Friday, November 1, 2024

42 సార్లు కోవిడ్ బారిన పడి.. 10 నెలలు ఆసుపత్రిలో.. చివరికి..

ఒకసారి కోవిడ్ బారిన పడితేనే ప్రాణాలు ఉంటాయో, పోతాయో అని భయపడిపోతాం. ఇక రెండో సారి కూడా ఆ మహమ్మారి సోకిందంటే డాక్టర్లు కూడా ఆశలు వదిలేసే పరిస్థితులు నెలకొంటాయి.

కానీ ఓ వ్యక్తికి మాత్రం ఏకంగా 42 సార్లు కోవిడ్ సోకింది. ఆశ్చర్యపోయారా..? కానీ ఇది నిజం. ఒకే వ్యక్తి ఏకంగా 42 సార్లు కరోనా బారిన పడ్డాడు.

ఇంగ్లండ్‌లోని బ్రిస్టల్ నగరానికి చెందిన డేవ్ స్మిత్‌ అనే 72 ఏళ్ల వ్యక్తి డ్రైవింగ్ ఇన్‌స్ట్రక్టర్‌గా పనిచేసి కొన్నేళ్ల క్రితం రిటైర్ అయ్యారు. ఆయన ఎంతో కాలంగా ‘హైపర్ సెన్సిటివిటీ నిమోనైటిస్’ అనే రుగ్మతతో బాధపడుతున్నారు.

దీని వల్ల ఆయన శరీరంలో ఇన్‌ఫెక్షన్లను ఎదుర్కొనే శక్తి అంటే రోగ నిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది. అందుకే కరోనా కూడా ఆయనపై ఎన్నోసార్లు దాడి చేసింది.

కోవిడ్ కారణంగా ఆయన ఎన్నో ఇబ్బందులకు గురయ్యారు. 2019లో లుకేమియా బారిన పడడంతో కీమోథెరఫీ ట్రీట్‌మెంట్ జరిగింది. దీని వల్ల కూడా ఆయనలో బలహీనపడ్డారు.

2020వ సంవత్సరం మార్చి నెలలో ఆయనకు మొదటి సారి కరోనా వైరస్ సోకింది. అయినా ఆయన దాన్ని గుర్తించలేకపోయారు.

చివరకు ఆయన బాగా బలహీన పడిపోవడంతో పాటు ఆహార పదార్థాల వాసనను కూడా గుర్తించలేని స్థితికి చేరుకున్నారు.

దీంతో ఏప్రిల్ నెలలో ఆస్పత్రికి తీసుకెళ్లారు. కొన్ని వైద్య పరీక్షలు, కొద్ది రోజుల చికిత్స తర్వాత డేవ్ స్మిత్‌ను ఆస్పత్రి నుంచి ఇంటికి తిరిగి పంపించేశారు.

అయినా ఆయన పరిస్థితి మెరుగవకపోవడంతో మళ్లీ జూలైలో ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు. మళ్లీ కరోనా టెస్టులు నిర్వహిస్తే పాజిటివ్ అని తేలింది. కరోనా నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ కొవిడ్ వచ్చిందని మొదట వైద్యులు అపోహ పడ్డారు.

కానీ ఆయనలో ఉన్న వైరస్ జన్యుక్రమాన్ని పరిశీలించినప్పుడు ఓ షాకింగ్ విషయాన్ని కనుగొన్నారు.

గతంలో సోకిన వైరస్ ఆయన శరీరంలోంచి పూర్తిగా వెళ్లిపోలేదని వైరస్ జన్యుక్రమాన్ని పరిశీలించినప్పుడు తేలింది.

ఆయన శరీరంలో ఉన్నది మృత కరోనా ఆర్ఎన్ఏ కాదనీ, సజీవ కరోనా వైరస్ అని తేల్చేశారు.

దీంతో అప్పటి నుంచి ఆయనకు వైద్యులు ప్రత్యక్ష పర్యవేక్షణలో చికిత్సను ఇవ్వడం మొదలు పెట్టారు.

ఆయనకు మొదటిసారి కరోనా సోకిన 7 నెలల తర్వాత వైద్యులు రెమ్‌డిసివీర్‌ను ఇవ్వడం మొదలు పెట్టారు. అయినప్పటికీ దానితో మెరుగైన ఫలితం కనిపించలేదు.

దీంతో వైద్యులు కరోనా యాంటీబాడీలతో ప్రత్యేకంగా తయారు చేసిన ఔషధాలను డేవ్‌కు ఇచ్చారు. వాస్తవానికి ఇలాంటి చికిత్సకు బ్రిటన్‌లో అనుమతి లేదు.

కానీ ప్రత్యేక పరిస్థితుల కారణంగా అక్కడి ప్రభుత్వం డేవ్‌ కేసు వరకే ఈ అనుమతిని ఇచ్చింది.

ఫలితంగా ఈ తరహా ట్రీట్‌మెంట్ వల్ల 45 రోజుల తర్వాత డేవ్ కరోనా నుంచి కోలుకున్నారు. ఆయన ట్రీట్‌మెంట్ జరుగుతున్న క్రమంలో మొత్తం మీద 42 సార్లు ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

కరోనాతో సుదీర్ఘ పోరాటం అనంతరం 10 నెలల తర్వాత కరోనా నుంచి కోలుకున్న ఆయన ఆనందాన్నిKఈ అంతే లేదు.

‘నేను మా ఇంట్లో వాళ్లకు ఫోన్ చేసి నాపై ఆశలు వదులుకోండి. నేను ఇక తిరిగి రాను. అసలు కోలుకుంటానని నాపై నాకే నమ్మకం లేదు.’ అని డేవ్ ఆసుపత్రిలో ఉన్నప్పుడు డేవ్ చెప్పారట.

ఆయన చనిపోవడం ఖాయమని భావించి నాలుగైదు సార్లు అంత్యక్రియలకు కూడా కుటుంబ సభ్యులు ఏర్పాట్లను చేసుకున్నారట. అయితే ఆయన మాత్రం కరోనాతో సుదీర్ఘ పోరాటం చేసి కొలుకున్నారు. గ్రేట్ కదా!

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x