Sunday, March 22, 2026

viral video: వ్యాక్సిన్ కోసం వందలమంది తొక్కిసలాట.. కారణం ఏంటంటే

ఈ ఫోటోలో జనాల తొక్కిసలాట చూస్తే, ఏదో స్టార్ హీరో సినిమా దగ్గర టికెట్ల కోసమే, లేదా ఏదైనా ఫ్రీ ఆఫర్ కోసమే జరుగుతున్నట్లు ఉంది కదూ..! కానీ మీరు అలా అనుకుంటే కచ్చితంగా తప్పులో బోల్తా కొట్టినట్లే.

ఎందుకంటే ఈ పరుగులు పెడుతున్నవారంతా.. కోవిడ్ వ్యాక్సిన్ కోసం అలా కిందా మీదా పడుతూ దూసుకొస్తున్నారు.

కోవిడ్ మహమ్మారి నుంచి రక్షణ పొందేందుకు టీకా వేయించుకోడానికి ఇలా తండోపతండాలుగా తరలివచ్చారు. వందల మంది జనాలు ఒకరిపై ఒకరు పడుతూ.. నెట్టుకుంటూ వ్యాక్సిన్ కోసం పోటీ పడ్డారు.

ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని చింద్వారా జిల్లాలో జరిగింది. స్థానిక సాసర్ మండలంలోని లోధిఖేడ గ్రామంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

వ్యాక్సినేషన్ సెంటర్లో వ్యాక్సిన్ నిల్వలు నిండుకుంటున్నాయని సమాచారం అందడంతో చుట్టుపక్కల జనాలంతా ఇలా తండోపతండాలుగా తరలివచ్చారు.

అంతమంది ఒక్కసారిగా అక్కడకు చేరుకోవడమే కాకుండా, వ్యాక్సిన్ తమకు కావాలంటే తమకు కావాలని పోటీ పడడంతో ఈ తొక్కిసలాట చోటు చేసుకుంది. అయితే దీనిపై నెటిజన్లు కూడా రకరకాలుగా స్పందిస్తున్నారు.

నిన్న మొన్నటివరకు వ్యాక్సిన్ గురించి ఆలోచించని వారు కూడా ఇప్పడు వ్యాక్సిన్ కోసం ఇలా పరుగులు పెట్టడం విచిత్రంగా ఉందని, కొందరంటుంటే.. మరికొందరు మాత్రం.. వ్యాక్సిన్ తీసుకోవడం అంటుంచితే.. సోషల్ డిస్టెన్సింగ్, మాస్క్ ధరించడం వంటి నిబంధనలన్నింటికీ ఈ దెబ్బతో నీళ్లొదిలేసినట్లున్నారే..’ అంటూ చురకలంటిస్తున్నారు.

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -