Friday, November 1, 2024

పేదల కోసం వైఎస్‌ఆర్ బీమా.. నేడు ప్రారంభించిన సీఎం జగన్

ఏపీ ప్రజల కోసం రాష్ట్ర సర్కార్ సరికొత్త వైఎస్సార్‌ బీమా పథకాన్ని ప్రారంభించింది. తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన గురువారం జరిగిన ఉన్నతాధికరుల సమావేశంలో ఆయన స్వయంగా ఈ పథకాన్ని ప్రారంభించారు.

పలువురు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిథుల సమక్షంలో ఈ పథకాన్ని సీఎం వైఎస్ జగన్ వర్చువల్‌గా ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. రూ.750 కోట్లతో వైఎస్‌ఆర్‌ బీమా పథకం ప్రారంభించామని తెలిపారు.

దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారందరికీ వర్తించే ఈ పథకం కింద కుటుంబ పోషకులు సహజ మరణం పొందినా, ప్రమాదవశాత్తు చనిపోయినా పరిహారం అందేలా వైఎస్సార్‌ బీమా పథకాన్ని రూపొందించినట్లు తెలిపారు.

‘అందరూ ఆరోగ్యంగా ఉండాలని తాను కోరుకుంటున్నా. కానీ కొన్ని సార్లు అనుకోని సంఘటనలు జరుగుతుంటాయి. అలాంటి సమయంలో పేదలు ఇంటి పెద్దను కోల్పోతే వారి దయనీయ స్థితి వర్ణనాతీతం.

అలాంటి వారి కోసమే వైఎస్ఆర్ బీమా పథకాన్ని ప్రారంభించాం. ఈ పథకం ద్వారా 1.32 కోట్ల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుంది. 18-50 ఏళ్ల వ్యక్తి సహజంగా మరణిస్తే రూ.లక్ష బీమా వస్తుంది. 18-70 ఏళ్ల వారు ప్రమాదంలో మరణిస్తే రూ.5 లక్షల వరకు బీమా వస్తుంది.

అలాగే ఒకవేళ శాశ్వత అంగవైకల్యానికి గురైన వారికి కూడా రూ.5లక్షల బీమా అందిస్తాం. అంతేకాదు.. ఈ బీమాను బ్యాంకులతో సంబంధం లేకుండా అమలు చేస్తాం’ అని సీఎం జగన్ అన్నారు.

ఈ పథకానికి సంబంధించి ఏవైనా అనుమానాలు, సందేహాలు ఉంటే 155214 టోల్‌ ఫ్రీ నంబర్‌‌కు కాల్ చేసి నివృత్తి చేసుకోవాలని సూచించారు.

అంతేకాకుండా రూ.5లక్షల వార్షిక ఆదాయం ఉన్నవారిని ఆరోగ్యశ్రీలో చేర్చామని, వేయికి పైగా రోగాలను గుర్తించి ఆరోగ్యశ్రీలో చేర్చామని, కుటుంబ పెద్దను కోల్పోయిన పేద కుటుంబాలకు వైఎస్ఆర్ బీమా అమలు చేస్తామని సీఎం జగన్‌ పేర్కొన్నారు.

అనంతరం వైఎస్ఆర్ బీమాకు సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు.

కేంద్ర తప్పుకున్నా కొనసాగిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం:
ఈ పథకం నుంచి 2020 ఏప్రిల్ నుంచి కేంద్రం తప్పుకుందని, పేదలకు మేలు చేయాలని మొత్తం ఖర్చు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు.

బీమా చెల్లింపునకు అయ్యే పూర్తి ఖర్చు బాధ్యత ప్రభుత్వానిదేనని, 2021-22 ఏడాదికి 1.32కోట్ల పేద కుటుంబాలకు రూ.750 కోట్లతో బీమా కల్పిస్తామని తెలిపారు. ఇప్పటివరకు రెండెళ్లలో మొత్తం రూ.1,307 కోట్ల మేర బీమా రక్షణ అమలులో ఉందని తెలిపారు.

అలాగే ఈ బీమాకు సంబంధించిన పూర్తి బాధ్యత గ్రామ, వార్డు సచివాలయాలకు అప్పగించినట్లు సీఎం వైఎస్‌ జగన్‌ తెలిపారు.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x