కరోనా పుట్టినిల్లు చైనాలో వైరస్ తగ్గినట్లే తగ్గి మళ్లీ విజృంభిస్తోంది. వైరస్‌ను కట్టడి చేశామని ఆనందించేలోపే మళ్లీ కొత్త కేసులు నమోదవుతుండటంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. 20 కొత్త కేసులు బయటపడటం అధికారుల్లో ఆందోళన రేకిత్తిస్తోంది. అప్రమత్తమైన ప్రభుత్వం పలు ప్రాంతాల్లో కఠిన ఆంక్షలు విధించింది. తదుపరి ఆదేశాల వరకు అందరూ ఇళ్లల్లోనే ఉండాలని ఆదేశించింది.
చైనాలో ప్రతి రోజూ కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నా.. వారంతా విదేశాలకు చెందిన వారు కావడంతో తమ దేశంలో కరోనాను అంతమొందించామని చైనా చెప్పుకుంది. తమ దేశంలో కరోనాను కట్టడి చేశామంటూ గొప్పగా చెప్పుకుంటున్న సమయంలో తాజాగా 20 మంది స్థానికులు మళ్లీ కరోనా బారిన పడడంతో కలకలం మొదలైంది. అది కూడా కొత్త వారికి సోకింది కొత్త స్ట్రేయిన్ అని, అది మునుపటి స్ట్రెయిన్‌లతో పోల్చితే ఈ స్ట్రెయిన్ మరింత ప్రమాదకరమని తేలడం వారి ఆందోళన రెట్టింపైంది.
చైనాలోని గాంజావ్ నగరంలో 1.5 కోట్ల మంది నివాసముంటారు. ఈ నగరంలోనే గత వారం రోజుల్లో 20 వరకు కొత్త స్ట్రెయిన్ కేసులు బయటపడ్డాయి. తాజా వేరియంట్ మునుపటి వేరియంట్లకంటే ప్రమాదకరమైనదే కాకుండా వ్యాప్తి కూడా ఉధృతంగా ఉంటుందని నిపుణులు వెల్లడిస్తున్నారు. దీనికి సంబంధించి చైనా అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్ ఓ ప్రముఖ కథనాన్ని కూడా ప్రచురితమైంది.
కరోనా కొత్త వేరియంట్ బయటపడడంతో దీని వ్యాప్తిని తెలుసుకునేందుకు చైనా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కొత్త వేరియంట్ అన్వేషణలో భాగంగా లివాన్ జిల్లాలో శనివారం పరీక్షలు నిర్వహించనున్నారు. జిల్లాలోని 5 ప్రాంతాల్లో ప్రజలకు పరీక్షలు నిర్వహించనుంది. బహిరంగ మార్కెట్లు, శిశు సంరక్షణ కేంద్రాలు, సాంస్కృతిక కార్యకలాపాలు, రెస్టారంట్లపై నిషేధం విధించింది. బహిరంగ కార్యక్రమాలను పరిమితం చేయాలని లివాన్‌కు చుట్టుపక్కల 4 జిల్లాల అధికారులకు ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేసింది.