి. అప్పుడే ఈ వేరియంట్‌కున్న వ్యాప్తి సామర్థ్యం ఎంతడిదో అంచనా వేయచ్చ’ని డాక్టర్ అరోరా పేర్కొన్నారు.

కాగా.. ఇప్పటివరకు కోవిడ్ డెల్టా వేరియంట్ వైరస్ అత్యంత ప్రమాదకరమైనదిగా శాస్త్రవేత్తలు భావించారు. అయితే ఇప్పుడు దీనికంటే ప్రమాదకరమైన డెల్టా ప్లస్ వేరియంట్ బయటపడటంతో ఇప్పుడు సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -