Thursday, November 21, 2024

మాతో పెట్టుకుంటే అథోగతే.. ఆ దేశాలకు జిన్‌పింగ్ స్ట్రాంగ్ వార్నింగ్

చైనా అధ్యక్షుడు, ఆ దేశ కమ్యూనిస్టు పార్టీ జనరల్ సెక్రటరీ జీ జిన్‌పింగ్ తమ శత్రు దేశాలపై నిప్పులు చెరిగారు. శత్రువులు చైనాకు హాని కలిగించేందుకు, పలుకుబడిని చూపించడానికి ప్రయత్నిస్తే, మహా ఉక్కు గోడకు ఢీకొన్నట్లేనని తెలిపారు.

చైనాను వేధించే రోజులు శాశ్వతంగా తొలగిపోయాయని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ పేర్కొన్నారు. తియనాన్మెన్‌ స్క్వేర్‌లో చైనా కమ్యూనిస్టు పార్టీ శతవార్షికోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

మావోను తలపించేలా వస్త్రధారణ చేసిన షీ జిన్‌పింగ్‌.. మాటల్లో కూడా మావోలానే చాలా దూకుడుగా మాట్లాడారు. చైనా, తైవాన్ పునరేకీకరణకు కట్టుబడి ఉన్నామని, హాంగ్ కాంగ్ పరిస్థితులను ప్రస్తావిస్తూ, చైనా భద్రత, సార్వభౌమాధికారాలను కాపాడుతూ, హాంగ్ కాంగ్‌లో సాంఘిక సుస్థిరతను సాధిస్తామని చెప్పారు.

‘‘మేం న్యాయాన్ని సమర్థిస్థాం. బలంతో బెదిరింపులకు దిగితే లొంగే ప్రస్తక్తే లేదు. ఓ దేశంగా మేం గట్టి ఆత్మవిశ్వాసంతో సగర్వంగా నిలుస్తాం. ఏ ఇతర దేశ ప్రజలకు మేము హాని చేయలేదు. వారిని అణచివేయలేదు.

వారిపై ఆధిపత్యం చెలాయించలేదు. మేం ఎన్నటికీ అలా చేయబోం. అదే సమయంలో మమ్మల్ని అణగదొక్కడానికి, మాకు హాని చేయడానికి లేదా మాపై ఆధిపత్యం చలాయించడానికి ఏ విదేశీ శక్తికీ అవకాశం ఇవ్వబోం.

ఎవరైనా అలా చేయడానికి ప్రయత్నిస్తే, 140 కోట్ల మందికిపైగా ఉన్న చైనీయులతో నిర్మితమైన మహా ఉక్కు గోడను తమంతట తాముగా వారు ఢీకొన్నట్లే’’ అని జిన్‌పింగ్ తీవ్ర హెచ్చరికలు చేశారు.

ఇదిలా ఉంటే కోవిడ్-19 మహమ్మారి విజృంభణ తరువాత అమెరికా-చైనా మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. జిన్ పింగ్‌ను టార్గెట్ చేస్తూ.. డైరెక్ట్‌గానే విమర్శలు గుప్పించారు.

కరోనా మూలాలను చైనా ఉద్దేశపూర్వకంగానే దాచిపెడుతోందని మరికొన్ని విదేశాలు కూడా భావిస్తున్నాయి. ఇటువంటి సమయంలో స్వదేశంలో కోవిడ్-19ను నియంత్రించడంలో చైనా విజయవంతమైంది. ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకుంటోంది.

ఈ పరిణామాలు అంతర్జాతీయ స్థాయిలో దూకుడుగా వ్యవహరించడానికి చైనాకు అవకాశం ఇస్తున్నాయి.

వందేళ్ల వేడుకల్లో ప్రత్యేక కార్యక్రమాలు:
చైనా వందేళ్ల వేడుకల నేపథ్యంలో జిన్‌పింగ్ నిర్వహించిన సభకు 70 వేల మంది ప్రజలు హాజరయ్యారు. ఈ క్రమంలోనే తియానన్మెన్ స్క్వేర్‌లో 71 సైనిక విమానాలు ప్రత్యేక విన్యాసాలు నిర్వహించాయి.

సీపీసీ వందేళ్ళ సంబరాలను గుర్తు చేస్తూ ‘‘100’’ ఆకారంలో హెలికాప్టర్లు ఎగిరాయి. అంతేకాకుండా కొందరు వీక్షకులు జీ జిన్‌పింగ్ మాట్లాడేటపుడు ఓ పద్ధతి ప్రకారం.. చప్పట్లు కొడుతూ ఆయనను ప్రోత్సహించడం గమనార్హం.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x