క్రికెట్ ఈ మధ్యకాలంలో ఫుల్‌గా బ్యాట్స్‌మన్ గేమ్‌గా మారిపోయింది. ప్రతి బంతిని స్టాండ్స్ బయటకు తరలించడానికే బ్యాట్స్‌మన్ ఇష్టపడుతున్నారు. ఇక ఓ ఓవర్లో 6 బంతులను 6 సిక్సర్లుగా మలచడం అంటే మామూలు విషయం కాదు. ఇప్పటివరకు ఈ ఘనతను చాలా తక్కువ మంది మాత్రమే సాధించారు. అంతర్జాతీయ క్రికెట్లో ఈ ఘనత సాధించిన ఆటగాళ్లుగా టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్, సౌత్‌ఆఫ్రికా మాజీ ఓపెనర్ హర్షెల్ గిబ్స్, విండీస్ ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్ వంటి ఆటగాళ్లు ఈ జాబితాలో ఉన్నారు. ఇక లిస్ట్-ఏ క్రికెట్లో కూడా టీమిండియా మాజీ ఆటగాడు రవిశాస్త్రి, శ్రీలంక ఆల్ రౌండర్ తిసార పెరీరా వంటి మరికొంతమంది క్రికెటర్లు కూడా ఈ లిస్ట్ లో ఉన్నారు. కాగా మరో ఆటగాడు ఈ లిస్ట్ లో చేరాడు.తాజాగా జరుగుతున్న యూరోపియన్ క్రికెట్ డొమెస్టిక్ లీగ్‌లో భాగంగా జరుగుతున్న టీ10 లీగ్‌లో ఓ బ్యాట్స్‌మన్ ఈ ఘనత సాధించాడు. ఈసీఎన్‌డీ టీ10 లీగ్ పేరిట ఓ టోర్రీ జరుగుతోంది. ఈ టోర్నీలో భాగంగా శుక్రవారం బేయర్ ఉర్డింజిన్ బూస్టర్స్, కోన్ చాలెంజర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. బేయర్ ఉర్డింజిన్ బ్యాట్స్‌మన్ అరితరన్ వసీకరణ్.. కోన్ ఛాలెంజర్స్ బౌలర్ ఆయుష్ శర్మ బౌలింగ్‌లో ఈ ఫీట్‌ను సాధించాడు. ఇన్నింగ్స్ 5వ ఓవర్‌లో వరుసగా 6 బంతులనూ 6 సిక్సులుగా మలిచి రికార్డు సాధించాడు.
6 sixes in a single over by Aritharan Vaseekaran in European Cricket series. pic.twitter.com/TzvnfOc36F
— Johns. (@CricCrazyJohns) May 21, 2021
Aritharan Vaseekaran, the latest addition to the six-sixes club. #ECST10 pic.twitter.com/nsr5Zf35lX
— srikrishna 🏏 (@1998Srikrishna) May 21, 2021
తొలి రెండు బంతులను మిడ్ వికెట్ మీదుగా, మూడో బంతిని స్క్వేర్‌లెగ్ దిశగా, మళ్లీ నాలుగో బంతిని మిడ్ వికెట్ మీదుగా, ఐదో బంతిని స్క్వేర్‌లెగ్ వైపు, చివరిగా ఆరో బంతిని మిడాన్ దిశగా సిక్సులు బాది రికార్డ్ ఇన్నింగ్స్ బాదేశాడు. వసీకరణ్ క్రీజులోకి వచ్చేసరికి జట్టు స్కోరు 4 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 21 పరుగులతో ఉంది. అతని సిక్సర్ల దెబ్బకు ఒక్క ఓవర్ తిరిగేసరికి 5 ఓవర్లలో 57/3గా నమోదైంది. మొత్తంగా వసీకరణ్ 25 బంతులెదుర్కొని 61 పరుగులు చేశాడు. ఇందులో 7 సిక్స్‌లు, 3 ఫోర్లు ఉన్నాయి.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. బూస్టర్స్ 10 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 115 పరుగులు చేసింది. దీనికి సంబంధించిన వీడియో ఎక్కడ దొరకలేదు. కానీ కొంతమంది నెటిజన్లు తమ ట్విటర్‌లో ఈ విషయాన్ని పంచుకోవడంతో విషయం వైరలైంది.